
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–నునో బోర్జెస్ (పోర్చుగల్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో బోపన్న–బోర్జెస్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో రెండో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జంటను బోల్తా కొట్టించింది.
89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఏడు ఏస్‌లు సంధించింది. మ్యాచ్ మొత్తంలో రెండు జంటలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌లు అనివార్యమయ్యాయి. టైబ్రేక్‌లో బోపన్న–బోర్జెస్ పైచేయి సాధించి విజయాన్ని అందుకోవడంతోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు.