ఈ సీజన్‌లో తమ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 1–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సెలో మెలో (బ్రెజిల్)–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంటను ఓడించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment