Madrid Open: రన్నరప్‌గా బోపన్న జోడి  | Madrid Open: Rohan Bopanna, Matthew Ebden Pair Lost In Final | Sakshi
Sakshi News home page

Madrid Open: రన్నరప్‌గా బోపన్న జోడి 

Published Sun, May 7 2023 7:20 AM | Last Updated on Sun, May 7 2023 7:20 AM

Madrid Open: Rohan Bopanna, Matthew Ebden Pair Lost In Final - Sakshi

మాడ్రిడ్‌: ఏటీపీ మాస్టర్స్‌ 1000 టెన్నిస్‌ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించేందుకు బరిలోకి దిగిన భారత ఆటగాడు రోహ న్‌ బోపన్నకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్‌ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడి ఓటమిపాలైంది.

డబుల్స్‌లో జత కట్టిన సింగిల్స్‌ స్పెషలిస్ట్‌లు, రష్యాకు చెందిన కరెన్‌ ఖచనోవ్‌ – ఆండ్రీ రుబ్లెవ్‌ 6–3, 3–6, 10–3 స్కోరుతో బోపన్న – ఎబ్డెన్‌పై విజయం సాధించారు. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బోపన్న – ఎబ్డెన్‌ ద్వయం 4 ఏస్‌లు సంధించగా, రష్యా జంట 3 ఏస్‌లు కొట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement