సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 2 గంటల 22 నిమిషాల పాటు జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 6–7 (6/8), 7–6 (14/12), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో షపోవలోవ్ (కెనడా)–ఖచనోవ్ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–మిడిల్‌కూప్ జోడీకి 14,700 డాలర్ల (రూ. 11 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment