Daniil Medvedev
-
స్టార్ టెన్నిస్ ప్లేయర్‌కు షాక్.. అతిగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా
స్టార్ టెన్నిస్ ప్లేయర్, 2021 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్కు (రష్యా) షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్-2025 సందర్భంగా అతి చేసినందుకు గానూ మెద్వెదెవ్కు భారీ జరిమానా విధించారు నిర్వహకులు. మెద్వెదెవ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్లో నిష్క్రమించాడు. రెండు రౌండ్లలో మెద్వెదెవ్ చాలా దురుసగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ 76,000 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్ లో మెద్వెదెవ్.. 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. గెలుపు అనంతరం విజయోత్సవ సంబురాల్లో భాగంగా పలు మార్లు తన రాకెట్‌తో నెట్ కెమెరాను బాదాడు. ఇలా చేసినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద అతనికి 10 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. మరోసారి ఇలా ప్రవర్తించకూడదని ఘాటుగా హెచ్చరించారు.Daniil Medvedev was fined $76,000 at this year’s Australian Open.$10k for hitting the camera with his racquet during the 1st round.$66k for his behavior during his match against Tien & not attending press. His total winnings were $124k.pic.twitter.com/bDQ4aj064j— The Tennis Letter (@TheTennisLetter) January 18, 2025నిర్వహకులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినా మెద్వెదెవ్ తీరు ఏ మాత్రం మారలేదు. రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ అలానే ప్రవర్తించాడు. ఈ రౌండ్ లో 19 ఏళ్ల అమెరికా కుర్రాడు, క్వాలిఫయర్ లెర్నర్ టీన్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మెద్వెదెవ్.. ఓటమి అనంతరం సహనం కోల్పోయి రాకెట్‌ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి కొట్టాడు. తన రాకెట్ బ్యాగ్‌ను విసిరేశాడు. మరోసారి కెమెరాపై తన ప్రతాపాన్ని చూపాడు.మెద్వెదెవ్ ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న నిర్వహకులు ఈసారి 66 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండు రౌండ్లలో మెద్వెదెవ్ 76 వేల డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.40 లక్షలు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్నందుకు గానూ మెద్వెదెవ్కు 1,24,000 ఆసీస్ డాలర్లు ప్రైజ్‌మనీ లభిస్తుంది. దీంట్లో సగానికి పైగా అతను జరిమానా కింద కోల్పోయాడు.కాగా, 2021, 2022, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో భంగపడ్డ మెద్వెదెవ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో బరిలో దిగాడు. కానీ మరోసారి అతడికి నిరాశే ఎదురైంది. -
మెద్వెదెవ్కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం పెను సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ అసాధారణ పోరాటపటిమ కనబరిచి మెద్వెదెవ్‌ను ఓడించి తన కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 119వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ 6–3, 7–6 (7/4), 6–7 (8/10), 1–6, 7–6 (10/7)తో ఐదో సీడ్, గతంలో మూడుసార్లు రన్నరప్‌గా (2021, 2022, 2024) నిలిచిన మెద్వెదెవ్పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ 20 ఏస్‌లు సంధించినా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 82 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గత మూడేళ్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన లెర్నర్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన లెర్నర్ టియెన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఐదు సెట్లు ఆడి నెగ్గడం విశేషం. కామిలో కారాబెల్లి (అర్జెంటీనా)తో 3 గంటల 56 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో లెర్నర్ టియెన్ 4–6, 7–6 (7/3), 6–3, 5–7, 6–4తో గెలుపొందాడు. మరోవైపు కాసిదిత్ సామ్రెజ్ (థాయ్‌లాండ్)తో 3 గంటల 8 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 4–6, 3–6, 6–1, 6–2తో గట్టెక్కాడు. రెండో రౌండ్లోనూ మెద్వెదెవ్ ఐదు సెట్లు పోరాడినా అమెరికన్ టీనేజర్ ఆటతీరుకు చేతులెత్తేశాడు. లెర్నర్, మెద్వెదెవ్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం తెల్లవారుజాము 2 గంటల 53 నిమిషాలకు ముగియడం గమనార్హం. మూడో రౌండ్లో సినెర్మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో సినెర్ 2 గంటల 46 నిమిషాల్లో 4–6, 6–4, 6–1, 6–3తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా), పదో సీడ్ కొలిన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రిత్విక్ జోడీ ఓటమి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–సెగర్మన్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 1–6తో ఆరో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెనీ ప్యాటెన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) ద్వయం రెండో రౌండ్‌కు చేరగా... జీవన్ నెడుంజెళియన్– విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)... అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ద్రజెవ్స్కీ (పోలాండ్) జోడీలు తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాయి. -
మెద్వెదెవ్ విజయం
ట్యూరిన్ (ఇటలీ): టాప్ టెన్నిస్ స్టార్ల మధ్య జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో రష్యా ప్లేయర్ డానిలి మెద్వెదెవ్ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలిచి గట్టెక్కాడు. మంగళవారం జరిగిన పోరులో మెద్వెదెవ్ 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో వరుస సెట్లలో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో కంగుతిన్న రష్యన్ స్టార్ ఈ సారి ఆ పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే తన రాకెట్‌కు పదును పెట్టిన మెద్వెదెవ్ ఆస్ట్రేలియా ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించాడు. ఆసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–8 ర్యాంకింగ్ ప్లేయర్లను గ్రూపులో నలుగురు చొప్పున విభజించి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ సీజన్ ముగింపు టోర్నీని నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు. గురువారం జరిగే పోటీల్లో సినెర్‌తో మెద్వెదెవ్, ఫ్రిట్జ్‌తో డి మినార్ తలపడతారు. మరో గ్రూప్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొందాడు. డబుల్స్ పోరులో ఏడో సీడ్ హ్యారి హెలియోవార (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ 7–6 (8/3), 7–5తో ఆస్ట్రేలియాకు చెందిన ఐదో సీడ్ జోర్డాన్ థాంప్సన్–మ్యాక్స్ పుర్సెల్ జంటపై గెలుపొందింది. -
టాప్ సీడ్ సినెర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 4 గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–7 (7/9), 6–4, 7–6 (7/4), 2–6, 6–3తో సినెర్‌ను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 5–7, 6–4, 6–2, 6–2తో టామీ పాల్ (అమెరికా)ను ఓడించాడు. రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేíÙయా) 5–7, 6–4, 6–1తో లులు సున్ (న్యూజిలాండ్)పై, ఏడో ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) 6–2, 6–1తో 19వ సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా జనిక్ సినర్..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సరికొత్త ఛాంపియన్‌గా ఇటలీ యువ సంచలనం జనిక్ సినర్ అవతరించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2024 పురుషల సింగిల్ విజేతగా జనిక్ సినర్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో సంచలన విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఓడిపోయిన సినర్.. తిరిగి పుంజుకుని వరుసగా మూడు సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. 22 ఏళ్ల యానిక్ సినెర్‌కు మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను సినెర్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆటగాడిగా సినర్ రికార్డులకెక్కాడు. సినర్ కంటే ముందు రోలాండ్ గారోస్, నికోలా పిట్రాంజెలీ టైటిల్‌లను గెలుచుకున్నారు. -
క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. Australian Open 2024- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
ఫైనల్లో జొకోవిచ్, మెద్వెదెవ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో అడుగు దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పదో సారి ఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా దిగ్గజం తుది పోరుకు సన్నద్ధమయ్యాడు. అయితే అతని టైటిల్ వేటలో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అడ్డుగా ఉన్నాడు. ఇదే వేదికపై తన ఏకైక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రెండేళ్ల క్రితం 2021లో యూఎస్ ఓపెన్ ఫైనల్ వీరిద్దరి మధ్య జరిగింది. అనూహ్య ప్రదర్శనతో చెలరేగిన మెద్వెదెవ్ వరుస సెట్లలో జొకోను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ సారి గత పోరుకు ప్రతీకారం తీర్చుకోవాలని నొవాక్ పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/4) స్కోరుతో అమెరికన్ కుర్రాడు బెన్ షెల్టన్‌పై విజయం సాధించగా... మెద్వెదెవ్ వరల్డ్ నంబర్‌వన్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)కు షాక్ ఇచ్చాడు. సెమీస్ పోరులో మెద్వెదెవ్ 7–6 (7/3), 6–1, 3–6, 6–3తో అల్కరాజ్ను ఓడించాడు. ఏకపక్షంగా... గ్రాండ్‌స్లామ్‌లో హార్డ్కోర్ట్ వేదికపై తన 100వ మ్యాచ్ బరిలోకి దిగిన జొకోవిచ్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. 149 కిలోమీటర్ల వేగంతో మెరుపు సరీ్వస్లే బలంగా షెల్టన్ పోటీ ఇచ్చినా చివరకు దిగ్గజం ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్లో ఒక దశలో 5–4తో సెట్ కోసం సర్వీస్ చేసినా...జొకో ప్రశాంతంగా ప్రత్య ర్థిని నిలువరించగలిగాడు. 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ చెరో 5 ఏస్‌లు సంధించారు. అయితే జొకోవిచ్ 25 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్‌తో పోలిస్తే 43 తప్పులు చేసిన షెల్టన్ మూల్యం చెల్లించుకున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం కాగా...టైటిల్ గెలిస్తే ఓపెన్ ఎరాలో అతి పెద్ద వయసులో యూఎస్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా నిలుస్తాడు. యూఎస్ ఓపెన్‌లో గతంలో 9 సార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ 3 టైటిల్స్ సాధించి 6 సార్లు ఓడాడు. మరో టైటిల్ వేటలో... రెండో సెమీస్‌లో సగటు అభిమాని ఊహించని ఫలితం వచ్చింది. ఈ సీజన్లో రెండు సార్లు అల్కరాజ్ చేతిలో ఓడిన రష్యా ఆటగాడు అసలు సమరంలో సత్తా చాటాడు. జొకోవిచ్–అల్కరాజ్ మధ్య టైటిల్ పోరు అంటూ సాగిన అంచనాలను అతను బద్దలుకొట్టాడు. తొలి సెట్ హోరాహోరీగా సాగినా ఒక దశలో 19 పాయింట్లలో 16 నెగ్గి మెద్వెదెవ్ టైబ్రేక్‌లో సెట్ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో అల్కరాజ్ అవకాశం అందిపుచ్చుకున్నా, ఆ తర్వాత అతని జోరు సాగలేదు. మెద్వెదెవ్ 9 ఏస్‌లు కొట్టగా, అల్కరాజ్ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోవడం ఈ మ్యాచ్‌లో అతని బలహీనతను చూపించింది. మెద్వెదెవ్ 10 డబుల్‌ఫాల్ట్‌లు చేసినా తుది ఫలితంపై అది ప్రభావం చూపించలేదు. -
'ఒక ఆటగాడు చనిపోతాడు.. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు'
యూఎస్ ఓపెన్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆధిక వేడివల్ల ప్లేయర్స్ అనారోగ్యం బారిన పడుతున్నారు. బుధవారం జరిగిన యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. యుఎస్ ఓపెన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్) మధ్య మ్యాచ్ ఆడిన మెద్వెదెవ్ వేడి కారణంగా శ్వాస తీసుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆట రెండో సెట్‌కు మరో సమయంలో అతడిని ఫిజియో పరీక్షించాడు. ఫిజియో సలహా మెరకు ఇన్హేలర్ సాయంతో మిగిలిన ఆటను మెద్వెదేవ్ పూర్తిచేశాడు. అయితే మ్యాచ్ గేమ్ అనంతరం మెద్వెదేవ్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ పరిస్థితుల కారణంగా ఒక ఆటగాడు చనిపోయినా వీళ్లు అలానే చూస్తూ ఉంటారని మెద్వెదేవ్ అసహనం వ్యక్తం చేశాడు. యూఏస్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఆడటం చాలా కష్టంగా అన్పించింది. ఈ వేడిని తట్టుకో లేక ఒక ఆటగాడు చనిపోతాడు. అప్పుడు వీళ్లు చూస్తూనే ఉంటారు. ఇంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో నేను ఒక్కడినే కాకుండా ఆండ్రీ రుబ్లెవ్ కూడా వేడిని తట్టుకోలేకపోయాడు తొలి సెట్ ఆరంభంలో ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు కన్పించాయి. కానీ మూడో సమయానికి నేను బంతిని కూడా చూడలేకపోయాను. అవతలి ఎండ్‌లో నా ప్రత్యర్ధి అలిపోయనట్లు కన్పించి వెంటనే పుంజుకుంటున్నాడు. గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అని మెద్వెదేవ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను 6–4, 6–3, 6–4తో మెద్వెదెవ్ ఓడించాడు. ఈ విజయంతో యూఎస్ ఓపెన్ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్ -
అల్కరాజ్, మెద్వెదెవ్ ముందంజ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)కు రెండో రౌండ్లో సునాయాస విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–1, 7–6 (7/4)తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్లో 6–2, 6–2, 6–7 (6/8), 6–2తో క్రిస్టోఫర్ కానెల్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు. మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఆండీ ముర్రే (బ్రిటన్) ఆట మాత్రం రెండో రౌండ్లోనే ముగిసింది. గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 6–1తో ముర్రేను ఇంటి ముఖం పట్టించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (రష్యా) 6–3, 6–2తో జోడీ బురెజ్ (యూకే)ను...9వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో ట్రెవిజాన్ (ఇటలీ)ను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. టెన్నిస్ సర్క్యూట్లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చిరునామాగా నిలిచిన జాన్ ఇస్నర్ (అమెరికా) రెండో రౌండ్లో మరో సుదీర్ఘ సమరంలో ఓడి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికాకే చెందిన మైకేల్ మో 3–6, 4–6, 7–6 (7/3), 6–4, 7–6 (10/7) స్కోరుతో ఇస్నర్‌ను ఓడించాడు. టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్ (11 గంటల 5 నిమిషాల పాటు – నికోలస్ మహుత్తో) ఆడిన రికార్డులో ఇస్నర్ భాగం కాగా...అత్యధిక ఏస్‌లు (14,470) కొట్టిన ఘనత కూడా అతని సొంతం. పురుషుల డబుల్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్ల పోరు తొలి రౌండ్లోనే ముగిసింది. యూకీ బాంబ్రీ (భారత్) – డెమోలినర్ (బ్రెజిల్) జోడి 3–6, 5–7తో హ్యూగో నిస్ (మొనాకో) – జిలిన్స్కీ (పోలాండ్) చేతిలో... సాకేత్ మైనేని (భారత్) – కరట్సెవ్ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో లాస్లో జెరె (సెర్బియా) – హ్యూస్టర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడారు. -
డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్'
పారిస్: రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు ‘ఫ్రెంచ్’ మరోసారి అచ్చిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రష్యన్ తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మెద్వెదెవ్ క్లేకోర్టులో ఐదోసారి మొదటి రౌండ్లోనే కంగుతిన్నాడు. వరుసగా నాలుగేళ్లు అతను తొలిరౌండ్ అడ్డంకి దాటలేకపోయాడు. తాజాగా మెద్వెదెవ్ 6–7 (5/7), 7–6 (8/6), 6–2, 3–6, 4–6తో క్వాలిఫయర్ సెబొత్ వైల్డ్ (బ్రెజిల్) చేతిలో కంగుతిన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో పురుషుల నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–4, 6–3, 6–2తో క్వాలిఫయర్ ఎలియస్ వైమెర్ (స్వీడెన్)పై గెలుపొందగా... 22వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) తొలిరౌండ్ అడ్డంకిని దాటేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ జర్మన్ ప్లేయర్ 7–6 (8/6), 7–6 (7/0), 6–1తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా)పై చెమటోడ్చి నెగ్గాడు. Biggest W of his young career. ✨🇧🇷 Seyboth Wild's astonishing match against No.2 seed Medvedev is the extraordinary moment of the day! #ExtraordinaryMoments @HaierEurope pic.twitter.com/ZTcL9Q2tmC — Roland-Garros (@rolandgarros) May 30, 2023 స్వియాటెక్ శుభారంభం.. డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పోలండ్ స్టార్ 6–4, 6–0తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై అలవోక విజయం సాధించింది. వరుస సెట్లలో కేవలం గంటా 13 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 3–6, 6–1, 6–2తో రెబెక మసరొవా (స్పెయిన్)పై, ఏడో సీడ్ ఓన్స్ జాబెర్ (ట్యూనిషియా ) 6–4, 6–1తో లూసియా బ్రాంజెటి (ఇటలీ)పై, నాలుగో సీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్) 6–4, 6–2తో క్వాలిఫయర్ లిండా ఫ్రువిర్టొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డియన్ ప్యారీ (ఫ్రాన్స్) 6–2, 6–3తో 25వ సీడ్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్)కు వరుస సెట్లలో షాకిచ్చింది. చదవండి: 'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!' -
Miami Opens 2023: మయామీ ఓపెన్ విజేత మెద్వెదెవ్
మయామీ: రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–5, 6–3 స్కోరుతో జనిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించాడు. 1 గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ 9 ఏస్‌లు కొట్టగా, సిన్నర్ 6 ఏస్‌లు బాదాడు. రష్యా ఆటగాడు 6 డబుల్ ఫాల్ట్‌లు చేసినా ఆ ప్రభావం ఫలితంపై పడకుండా సత్తా చాటడం విశేషం. 2023లో 24 మ్యాచ్‌లలో గెలిచి ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన మెద్వెదెవ్ ఖాతాలో ఇది నాలుగో టైటిల్ కాగా ఓవరాల్‌గా ఐదో ఏటీపీ మాస్టర్స్ టైటిల్. -
షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం
రష్యన్ టెన్నిస్ స్టార్.. ఎనిమిదో సీడ్ డానిల్ మెద్వదెవ్ తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఆడుతున్న మెద్వదెవ్ మ్యాచ్ సందర్భంగా ఒక అభిమానిపై తిట్ల దండకం అందుకున్నాడు. విషయంలోకి వెళితే.. షార్ట్ టెంపర్‌కు మారుపేరుగా నిలిచిన మెద్వదెవ్ అప్పటికే రెండు సెట్లలో విజయం సాధించి దూకుడు మీద ఉన్నాడు. ఇక మూడో సెట్లోనూ 5-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న మెద్వదెవ్ సర్వీస్ మిస్ చేశాడు. ఇది గమనించిన ఒక అభిమాని కోర్టులోకి వచ్చి బంతిని మెద్వదెవ్ వైపు విసిరాడు. దీంతో సహనం కోల్పోయిన మెద్వదెవ్ అతనివైపు కోపంగా చూస్తూ రష్యన్ భాషలో బూతు పదం తిట్టాడు. మెద్వదెవ్ చర్య అక్కడి మైక్రోఫోన్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో చైర్ అంపైర్ మెద్వదెవ్‌ను మందలించి అభిమానికి క్షమాపణ చెప్పాలని కోరాడు. అంపైర్‌కు ఏం జవాబివ్వకుండానే మ్యాచ్‌ను కొనసాగించిన మెద్వదెవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానికి క్షమాపణ చెప్పడం కొసమెరుపు. ఇక మెద్వదెవ్ దురుసుగా ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్ సందర్భంగా అభిమానులతో పాటు చైర్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌కు హాజరైన అభిమానులను ఇడియట్స్ అని.. వాళ్లవన్నీ ఖాళీ బ్రెయిన్స్ అని తిట్టిపోశాడు. అటుపై చైర్ అంపైర్‌ను కూడా దూషించాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలి రౌండ్లో అమెరికాకు చెందిన మార్కోస్ గిరోన్‌పై 6-0, 6-1, 6-2తో వరుస సెట్లలో కంగుతినిపించిన మెద్వదెవ్ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. చదవండి: సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్ -
మెద్వెదెవ్కు చుక్కెదురు
న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. తన దూకుడైన ఆటతో కిరియోస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఇంటిదారి పట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ కిరియోస్ 7–6 (13/11), 3–6, 6–3, 6–2తో మెద్వెదెవ్పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిరియోస్, మెద్వెదెవ్ ఏస్‌లతో హడలెత్తించారు. కిరియోస్ 21, మెద్వెదెవ్ 22 ఏస్‌లు సంధించారు. అయితే అందివచ్చిన బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న కిరియోస్ విజయం రుచి చూశాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన కిరియోస్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో మరో రష్యా ప్లేయర్ ఖచనోవ్‌తో కిరియోస్ ఆడతాడు. తాజా ఓటమితో మెద్వెదెవ్ వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. మెద్వెదెవ్ స్థానంలో నాదల్ (స్పెయిన్), అల్కరాజ్ (స్పెయిన్), కాస్పర్ రూడ్ (నార్వే)లలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ అవుతారు. మరోవైపు ఐదో ర్యాంకర్ కాస్పర్ రూడ్, ఖచనోవ్ కూడా తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రూడ్ 6–1, 6–2, 6–7 (4/7), 6–2తో ముటెట్ (ఫ్రాన్స్)పై, ఖచనోవ్ 4–6, 6–3, 6–1, 4–6, 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, బెరెటిని (ఇటలీ) 3–6, 7–6 (7/2), 6–3, 4–6, 6–2తో ఫోకినా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 6–4తో ఏడో సీడ్ కామెరూన్ నోరి (బ్రిటన్)పై గెలిచారు. కోకో గాఫ్, జబర్ తొలిసారి... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 46వ ర్యాంకర్ ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 7–5, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై గెలుపొందగా... జబర్ 7–6 (7/1), 6–4తో కుదెర్మెటోవా (రష్యా)ను ఓడించింది. మూడో రౌండ్లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన తొమ్లాయనోవిచ్ అదే జోరు కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో సమ్సోనోవా (రష్యా)పై గెలిచింది. కెరీర్లో 42వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న గార్సియా 6–4, 6–1తో అలీసన్ రిస్కే అమృత్‌రాజ్ (అమెరికా)ను ఓడించింది. -
Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 7–6 (7/1), 6–3తో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2019లో ఈ టోర్నీ టైటిల్ సాధించిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)తో తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్ 7–6 (7/5), 5–7, 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో కామెరాన్ నోరీ (బ్రిటన్) 7–6 (7/4), 6–7 (4/7), 6–4తో మూడో సీడ్ అల్కారజ్ (స్పెయిన్)పై, బోర్నా చొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గారు. -
కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..!
రష్యన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ ఆదివారం జరిగిన హాలీ ఓపెన్ ఫైనల్లో పోలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్ చేతిలో ఓడిపోయాడు. మెద్వెదేవ్పై 6-1, 6-4 వరుస సెట్లలో హుర్కాజ్ విజయం సాధించాడు. ఈ ఓటమితో అసహనానికి గురైన మెద్వెదేవ్ తన కోచ్ గిల్లెస్ సెర్వారాపై గట్టిగా అరిచాడు. దీంతో సెర్వారా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించన వీడియోను టెన్నిస్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మెద్వెదేవ్‌కు ఇది వరుసగా రెండో గ్రాస్ కోర్ట్ ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్లో గ్రాస్ కోర్ట్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిని మెద్వెదేవ్ గెలుచుకున్నాడు. చదవండి: Queen's Club Championships: సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట View this post on Instagram A post shared by Tennis TV (@tennistv) -
మెద్వెదేవ్‌కు భారీ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఔట్
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నం.2 డానియల్ మెద్వెదేవ్‌కు భారీ షాక్ తగిలింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ 6-2, 6-3, 6-2తో మెద్వెదేవ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. దీంతో మెద్వెదేవ్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే మెద్వెదేవ్పై సిలిక్ ఆధిపత్యం చెలాయించాడు. కేవలం గంటా 47 నిమిషాల్లో సిలిక్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో సిలిక్ నాలుగేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రూ రూబ్లేవ్తో సిలిక్ తలపడనున్నాడు. చదవండి: ISSF World Cup: స్వర్ణ పతకంపై ఇలవేనిల్ బృందం గురి -
French Open 2022: మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్-2
టెన్నిస్ పురుషుల ప్రపంచ నెంబర్-2 డానిల్ మెద్వెదెవ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మెద్వదెవ్.. సెర్బియాకు చెందిన లాస్లో జెరీని 6-3, 6-4, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం మెద్వెదెవ్ సెర్బియాకు చెందిన 28వ సీడ్ మియోమిర్ కెక్మనోవిక్తో తలపడనున్నాడు. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో జెరిని 39 విన్నర్స్ సందించినప్పటికి.. 68 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ''లాస్లో పోరాటం మెచ్చుకోదగినది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో జెరీని విన్నర్స్ సంధించినప్పటికి.. అన్నే తప్పులు చేశాడు. అతని కాలికి కచ్చితంగా దెబ్బలు తగిలి ఉంటాయి. అతని టఫ్ ఫైట్ కారణఃగా నేను ప్రతీ పాయింట్‌పై ఫోకస్ చేయాల్సి వచ్చింది.'' అని మెద్వెదెవ్ మ్యాచ్ విజయం అనంతరం పేర్కొన్నాడు. -
రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం!
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా వైఖరిని నిరసిస్తూ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నిర్వహించే ఆల్ ఆంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(AELTC) రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్ ఇవ్వనుంది. జూన్ 27-జూలై 10 మధ్య జరగనున్న వింబుల్డ్న్కు రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లను దూరంగా ఉంచాలని బ్రిటీష్ ప్రభుత్వానికి ఏఈఎల్టీసీ నివేధించింది. ఈ మేరకు పురుషుల విభాగంలో వరల్డ్ నెంబర్-2.. డానిల్ మెద్వెదెవ్‌తో పాటు ఎనిమిదో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లేవ్ దూరం కానుండగా.. మహిళల విభాగంలో 15వ ర్యాంకర్ అనస్తాసియా పావ్లియుచెంకోవా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్‌కు ప్రధాన కారణమైన బెలారస్‌ను కూడా వింబుల్డన్ నుంచి బహిష్కరించే అవకశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్ కమిటీ కూడా రష్యన్ ప్లేయర్లు పాల్గొంటున్న టోర్నీల్లో దేశం తరపున ఆడకూడదనే కండిషన్ పెట్టింది. తాజాగా బ్రిటీష్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా ఉన్న నిగెల్ హడిల్‌స్టన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఒకవేళ రష్యన్ ఆటగాళ్లు వింబుల్డన్‌లో పాల్గొనాలనుకుంటే.. రష్యన్ జెండాతో కాకుండా మాములుగా బరిలోకి దిగితే అనుమతిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: Maria Sharapova Pregnancy: తల్లికాబోతున్న ‘టెన్నిస్ స్టార్’.. సోషల్ మీడియాలో పోస్టుతో The law generally doesn't allow discrimination on the basis of national origin, including Russia, but sports tournaments, like the Boston Marathon & now Wimbledon, can argue they aren't employers or events the public can automatically participate in. We live in interesting times. https://t.co/R1WJl4MzNK — Michael McCann (@McCannSportsLaw) April 20, 2022 -
Miami Open: మరో మ్యాచ్ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్
Tennis Star Daniil Medvedev - Miami Open 2022: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో మూడు వారాలపాటు నిలిచి ఆ తర్వాత జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన రష్యా టెన్నిస్ స్టార్ మెద్వెదెవ్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. మయామి ఓపెన్ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 7–5, 6–1తో బ్రూక్స్‌బై (అమెరికా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి మెద్వెదెవ్ సెమీస్ చేరితే ఏప్రిల్ 4న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. Yesterday, we completed our Men’s Singles Round of 1️⃣6️⃣! @AndrewKrasny highlights @janniksin, @DaniilMedwed, and @alcarazcarlos03's R4 victories ⤵️ pic.twitter.com/NSgnTBiTr2 — Miami Open (@MiamiOpen) March 30, 2022 -
Novak Djokovic: మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్.. వారం ఉన్నా గొప్పే కదా!
Novak Djokovic: ఏటీపీ వరల్డ్ నంబర్‌వన్‌గా రష్యా ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ ఆనందం మూడు వారాలకే పరిమితం కానుంది. ఇండియన్ వెల్స్ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్ చేరితే గానీ అగ్ర స్థానంలో నిలవలేని మెద్వెదెవ్ మూడో రౌండ్లో 6–4, 3–6, 1–6 తేడాతో గేల్ మాన్ఫిల్స్ చేతిలో పరాజయంపాలయ్యాడు. సోమవారం ప్రకటించే ర్యాంకుల్లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మళ్లీ అగ్ర స్థానం దక్కుతుంది. ఈ నేపథ్యంలో మెద్వెదేవ్ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎప్పటికీ నంబర్‌వన్ కాకపోవడంకంటే ఒక వారం ఉన్నా గొప్పే కదా’ అని వ్యాఖ్యానించాడు. కాగా జొకోవిచ్ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు నిరాకరించిన కారణంగా ఇప్పటికే పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
ఎదురులేని నాదల్.. వరుసగా 14వ విజయం
ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వరుసగా 14వ విజయం నమోదు చేశాడు. అకాపుల్కోలో జరుగుతున్న మెక్సికో ఓపెన్‌లో నాదల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–3తో టాప్ సీడ్, కాబోయే కొత్త ప్రపంచ నంబర్‌వన్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో నోరీ (బ్రిటన్)తో నాదల్ తలపడతాడు. -
మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదో అనుకున్నా కానీ.. ఇప్పుడు: నాదల్ భావోద్వేగం
Australia Open 2022- Rafael Nadal Emotional Words: అద్భుతం... అసమానం... అసాధారణం... చిరస్మరణీయం... ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం రాఫెల్ నాదల్, డానిల్ మెద్వెదెవ్ పోరాడిన తీరును ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఒకటా.. రెండా... మూడా... ఏకంగా 5 గంటల 24 నిమిషాలపాటు ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. చివరకు 63 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అపార అనుభవంతో రాఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ నాదల్, ఫెడరర్, జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. మెల్బోర్న్: వరుసగా రెండు సెట్లు చేజార్చుకొని ఇక ఓటమి తప్పదేమో అనుకుంటున్న తరుణంలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా ఒక్కసారిగా పైకి లేచాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో తనకున్న 21 ఏళ్ల అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఒక్కో పాయింట్ గెలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. వెరసి రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. తన కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. తద్వారా పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిడిగా ఆవిర్భవించాడు. ఆదివారం రాడ్ లేవర్ ఎరీనాలో 5 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రాఫెల్ నాదల్ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. నాదల్కు 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి రెండు సెట్లు కోల్పోయినా... గత ఏడాది ఈ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన మెద్వెదెవ్ ఈసారి మాత్రం నాదల్‌పై శుభారంభం చేశాడు. తొలి సెట్‌ను, రెండో సెట్‌ను సొంతం చేసుకొని విజయానికి ఒక సెట్ దూరంలో నిలిచాడు. రెండు సెట్లు వెనుకబడ్డా నాదల్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. తన అపార అనుభవాన్ని రంగరించి పాయింట్ పాయింట్ కోసం పోరాడాడు. ముఖ్యంగా నాదల్ కొట్టిన కొన్ని బ్యాక్‌హ్యాండ్ షాట్లకు మెద్వెదెవ్ వద్ద సమాధానం లేకపోయింది. పాయింట్ల కోసం ఎన్నోసార్లు సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. కొన్నిసార్లు నాదల్, మరికొన్నిసార్లు మెద్వెదెవ్ పైచేయి సాధించారు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెలిచాడు. నాలుగో సెట్లో మూడో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసినా వెంటనే నాలుగో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోయాడు. తర్వాత ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన నాదల్ అదే జోరులో నాలుగో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లోని ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అదే దూకుడు కొనసాగించి 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదెవ్ స్కోరును 5–5తో సమం చేశాడు. అయితే 11వ గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన నాదల్ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ‘గ్రాండ్’ ఆధిక్యం చేతులు మారిన వేళ... ►2022 ఆస్ట్రేలియన్ ఓపెన్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నాదల్ 21వ ‘గ్రాండ్’ టైటిల్‌తో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. ►2009 వింబుల్డన్: 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ ఫెడరర్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. ►2000 వింబుల్డన్: 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రాయ్ ఎమర్సన్ పేరిట ఉన్న రికార్డును సవరిస్తూ సంప్రాస్ 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వీరులు (కనీసం 10) ►రాఫెల్ నాదల్- (స్పెయిన్) 21 ►జొకోవిచ్- (సెర్బియా) 20 ►ఫెడరర్- (స్విట్జర్లాండ్) 20 ►పీట్ సంప్రాస్- (అమెరికా) 14 ►రాయ్ ఎమర్సన్- (ఆస్ట్రేలియా) 12 ►జాన్ బోర్గ్ - (స్వీడన్) 11 ►రాడ్ లేవర్- (ఆస్ట్రేలియా) 11 ►బిల్ టిల్డెన్ - (అమెరికా) 10 ఫైనల్ గణాంకాలు... నాదల్- మెద్వెదెవ్ 3 ఏస్‌లు 23 5 డబుల్ ఫాల్ట్‌లు 5 7/23 బ్రేక్ పాయింట్లు 6/22 30/50 నెట్ పాయింట్లు 28/50 69 విన్నర్స్ 76 68 అనవసర తప్పిదాలు 52 182 మొత్తం పాయింట్లు 189 నాదల్ భావోద్వేగం.. నిస్సందేహంగా నా టెన్నిస్ కెరీర్లో అత్యంత భావోద్వేగ మ్యాచ్ ఇది. నిజాయతీగా చెప్పాలంటే నెలన్నర రోజుల క్రితం అసలు టెన్నిస్ రాకెట్ పట్టుకొని మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదోననే సందిగ్ధావస్థలో ఉన్నాను. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్ ట్రోఫీతో మీ ముందు ఉన్నాను. నాలో ఇంకా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచే శక్తి ఉందని తెలిసింది. తప్పకుండా వచ్చే ఏడాది కూడా ఈ టోర్నీలో ఆడతాను. మెద్వెదెవ్ అసాధారణంగా పోరాడాడు. భవిష్యత్‌లో కచ్చితంగా అతడిని కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా చూస్తాం. ఆస్ట్రేలియాలో గత మూడు వారాలుగా నాకు లభించిన ఆదరణ, ఆప్యాయత జీవితాంతం నా హృదయంలో ఉండిపోతుంది. –రాఫెల్ నాదల్ అద్భుత రికార్డులు: టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ నాదల్. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సుదీర్ఘంగా సాగిన రెండో ఫైనల్‌గా నాదల్, మెద్వెదెవ్ మ్యాచ్ నిలిచింది. జొకోవిచ్, నాదల్ మధ్య 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జరిగిన మ్యాచ్ (5 గంటల 53 నిమిషాలు) సుదీర్ఘంగా జరిగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌గా గుర్తింపు పొందింది. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన నాలుగో ప్లేయర్ నాదల్. ఈ జాబితాలో జొకోవిచ్ (సెర్బియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) కూడా ఉన్నారు. తన కెరీర్ మొత్తంలో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు చేజార్చుకొని ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలువడం నాదల్‌కిది నాలుగోసారి మాత్రమే. గతంలో నాదల్ 2007 వింబుల్డన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)పై... 2006 వింబుల్డన్ రెండో రౌండ్లో రాబర్ట్ కెండ్రిక్ (అమెరికా)పై... 2005 మాడ్రిడ్ ఓపెన్‌లో లుబిసిచ్ (క్రొయేషియా)పై ఇలా గెలిచాడు. నాదల్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్- 2009, 2022 ►ఫ్రెంచ్ ఓపెన్- 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020 ►వింబుల్డన్- 2008, 2010 ►యూఎస్ ఓపెన్- 2010, 2013, 2017, 2019 ప్రశంసల జల్లు: ‘ఆహా ఏమి మ్యాచ్ ఆడావు. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన నా మిత్రుడు, గొప్ప ప్రత్యర్థి నాదల్కు హృదయపూర్వక అభినందనలు. చాంపియన్స్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు.’ –ఫెడరర్ ‘అద్భుతమైన ఘనత. నాదల్ మరోసారి నీ అసమాన పోరాటంతో ఆకట్టుకున్నావు.’–జొకోవిచ్ -
అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొట్టాడు. మెద్వెదెవ్పై సంచలన విజయంతో కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో మారథాన్ మ్యాచ్ ఆడడం ఇది రెండోసారి. ఇంతకముందు 2012లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మారథాన్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో నాదల్ ఓటమి పాలయ్యాడు. కానీ తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మాత్రం నాదల్ విజృంభించాడు. వయసు మీద పడుతున్నప్పటికి తనలో సత్తువ తగ్గలేదని మరోసారి తన పదునైన ఆటతో రుచి చూపించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్‌తో జరిగిన మారథాన్ ఫైనల్లో 2-6, 6-7(5-7), 6-4, 6-4, 7-5తో నాదల్ విజయం సాధించాడు. దాదాపు 5 గంటల 30 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా-నేనా అన్నట్లుగానే సాగింది. తొలి సెట్‌ను 2-6తో కోల్పోవడం.. రెండో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. కాగా టై బ్రేక్‌ను మెద్వెదెవ్ గెలుచుకోవడంతో పాటు సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో నాదల్ ఓటమి ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ నాదల్ తన అసలు ఆటను మూడో సెట్ నుంచే చూపించాడు. తన పవర్ గేమ్‌ను రుచి చూపిస్తూ నాదల్ 6-4తో మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ ఇద్దరి మధ్య హోరాహోరి నడిచినప్పటికి నాదల్ మరోసారి విజృంభించి 6-4తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో 2-2తో సమానంగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. అయితే ఐదో సెట్ ఉత్కంఠంగా సాగినప్పటికి చివర్లో నాదల్ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 7-5తో సెట్‌ను కైవసం చేసుకొని 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం జొకోవిచ్‌తో.. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ నాదల్, జొకోవిచ్‌ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దాదాపు 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో జొకోవిచ్ చివరికి పై చేయి సాధించాడు. ఆ మ్యాచ్‌లో నాదల్‌ను జొకోవిచ్ 5-7, 6-4, 6-2,6-7(5-7),7-5తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి అప్పటి మ్యాచ్‌లో నాదల్ తొలిసెట్‌ను గెలుచుకొని ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో ఫుంజుకున్న జొకోవిచ్ 6-4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడోసెట్‌ను కూడా 6-2తో గెలిచి సత్తా చాటాడు. ఇంక ఒక్కసెట్ గెలిస్తే నాదల్ ఓటమి పాలవడం అనుకున్న తరుణంలో మ్యాచ్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో నాదల్ అద్బుత పోరాటంతో సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన ఐదో సెట్లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చూపించి 7-5తో నాదల్‌ను ఓడించాడు. One for the books🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7 6-4 6-4 7-5 in a 5 hours and 24 minutes incredible match💪 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/gyTFieZWEr — ATP Tour (@atptour) January 30, 2022 -
చరిత్ర సృష్టించిన నాదల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్పై సంచలన విజయం
Rafael Nadal Wins Australian Open 2022 Singles Title: ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 పురుషుల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరిగా సాగిన ఈ పోరులో నదాల్ తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ.. అనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. మరోవైపు కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్‌పై గంపెడాశలు పెట్టుకున్న మెద్వెదెవ్.. నాదల్ అనుభవం ముందు నిలబడ లేకపోయాడు. మెద్వెదెవ్.. 2021లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్ హద్దాద్ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. అంతకుముందు పురుషుల డబుల్స్ ఫైనల్లో థనాసి కొకినాకిస్-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన విషయం తెలిసిందే. చదవండి: చెక్ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ ప్లేయర్‌కు భారీ జరిమానా
Medvedev Fined 12000 USD: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా చైర్ అంపైర్‌ను బూతులు తిట్టిన ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డానిల్ మెద్వెదెవ్(రష్యా)కు భారీ జరిమానా విధించారు టోర్నీ నిర్వాహకులు. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడన్నకారణంగా మెద్వెదెవ్కు 12000 యూఎస్ డాలర్లు ఫైన్ వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. One set all in #AusOpen semi-final and Daniil Medvedev has completely lost his head as he goes onto call the umpire a “small cat” 😂 He has a point though, this isn’t the first time Stefanos Tsitsipas has been accused of cheating by receiving coachingpic.twitter.com/Be0h2R7uCZ — Alex ⚒ (@AlexSmith_123) January 28, 2022 కీలకమైన సెమీస్ సందర్భంగా ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి నుంచి సలహాలు తీసుకున్నాడని ఆరోపిస్తూ.. చైర్ అంపైర్ జౌమ్ క్యాంపిస్టల్ను స్టుపిడ్ అంటూ దూషించాడు మెద్వెదెవ్. అయితే, మ్యాచ్ అనంతరం మెద్వెదెవ్ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరినప్పటికీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. కాగా, సెమీస్‌లో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్.. ఆదివారం జరగబోయే ఫైనల్లో స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. చదవండి: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే -
రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తన కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరిన నాదల్ ఆదివారం డానియెల్ మెద్వెదెవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. ఫైనల్లో నాదల్ గెలిస్తే గనుక టెన్నిస్‌లో పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్, ఫెదరర్‌లతో సమానంగా ఉన్న నాదల్.. ఒక్క టైటిల్ గెలిస్తే చరిత్ర సృష్టించనున్నాడు. 21 గ్రాండ్‌స్లామ్‌లతో అత్యధిక టైటిళ్లు గెలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా నాదల్ నిలవనున్నాడు. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో మెద్వెదెవ్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైన నాదల్ ప్రాక్టీస్ సమయంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''రెండు నెలల క్రితం తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది. తరచూ గాయాల బారీన పడుతుండడంతో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. దాంతో ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించా. ఈ విషయమై తన టీమ్‌తో పాటు కుటుంబసభ్యులతో కూడా చర్చించాను. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి.. ఇలాగే కొనసాగితే విమర్శలు తప్ప విజయాలు దక్కవు అని కుమిలిపోయా.. అయితే ఇదంతా రెండు నెలల క్రితం. కట్ చేస్తే ఇప్పుడు బౌన్స్‌బ్యాక్ అయ్యాననిపిస్తుంది. మెద్వెదెవ్‌తో జరగబోయే ఫైనల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తానో లేదో తెలియదు కానీ.. నా ఆటపై ఆత్మవిశ్వాసం మరింతం పెరిగింది. ఆ ధైర్యంతోనే రేపటి ఫైనల్‌ను ఆడబోతున్నా'' అంటూ ముగించాడు. ఇప్పటివరకు టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్ ఖాతాలో 13 ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి. -
అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్
మ్యాచ్‌లో ఆటగాళ్లకు అంపైర్‌తో వివాదాలు సహజమే. ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. టెన్నిస్ కూడా దీనికి అతీతం కాదనే చెప్పొచ్చు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నెంబర్ రెండో ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండోసెట్ ముగిసిన తర్వాత ఇది చోటుచేసుకుంది. ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి వద్ద మ్యాచ్‌కు సంబంధించి సలహా తీసుకున్నాడు. చదవండి: Shoaib Akhtar: పిచ్చి ప్రశ్నలు వేస్తోంది.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి ఇది గమనించిన మెద్వెదెవ్.. చైర్ అంపైర్ జౌమ్ క్యాంపిస్టల్ చూస్తూ.. ''సిట్సిపాస్ తన తండ్రి సలహా తీసుకొని కోడ్ ఆఫ్ వయలేషన్ను ఉల్లఘించాడు.. ఇది నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు. అంపైర్ చెప్పేది వినిపించుకోకుండానే మెద్వెదెవ్ మరోసారి గట్టిగా అరిచాడు.''సిట్సిపాస్‌కు తన తండ్రి ఏ పాయింట్ గురించైనా మాట్లాడుండొచ్చు.. ఆర్ యూ స్టుప్టిడ్.. అతని తండ్రి ఏ పాయింట్ గురించైనా మాట్లాడుండొచ్చు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.. ఒక గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో ఇంత బ్యాడ్ అంపైర్ ఉంటారా.. ఓ మై గాడ్.. నీతోనే మాట్లాడుతున్నా నన్ను చూడు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెద్వెదెవ్ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరాడు. అంతకముందు ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫేల్ నాదల్, కెనడా టెన్నిస్ ఆటగాడు డెనిస్ షాపోవాలో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. చైర్ అంపైర్ నాదల్‌తో కుమ్మక్కయ్యాడని.. అవినీతి అంపైర్ అంటూ షాపోవాలో దూషించడం సంచలనంగా మారింది. ఇంతటితో ఊరుకొని షాపోవాలో... నాదల్కు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం ఇక పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో డానిల్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. గ్రీక్‌కు చెందిన నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్ ఫైనల్లో అడుగపెట్టాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో మెద్వెదెవ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. "If you don't call it, you are a small cat?" "Medvedev vs Tsitsipas pic.twitter.com/WS7yPXJGtb — Llama Says☄🌠🚀 (@funnyzeitgist) January 28, 2022 Medvedev vs the umpire, Round 2! 🛎️🥊#AusOpen - live on Channel 9, 9Now and Stan Sport. pic.twitter.com/XZgZ9qJgin — Wide World of Sports (@wwos) January 28, 2022 -
ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్, నిరుటి రన్నరప్ మెద్వెదెవ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల ఈవెంట్లో సిమోనా హలెప్ (రొమేనియా), అరిన సబలెంక (బెలారస్), ఇగా స్వియటెక్ (పోలండ్)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ మెద్వెదెవ్ 6–4, 6–4, 6–2తో వరుస సెట్లలో వాన్ డి జండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్... గంటా 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ 7–5, 7–6 (7/3), 3–6, 6–3తో ఐదో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–5, 6–7 (2/7), 6–4తో బెనాయిట్ పైర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియసిమ్ (కెనడా) 6–4, 6–1, 6–1తో డానియెల్ ఇవాన్స్ (ఇంగ్లండ్)పై, 11వ సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 1–6, 3–6, 6–1తో తరో డానియెల్ (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 4–6, 6–3, 6–1తో మర్కెటా వొండ్రోసొవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–3తో డారియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 14వ సీడ్ హలెప్ 6–2, 6–1తో డంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై గెలిచింది. -
Novak Djokovic: వారెవ్వా జొకోవిచ్... అరుదైన రికార్డు
Novak Djokovic Wins 37 Masters Title: సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తన కెరీర్లో 37వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను గెలిచాడు. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ 4–6, 6–3, 6–3తో మెద్వెదేవ్ (రష్యా)పై గెలిచాడు. ఈ విజయంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (36 మాస్టర్స్ టైటిల్స్)ను వెనక్కి నెట్టి అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. పీట్ సంప్రాస్ (అమెరికా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు. చదవండి: Abu Dhabi Chief Curator: అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య -
వరల్డ్ నెంబర్ వన్‌పై విజయం.. ఏటీపీ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత
Nitto ATP Finals: వచ్చే నెలలో ఇటలీలో జరిగే టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌కు ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) వరుసగా మూడో ఏడాది అర్హత సాధించాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవడంతో మెద్వెదెవ్కు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. కాగా సోమవారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. రెండు గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ... మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇదిలా ఉండగా.. గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. It was @DaniilMedwed's moment to shine at the #USOpen Highlights from the men's singles final 👇 pic.twitter.com/hfP58Ilnio — US Open Tennis (@usopen) September 12, 2021 చదవండి: VIDEO: యూఎస్ ఓపెన్ ఫైనల్లో మరోసారి బయటపడ్డ వెర్రితనం! రాకెట్ విరగొట్టి.. బాల్గర్ల్ను భయపెట్టి.. -
శోకోవిచ్... వరల్డ్ నంబర్‌వన్ కల చెదిరె
అవును... జొకోవిచ్ ఓడిపోయాడు! అరుదైన ఫామ్‌తో, ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శనతో ఆడుతూ వచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ఆఖరి మెట్టుపై అయ్యో అనిపించాడు! మెల్బోర్న్, పారిస్, లండన్ సమరాలను దిగ్విజయంగా దాటిన సెర్బియా స్టార్‌కు న్యూయార్క్ మాత్రం అనూహ్యంగా నిరాశను మిగిల్చింది. 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అత్యంత అరుదైన ఘనత సాధించే, ఇరవై ఒకటవ ‘మేజర్’ టైటిల్‌తో అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ముంగిట బరిలోకి దిగిన జొకో చివరకు ఓటమితో కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించాడు. జొకోవిచ్‌తో తలపడటం, అదీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అంటే ఓటమికి సిద్ధం కావడమే అనే స్థితి కనిపిస్తున్న దశలో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్ పెను సంచలనంతో సత్తా చాటాడు. మైదానం మొత్తం ప్రత్యర్థికి అనుకూలంగా హోరెత్తుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఆడిన అతను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో చిరునవ్వులు చిందించాడు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా... చివరి వరకు పోరాడుతానని మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన మెద్వెదెవ్ అంతకు మించిన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. న్యూయార్క్: 2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరే వరకు 27–0 మ్యాచ్‌ల విజయాలతో జోరు ప్రదర్శించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు భంగపాటు ఎదురైంది. యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. . మెద్వెదెవ్ జోరు... గతంలో జొకోవిచ్‌తో తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలోనూ ఓడిన మెద్వెదెవ్ ఈసారి పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చాడు. తొలి సెట్లో 8 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. రెండో సెట్లో జొకో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా... తొలి రెండు గేమ్‌లలో 5 బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న రష్యన్, ప్రత్యర్థి సరీ్వస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేయగలిగాడు. మూడో సెట్లోనూ ఇదే జోరు చూపించిన అతను డబుల్ బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. జొకో కొత్త చరిత్రను చూసేందుకు తరలివచ్చిన దిగ్గజ ఆటగాళ్లు, హాలీవుడ్ స్టార్లూ మెద్వెదెవ్ ఆటతో ఆశ్చర్యపోయారు. మ్యాచ్ చివర్లో స్టేడియంలోని అభిమానులంతా మెద్వెదెవ్‌ను గేలి చేయడం మొదలు పెట్టారంటే వారి దృష్టిలో ఈ ఫలితం ఎంత అనూహ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్లో 5–2 వద్ద డబుల్ ఫాల్ట్ చేసినా... చివరకు పదో గేమ్‌లో సరీ్వస్ నిలబెట్టుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తమ పెళ్లి రోజున తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్షణాన మెద్వెదెవ్... ‘డెడ్ ఫిష్’ సంబరాన్ని ప్రదర్శించాడు. జొకో అసహనం... మ్యాచ్‌లో కొన్ని కీలక సమయాల్లో లభించిన అవకాశాలను జొకోవిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సెట్లో రెండు సార్లు మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచి్చనా అది చేజారింది. ఒక దశలో 40–0తో ముందంజలో ఉన్నా చివరకు గేమ్ దక్కలేదు. దాంతో తీవ్ర అసహనంతో తన రాకెట్‌ను మూడు సార్లు నేలకేసి విరగ్గొట్టిన అతను అంపైర్ హెచ్చరికకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్లీ కోలుకోలేకపోయాడు. ఈ టోర్నీ మూడో రౌండ్ నుంచి సెమీస్ వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ జొకో తొలి సెట్ కోల్పోయాడు. ఫైనల్లోనూ అలాగే జరుగుతుందని అంతా ఆశించినా రష్యన్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి చేంజ్ ఓవర్ సమయంలో జొకో టవల్ మధ్యలో మొహం దాచుకొని ఏడ్చేశాడు! జొకో, అతని అభిమానులకు నా క్షమాపణలు. అతను గెలిస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. నా కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవగలనా అనుకునేవాడిని. గెలవకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉండాలనుకున్నా. ఇప్పుడు తొలి ‘గ్రాండ్’ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మరొకటి గెలిచినా ఇంతగా స్పందిస్తానో లేదు తెలీదు. జొకో ప్రతీ మ్యాచ్‌కు వ్యూహం మారుస్తాడు. అన్నింటికీ సన్నద్ధమై వచ్చా. పెళ్లి రోజు నా శ్రీమతికి ఈ టైటిల్‌ను బహుమతిగా ఇచ్చా. –మెద్వెదెవ్ ఈ రోజు గెలవకపోయినా మీ అభిమానం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా గుండెను తడిమిన మీ ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తిని నేనే అనిపిస్తోంది. అద్భుతంగా ఆడిన మెద్వెదెవ్కే గెలిచే అర్హత ఉంది. ఫలితం నిరాశ కలిగించినా... ఇన్ని రోజులుగా రికార్డు వేటలో నాపై ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడి, అంచనాల భారం తొలగిపోయినందుకు ప్రశాంతంగా అనిపిస్తోంది. –జొకోవిచ్ ► రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడు మెద్వెదెవ్. గతంలో కఫెలి్నకోవ్ (1996 ఫ్రెంచ్ ఓపెన్, 1999 ఆ్రస్టేలియన్ ఓపెన్), మరాత్ సఫిన్ (2000 యూఎస్ ఓపెన్, 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్) రెండేసి ట్రోఫీలు గెలిచారు. ► ఒకే గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో కొత్త చాంపియన్స్ అవతరించడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గాస్టన్ గాడియో (అర్జెంటీనా), అనస్తాసియా మిస్కినా (రష్యా) తొలిసారి ‘గ్రాండ్’ విజేతలుగా నిలిచారు. ► ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది. ► జొకోవిచ్ కెరీర్లో 11సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్ (11), ఇవాన్ లెండిల్ (11) సరసన జొకోవిచ్ కూడా చేరాడు. -
ఎమ్మా రాడుకాను ఆట చూడతరమా
-
Novak Djokovic: జొకోవిచ్.. ఇదేం ఆటిట్యూడ్ గురూ!
ఆయనో టెన్నిస్ ఛాంపియన్. ఎన్నో విజయాలు.. ఖాతాలో ఎన్నో గ్రాండ్ స్లామ్ టోర్నీలు. పైగా ర్యాంకింగ్‌లోనూ నెంబర్ వన్. కోట్లలో అభిమానులు. కానీ, అదే స్థాయిలో ద్వేషించేవాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం.. ఆట ఆడడం కన్నా కోర్టులో ఆయన ప్రవర్తించే తీరు. యూఎస్ ఓపెన్ 2021 ఫైనల్ సాక్షిగా అది మరోసారి బయటపడింది. ‘ఇదేం ఆటిట్యూడ్ గురూ!’ అంటూ.. జొకోవిచ్‌ను సోషల్ మీడియా ఏకీపడేస్తోంది. ఆటలో నిజాయితీ, అవతలి ఆటగాడిపై గౌరవం, ఓడినా గెలిచినా స్పోర్టివ్‌గా తీసుకునే తత్వం.. ఇవేవీ 34 ఏళ్ల సెర్బియన్ టెన్నిస్ ఛాంపియన్‌లో లేవనే చాలామంది చెప్పేస్తుంటారు. జొకోవిచ్‌కు హేటర్స్ ఎక్కువే. కానీ, ఆ హేటర్స్ ఇగ్నోర్ చేసేంత రేంజ్లో లేకపోవడమే అసలు సమస్య. అది యూఎస్ ఓపెన్ ఫైనల్ మరోసారి వెల్లడైంది. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్(25) చేతిలో వరుస సెట్స్ ఓడిపోతూ ఉంటే.. ఆ కోపాన్ని తట్టుకోలేక రాకెట్‌ను నేలకేసి విరకొట్టాడు జొకోవిచ్. అందుకే మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రౌడ్ నుంచి కాసేపు ‘బూ’ నినాదాలు వినిపించాయి. ఇక ఓడిపోతున్నాననే ఫ్రస్టేషన్‌ను బాల్ గర్ల్‌పై చూపించబోయాడు. ఇలా రెండుసార్లు ఇలా జరిగింది. కాస్తుంటే ఆ రాకెట్‌ను అమ్మాయిపై విసిరిసేవాడేమో. సరే విసిరేయలేదు కదా అనుకున్నా.. అలాంటి ప్రవర్తన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. Don’t try this at home. ⚠️ @DjokerNole | #USOpen pic.twitter.com/2lwjlyzUV0 — Live Tennis (@livetennis) September 12, 2021 జోకర్ బెస్టే కానీ.. అభిమానులు.. అభిమానించని వాళ్లూ జొకోవిచ్‌ను ‘జోకర్’(Djocker) అని ముద్దుగా పిలుస్తుంటారు. అందుకు కారణం.. కోర్టులో అతని ప్రవర్తన. బేసిక్‌గా సరదా మనిషి అయిన జొకోవిచ్.. కోర్టులో కోతి చేష్టలతో చూసేవాళ్ల పెదాలపై నవ్వులు పూయిస్తుంటాడు. ఒక్కోసారి క్రౌడ్ దగ్గరగా వెళ్లి ఇంటెరాక్షన్ కావడంతో పాటు సందర్భానికి తగ్గట్లు ఆట మధ్యలోనే సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శిస్తుంటాడు. సిల్లీ హ్యబిట్స్తో పాటు ఫన్నీ గెస్చర్స్‌తో నవ్విస్తుంటాడు. అందుకే జోకర్ అనే పేరు ముద్రపడింది. అయితే ఇతర ఆటగాళ్లను సైతం ఇమిటేట్ చేసే జొకోవిచ్.. ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు కూడా. రికార్డుల మీద, విజయాల ఉన్న ధ్యాస.. కోర్టులో ఎలా ప్రవర్తించడం అనేదాని మీద ఉండదనేది జొకోవిచ్ మీద ఉన్న ప్రధాన ఫిర్యాదు. ఇదే విషయాన్ని టెన్నిస్ దిగ్గజాలు సైతం చాలా ఇంటర్వ్యూలలో ఖుల్లాగా చెప్పేస్తుంటారు. ఆ లెక్కన ఈ ప్రపంచ ఛాంపియన్ అసలు ‘ఫెయిర్ ప్లేయర్’ కాదనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూడుస్తున్న మాట. He wanted to. 😡 @DjokerNole | #USOpen pic.twitter.com/ki0vz5Qw34 — Live Tennis (@livetennis) September 12, 2021 కొత్తేం కాదు.. మ్యాచ్ మధ్యలో జొకోవిచ్‌కు ఈ తరహాలో ప్రవర్తించడం కొత్తేం కాదు. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పోరు సందర్భంగా రాకెట్‌ను దూరంగా విసిరిపడేశాడు. అంతకు ముందు చాలాసార్లు చేశాడు. అయినా ఆటలో గెలుపోటములు సహజం. కానీ, ఒక ఛాంపియన్ హోదాలో ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్న అభిప్రాయం హేటర్స్ నుంచే కాదు.. సీనియర్స్ నుంచి, అతన్ని అభిమానించే వాళ్ల నుంచి సైతం వినిపిస్తోంది ఇప్పుడు. Djokovic just tossed his racquet into the stand. No warning. pic.twitter.com/TMCv29dCnQ — . (@Ashish__TV) July 31, 2021 చదవండి: US Open 2021- ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్! -
గెలుపును ఊహించని విజేతలు వీళ్లు
-
యూఎస్ ఓపెన్ ఫైనల్లో పెను సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ 2021లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో జకోను ఓడించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుతో పాటు కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధిద్దామనుకున్న జకో ఆశలపై నీళ్లు చల్లాడు. The moment @DaniilMedwed did the unthinkable. pic.twitter.com/rucHjhMA63 — US Open Tennis (@usopen) September 12, 2021 ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ తుది సమరంలో ప్రపంచ నంబర్ 2 ఆటగాడు మెద్వెదెవ్, జకోవిచ్ నువ్వానేనా అన్నట్లుగా ఆడారు. మెద్వెదెవ్ అద్భుత ఆటతో తొలి సెట్‌ను 6-4 తేడాతో గెలిచుకుని జకోవిచ్‌పై పైచేయి సాధించాడు. రెండో సెట్లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్ బ్రేక్‌లతో విరుచుకుపడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరింది. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మెద్వెదెవ్ 6-4తో రెండో సెట్‌ను సైతం కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో 34 ఏళ్ల జకోవిచ్ మొదట తేలిపోయినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ 25 ఏళ్ల మెద్వెదెవ్ విజయాన్ని 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను కూడా మెద్వెదెవ్ 6-4 తేడాతో గెలిచుకుని అర్ధశతాబ్దం తర్వాత నమోదవుతుందనుకున్న కెరీర్ గ్రాండ్‌స్లామ్ రికార్డుకు బ్రేకులు వేశాడు. 2019లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి ఓటమి పాలైన మెద్వెదెవ్ ఎట్టకేలకు ఈసారి టైటిల్ అందుకున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన నిలిచిన జకో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామనకున్నాడు. అయితే జకో ఆశలపై మెద్వెదెవ్ నీళ్లు చల్లాడు. కాగా, మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రెడుకాను (బ్రిటన్) విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: ఐపీఎల్ ప్యానెల్లో వివాదాస్పద వ్యాఖ్యాతకు నో ప్లేస్.. -
మ్యాచ్ మధ్యలో ఆ టాప్ టెన్నిస్ స్టార్ ఏం చేశాడో చూడండి..
సిన్సినాటి: మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ నంబర్ 2 క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్(రష్యా), సహచర రష్యా ఆటగాడు ఆండ్రే రుబ్లెవ్ మధ్య మ్యాచ్ సందర్భంగా(రెండో సెట్) డేనిల్ మెద్వెదెవ్ బంతిని కొట్టబోయే క్రమంలో బేస్‌లైన్ వద్ద ఆన్ కోర్టు కెమెరాను ఢీకొన్నాడు. ఈ ఘటనలో మెద్వెదెవ్కు కానీ కెమెరామెన్‌కు గానీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, అప్పటికే తొలి సెట్(6-2)ను గెలుపొంది, రెండో సెట్లో వెనుకబడిన మెద్వెదెవ్ సహనం కోల్పోయి.. కెమెరాను ఇక్కడి తీసేయండి, దీని వల్ల నా చెయ్యి విరిగినంత పనైందంటూ కెమెరాను కాలితో తన్నాడు. అప్పుడే మెద్వెదెవ్ క్షేమ సమాచారంపై ఆరా తీసేందుకు వచ్చిన ఫీల్డ్ అంపైర్.. వరల్డ్ నంబర్ 2 క్రీడాకారుడు చేసిన పనిని చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Why media is silent ? 🤪🤷🏻♂️ Daniil Medvedev KICKS THE CAMERA at Cincinnati Tennis Tournament!! https://t.co/79g1zZkxI4 via @YouTube pic.twitter.com/SAPkJCZJv5 — Yerik Ilyassov (@yerikilyassov) August 21, 2021 ఇదిలా ఉంటే, ఈ ఘటన అనంతరం లయ తప్పిన మెద్వెదెవ్ వరుసగా రెండు సెట్లు కోల్పోయి 6-2, 3-6, 3-6తో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. 2019లో ఈ టైటిల్‌ను నెగ్గిన మెద్వెదెవ్, ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే, కెమెరాను ఢీకొట్టడం ద్వారా ఏకాగ్రతను కోల్పోయిన అతను సెమీస్‌లోనే నిష్క్రమించాడు. ప్రత్యర్ధి రుబ్లెవ్ ఆదివారం జరగబోయే ఫైనల్లో జర్మనీ ఆటగాడు జ్వెరెవ్‌ను ఢీకొంటాడు. జ్వెరెవ్ సెకెండ్ సెమీఫైనల్లో గ్రీక్ ఆటగాడు, ప్రపంచ నంబర్ 3 స్టెఫానోస్ సిట్సిపాస్ 6-4 3-6 7-6 (4)కు షాకిచ్చి ఫైనల్‌కు చేరాడు. చదవండి: సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఈ ఎండల్లో ఆడి చావమంటారా..? స్టార్ టెన్నిస్ క్రీడాకారుడి ఆగ్రహం
టోక్యో: ఒలింపిక్స్‌కు వేదికైన టోక్యో నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్ మ్యాచ్‌లను మాధ్యాహ్నం వేళల్లో నిర్వహించడంపై ప్రపంచ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో భానుడి ప్రతాపం ధాటికి మెద్వెదెవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ సందర్భంగా మెద్వెదెవ్ డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. ఎండ వేడిమిని తాళలేక మ్యాచ్ మధ్యలో చైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. నేను యోధున్ని కాబట్టి గేమ్‌ను ఎలాగైనా పూర్తి చేస్తాను. ఈ మధ్యలో నేను చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ నిర్వాహకలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా మ్యాచ్‌ల నిర్వహణ సమయాన్ని మారుస్తారా లేక ఈ ఎండల్లో ఆడి చావమంటారా అంటూ నిర్వహకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా, నిప్పులు కక్కుతున్న భానుడి ప్రతాపం కారణంగా అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం ఇద్దరు ఆటగాళ్లు వడదెబ్బతో మధ్యలోనే నిష్క్రమించారు. ఇదిలా ఉంటే, క్రీడాకారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మారుస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) మొదలు కావాల్సిన మ్యాచ్‌లు గురువారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు. కాగా, మూడో రౌండ్ మ్యాచ్‌లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్వోసీ) ఆటగాడు మెద్వదెవ్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిపై 6-2, 3-6, 6-2తేడాతో విజయం సాధించి, క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. -
జయహో జొకోవిచ్
తనకెంతో కలిసొచ్చిన వేదికపై ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ చెలరేగాడు. రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచాడు. రష్యా యువతార డానిల్ మెద్వెదేవ్‌ను ఆద్యంతం హడలెత్తించి... వరుస సెట్లలోనే చిత్తు చేసి... ఈ మెగా టోర్నీ ఫైనల్స్‌లో తన అజేయ రికార్డును కొనసాగించాడు. కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ తన ప్రత్యర్థి దూకుడుకు ఎదురు నిలువలేక మరోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. మెల్బోర్న్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు. ► 113 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ కు తొలి సెట్లో మినహా ఎక్కడా గట్టిపోటీ ఎదురుకాలేదు. కచ్చితమైన సర్వీస్, బుల్లెట్‌లాంటి రిటర్న్ షాట్లు,బేస్‌లైన్ వద్ద అద్భుత ఆటతీరుతో జొకో విచ్ చెలరేగడంతో మెద్వెదేవ్‌కు ఓటమి తప్పలేదు. ► తాజా విజయంతో 33 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో తన విజయాల రికార్డును 9–0తో మెరుగుపర్చుకున్నాడు. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు. ► విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ► ఫైనల్ చేరే క్రమంలో కేవలం రెండు సెట్లు మాత్రమే కోల్పోయిన మెద్వెదేవ్ ఆటలు తుది పోరులో మాత్రం సాగలేదు. తొలి సెట్ రెండో గేమ్‌లోనే మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆలస్యంగా తేరుకున్న మెద్వెదేవ్ ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 3–3తో సమం చేశాడు. అయితే 6–5తో ఆధిక్యంలోకి వెళ్లిన జొకోవిచ్ 12వ గేమ్‌లో మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ► రెండో సెట్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. ఇద్దరూ తమ సర్వీస్‌లను చేజార్చుకోవడంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. ఆ తర్వాత జొకోవిచ్ జోరు పెంచడంతో మెద్వెదేవ్ డీలా పడ్డాడు. రెండుసార్లు మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ► మూడో సెట్ ఆరంభంలోనే జొకోవిచ్ బ్రేక్ పాయింట్ సాధించి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మెద్వెదేవ్ తేరుకునేందుకు ప్రయత్నించినా జొకోవిచ్ దూకుడు ముందు సాధ్యంకాలేదు. ► తాజా టైటిల్‌తో జొకోవిచ్ మార్చి 8వ తేదీ వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాడగం ఖాయమైంది. తద్వారా అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా (311 వారాలు) జొకోవిచ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉంది. ► 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. కొత్త తరం ఆటగాళ్లు తెరపైకి వచ్చారని, తమ ఆటతో మా ముగ్గురిని (ఫెడరర్, నాదల్, జొకోవిచ్) వెనక్కి నెట్టేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నాకు మాత్రం అలా అనిపించడంలేదు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లంటే గౌరవం ఉంది. కానీ వారు ‘గ్రాండ్’ విజయాలు సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాలి. రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండటం... టోర్నీ మధ్యలో గాయపడటం... మొత్తానికి నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడిన గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇది. ఈ టోర్నీతో నేను కొత్త పాఠాలు నేర్చుకున్నాను. – జొకోవిచ్ విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలతో జొకోవిచ్, మెద్వెదేవ్ -
జొకోవిచ్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్: సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్లో మాత్రమే జొకోవిచ్‌ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో కెరీర్లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను.. మొత్తంగా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేగాక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 82-9 తో తన విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్ మరో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్‌స్లామ్స్‌తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నాడు. -
మెద్వెదెవ్ మొదటిసారి...
మెల్బోర్న్: రష్యా ఆటగాడు, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి అర్హత సాధించాడు. ఆదివారం వీరిద్దరి మధ్య పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–2, 7–5తో ఐదోసీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)పై వరుస సెట్లలో గెలుపొందాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ కానుంది. గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న ఈ రష్యన్ స్టార్ ఏనాడు నాలుగోరౌండ్నే అధిగమించలేకపోయాడు. మొత్తం గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో అతని అత్యుత్తమ ప్రదర్శన యూఎస్ ఓపెన్ (2020)లో సెమీస్ చేరడమే! ఈ సారి మాత్రం మెల్బోర్న్లో మరో అడుగు ముందుకేశాడు. టైటిల్ దారిన పడ్డాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ ప్రతీ సెట్లోనూ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ను అలవోకగా గెలుచుకున్న నాలుగో సీడ్ ఆటగాడికి చివరి సెట్లో ప్రత్యర్థి సిట్సిపాస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 5–5 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకున్న మెద్వెదెవ్ తర్వాత గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–5తో అధిక్యంలోకి వచ్చాడు. మరుసటి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 7–5 స్కోరుతో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో రష్యన్ స్టార్ ఏస్‌లతో చెలరేగాడు. మూడు సెట్ల ఆటలో అతను 17 ఏస్‌లు సంధించగా... ప్రత్యర్థి 3 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 21 అనవసర తప్పిదాలు చేసిన మెద్వెదెవ్ 46 విన్నర్లు కొట్టాడు. మరోవైపు సిట్సిపాస్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 09 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు. అయితే రష్యన్ ఆటగాడికి ఫైనల్ మాత్రం కొండను ఢీకొట్టడమే! ఎందుకంటే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎనిమిది టైటిళ్లను ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే గెలవడం మరో విశేషం. ఇంతటి మేరునగధీరుడ్ని తొలిసారి ఫైనల్ చేరిన మెద్వెదెవ్ ఏ మేరకు ఎదుర్కొంటాడో ఆదివారం జరిగే ఫైనల్లో చూడాలి. -
మెద్వెదేవ్ మెరిసె...
లండన్: ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ జొకోవిచ్పై... 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రాఫెల్ నాదల్‌పై తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని రష్యా టెన్నిస్ నయాతార డానిల్ మెద్వెదేవ్ నిరూపించాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో 24 ఏళ్ల మెద్వెదేవ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ మెద్వెదేవ్ 4–6, 7–6 (7/2), 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ‘బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్’ ప్రవేశపెట్టాక సుదీర్ఘంగా సాగిన ఫైనల్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాదితో లండన్‌లో ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి తెరపడింది. వచ్చే ఏడాది నుంచి ఇటలీలోని ట్యూరిన్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ► 2 గంటల 43 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదేవ్ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్ టైబ్రేక్‌లో 0–2తో వెనుకబడిన మెద్వెదేవ్ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి టైబ్రేక్‌ను 7–2తో నెగ్గి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో ఐదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదేవ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా తన సర్వీస్‌లను కాపాడుకున్న ఈ రష్యా ప్లేయర్ చివరకు 6–4తో మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో థీమ్ వరుసగా రెండో ఏడాదీ ఈ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ► ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్ పాయింట్లు దక్కాయి. ► 50 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఏకకాలంలో ప్రపంచ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా మెద్వెదేవ్ గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో మెద్వెదేవ్ లీగ్ దశలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, ఫైనల్లో మూడో ర్యాంకర్ థీమ్‌పై గెలిచాడు. ► నికొలాయ్ డెవిడెంకో (2009) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్. ► ఓవరాల్‌గా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఒకే టోర్నీలో ఏకకాలంలో వరల్డ్ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించిన నాలుగో ప్లేయర్ మెద్వెదేవ్. గతంలో నల్బందియాన్ (అర్జెంటీనా–2007 మాడ్రిడ్ ఓపెన్‌లో), జొకోవిచ్ (సెర్బియా–2007 మాంట్రియల్ ఓపెన్‌లో), బోరిస్ బెకర్ (జర్మనీ–1994 స్టాక్‌హోమ్ ఓపెన్‌లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ► ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్ అవతరించాడు. ఈ టోర్నీలో ఇలా జరగడం ఇది రెండోసారి. మొదటిసారి 1974 నుంచి 1979 వరకు వరుసగా ఆరేళ్లు కొత్త విజేత వచ్చాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నపుడు నేను ఎంత గొప్ప ఫలితాలు సాధించగలనో ఈ టైటిల్ ద్వారా నిరూపితమైంది. ఈ గెలుపు భవిష్యత్‌లో మరిన్ని మేటి విజయాలకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నాను. –మెద్వెదేవ్ -
యూఎస్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్
-
ఉత్కంఠభరితంగా ఫైనల్ మ్యాచ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిల్ బుల్ రాఫెల్ నాదల్ గెల్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన తుది పోరులో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టిన మెద్వెదేవ్ అంత సులువుగా తలవంచలేదు. మొదటి రెండు సెట్లు రాఫెల్ గెలిచినప్పటికీ మెద్వెదేవ్ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడు. మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్కు చెమటలు పట్టించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో రాఫెల్ విజృంభించడంతో మెద్వెదేవ్ ఓటమి పాలయ్యాడు. నాలుగు గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. చాంపియన్ రాఫెల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 20 గ్రాండ్‌స్లామ్ టైటిట్స్‌తో రోజర్ ఫెదరర్.. నాదల్ కంటే ముందున్నాడు. మరో టైటిల్ సాధిస్తే ఫెదరర్ రికార్డును నాదల్ సమం చేస్తాడు. రికార్డు బ్రేక్ 30 ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా రాఫెల్ నాదల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెడరర్, నొవాక్ జకోవిచ్, రొడ్ లావెర్, కెన్ రోజ్‌వాల్ పేరిట ఉన్న రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి టైటిళ్లు సాధించారు. 33 ఏళ్ల నాదల్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు (2017, 2013, 2010) విజేతగా నిలిచిన అతడు ఒకసారి రన్నరప్ (2011)తో సరిపెట్టుకున్నాడు. కెరీర్లో 27వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన రాఫెల్ 19 ఫైనల్స్‌లో గెలిచి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)