కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్‌1 ఆటగాడు.. వీడియో వైరల్‌..! | Daniil Medvedev Shouts At Coach In Halle Open Final | Sakshi
Sakshi News home page

Halle Open Final: కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్‌1 ఆటగాడు.. వీడియో వైరల్‌..!

Published Mon, Jun 20 2022 12:08 PM | Last Updated on Mon, Jun 20 2022 12:12 PM

Daniil Medvedev Shouts At Coach In Halle Open Final - Sakshi

రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ 1 ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ ఆదివారం జరిగిన హాలీ ఓపెన్ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్‌ చేతిలో ఓడిపోయాడు. మెద్వెదేవ్‌పై 6-1, 6-4 వరుస సెట్లలో హుర్కాజ్‌ విజయం సాధించాడు. ఈ ఓటమితో అసహనానికి గురైన మెద్వెదేవ్ తన కోచ్‌ గిల్లెస్ సెర్వారాపై గట్టిగా అరిచాడు.

దీంతో సెర్వారా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించన వీడియోను టెన్నిస్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మెద్వెదేవ్‌కు ఇది వరుసగా రెండో గ్రాస్ కోర్ట్‌ ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్‌లో గ్రాస్ కోర్ట్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిని మెద్వెదేవ్‌ గెలుచుకున్నాడు.
చదవండి: Queen's Club Championships: సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement