Cincinnati Masters Tournament
-
Cincinnati Masters: పోరాడి ఓడిన బోపన్న జోడీ
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 2 గంటల 22 నిమిషాల పాటు జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 6–7 (6/8), 7–6 (14/12), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో షపోవలోవ్ (కెనడా)–ఖచనోవ్ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–మిడిల్‌కూప్ జోడీకి 14,700 డాలర్ల (రూ. 11 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
మ్యాచ్ మధ్యలో ఆ టాప్ టెన్నిస్ స్టార్ ఏం చేశాడో చూడండి..
సిన్సినాటి: మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ నంబర్ 2 క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్(రష్యా), సహచర రష్యా ఆటగాడు ఆండ్రే రుబ్లెవ్ మధ్య మ్యాచ్ సందర్భంగా(రెండో సెట్) డేనిల్ మెద్వెదెవ్ బంతిని కొట్టబోయే క్రమంలో బేస్‌లైన్ వద్ద ఆన్ కోర్టు కెమెరాను ఢీకొన్నాడు. ఈ ఘటనలో మెద్వెదెవ్కు కానీ కెమెరామెన్‌కు గానీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, అప్పటికే తొలి సెట్(6-2)ను గెలుపొంది, రెండో సెట్లో వెనుకబడిన మెద్వెదెవ్ సహనం కోల్పోయి.. కెమెరాను ఇక్కడి తీసేయండి, దీని వల్ల నా చెయ్యి విరిగినంత పనైందంటూ కెమెరాను కాలితో తన్నాడు. అప్పుడే మెద్వెదెవ్ క్షేమ సమాచారంపై ఆరా తీసేందుకు వచ్చిన ఫీల్డ్ అంపైర్.. వరల్డ్ నంబర్ 2 క్రీడాకారుడు చేసిన పనిని చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Why media is silent ? 🤪🤷🏻♂️ Daniil Medvedev KICKS THE CAMERA at Cincinnati Tennis Tournament!! https://t.co/79g1zZkxI4 via @YouTube pic.twitter.com/SAPkJCZJv5 — Yerik Ilyassov (@yerikilyassov) August 21, 2021 ఇదిలా ఉంటే, ఈ ఘటన అనంతరం లయ తప్పిన మెద్వెదెవ్ వరుసగా రెండు సెట్లు కోల్పోయి 6-2, 3-6, 3-6తో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. 2019లో ఈ టైటిల్‌ను నెగ్గిన మెద్వెదెవ్, ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే, కెమెరాను ఢీకొట్టడం ద్వారా ఏకాగ్రతను కోల్పోయిన అతను సెమీస్‌లోనే నిష్క్రమించాడు. ప్రత్యర్ధి రుబ్లెవ్ ఆదివారం జరగబోయే ఫైనల్లో జర్మనీ ఆటగాడు జ్వెరెవ్‌ను ఢీకొంటాడు. జ్వెరెవ్ సెకెండ్ సెమీఫైనల్లో గ్రీక్ ఆటగాడు, ప్రపంచ నంబర్ 3 స్టెఫానోస్ సిట్సిపాస్ 6-4 3-6 7-6 (4)కు షాకిచ్చి ఫైనల్‌కు చేరాడు. చదవండి: సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సానియా జోడి పరాజయం
సిన్సినాటి: హార్డ్ కోర్ట్ సీజన్లో కొత్త భాగస్వామితో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కలిసి రాలేదు. వెస్టర్న్ అండ్ సదరన్ (సిన్సినాటి) ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లోనే సానియా జోడి పరాజయం పాలైంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత సానియాకు అంతర్జాతీయ సర్క్యూట్లో ఇదే తొలి మ్యాచ్. వరల్డ్ సింగిల్స్ 22వ ర్యాంక్ అన్స్ జబర్ (ట్యునీషియా)తో సానియా ఈ సారి బరిలోకి దిగింది. అయితే మొదటి రౌండ్లో వెరొనికా కుదెర్మెటొవా (రష్యా) – ఎలినా రైబాకినా (కజకిస్తాన్) ద్వయం 7–5, 6–2తో సానియా–జబర్ జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా, జబర్ కలిసి 4 ఏస్‌లు సంధించగా, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశారు. హైదరాబాద్‌లో నెహ్రూ హాకీ టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు తొలి సారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 1964నుంచి జరుగుతున్న ఈ టోర్నీని తొలిసారి న్యూఢిల్లీ బయట నిర్వహిస్తున్నారు. నవంబర్ 14నుంచి 25 వరకు నగరంలో జరిగే ఈ టోర్నీలో రైల్వేస్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ఇండియా తదితర ప్రతిష్టాత్మక 16 జట్లు పాల్గొంటాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా యువ హాకీ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చి ఒలింపిక్స్ సహా ప్రధాన అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా చేయడంలో నెహ్రూ హాకీ టోర్నీ కీలక పాత్ర పోషించింది. ‘గూంచా గ్రూప్’ టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో జేఎన్‌హెచ్‌టీ సొసైటీ అధ్యక్షుడు సుభాష్ కపూర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
చాంప్స్ మెద్వెదేవ్, కీస్
సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్‌లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం. కుజ్నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్‌లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్‌లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉంది. -
కిర్గియోస్‌కు రూ.80 లక్షల జరిమానా!
సిన్సినాటి: కెరీర్ ఆరంభంనుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఇప్పుడు దూషణల పర్వాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాడు! ఫలితంగా భారీ జరిమానాకు గురవడంతో పాటు నిషేధానికి కూడా చేరువయ్యాడు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో పరాజయం అనంతరం అతని ప్రవర్తన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ మ్యాచ్‌లో కరెన్ కచనోవ్ (రష్యా) 6–7, 7–6, 6–2తో కిర్గియోస్‌ను ఓడించాడు. మ్యాచ్ ముగిశాక కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇది తక్షణ చర్య మాత్రమేనని, మున్ముందు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కిర్గియోస్‌పై మరింత తీవ్ర చర్య ఉండవచ్చని కూడా ఏటీపీ ప్రకటించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ అయిన 24 ఏళ్ల కిర్గియోస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో శిక్షలకు గురయ్యాడు. -
రాఫెల్ నాదల్కు మళ్లీ షాక్
సోమవారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిరియోస్తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ 2–6, 5–7తో ఓడిపోయాడు. రెండు వారాల వ్యవధిలో రెండు మాస్టర్స్ టోర్నీల్లో పాల్గొన్న నాదల్ క్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయాడు. గతవారం రోజర్స్ కప్‌లో నాదల్ కెనడాకు చెందిన 143వ ర్యాంకర్ షపోవలోవ్ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు.