సిన్సినాటి: మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ నంబర్ 2 క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్(రష్యా), సహచర రష్యా ఆటగాడు ఆండ్రే రుబ్లెవ్ మధ్య మ్యాచ్ సందర్భంగా(రెండో సెట్) డేనిల్ మెద్వెదెవ్ బంతిని కొట్టబోయే క్రమంలో బేస్‌లైన్ వద్ద ఆన్ కోర్టు కెమెరాను ఢీకొన్నాడు. ఈ ఘటనలో మెద్వెదెవ్‌కు కానీ కెమెరామెన్‌కు గానీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, అప్పటికే తొలి సెట్(6-2)ను గెలుపొంది, రెండో సెట్‌లో వెనుకబడిన మెద్వెదెవ్ సహనం కోల్పోయి.. కెమెరాను ఇక్కడి తీసేయండి, దీని వల్ల నా చెయ్యి విరిగినంత పనైందంటూ కెమెరాను కాలితో తన్నాడు. అప్పుడే మెద్వెదెవ్ క్షేమ సమాచారంపై ఆరా తీసేందుకు వచ్చిన ఫీల్డ్ అంపైర్.. వరల్డ్ నంబర్ 2 క్రీడాకారుడు చేసిన పనిని చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Why media is silent ? 🤪🤷🏻♂️
— Yerik Ilyassov (@yerikilyassov) August 21, 2021
Daniil Medvedev KICKS THE CAMERA at Cincinnati Tennis Tournament!! https://t.co/79g1zZkxI4 via @YouTube pic.twitter.com/SAPkJCZJv5
ఇదిలా ఉంటే, ఈ ఘటన అనంతరం లయ తప్పిన మెద్వెదెవ్ వరుసగా రెండు సెట్లు కోల్పోయి 6-2, 3-6, 3-6తో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. 2019లో ఈ టైటిల్‌ను నెగ్గిన మెద్వెదెవ్, ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే, కెమెరాను ఢీకొట్టడం ద్వారా ఏకాగ్రతను కోల్పోయిన అతను సెమీస్‌లోనే నిష్క్రమించాడు. ప్రత్యర్ధి రుబ్లెవ్ ఆదివారం జరగబోయే ఫైనల్లో జర్మనీ ఆటగాడు జ్వెరెవ్‌ను ఢీకొంటాడు. జ్వెరెవ్ సెకెండ్ సెమీఫైనల్లో గ్రీక్ ఆటగాడు, ప్రపంచ నంబర్ 3 స్టెఫానోస్ సిట్సిపాస్ 6-4 3-6 7-6 (4)కు షాకిచ్చి ఫైనల్‌కు చేరాడు.
చదవండి: సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment