Grass courts
-
కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..!
రష్యన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ ఆదివారం జరిగిన హాలీ ఓపెన్ ఫైనల్లో పోలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్ చేతిలో ఓడిపోయాడు. మెద్వెదేవ్పై 6-1, 6-4 వరుస సెట్లలో హుర్కాజ్ విజయం సాధించాడు. ఈ ఓటమితో అసహనానికి గురైన మెద్వెదేవ్ తన కోచ్ గిల్లెస్ సెర్వారాపై గట్టిగా అరిచాడు. దీంతో సెర్వారా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించన వీడియోను టెన్నిస్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మెద్వెదేవ్‌కు ఇది వరుసగా రెండో గ్రాస్ కోర్ట్ ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్లో గ్రాస్ కోర్ట్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిని మెద్వెదేవ్ గెలుచుకున్నాడు. చదవండి: Queen's Club Championships: సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట View this post on Instagram A post shared by Tennis TV (@tennistv) -
‘క్లే’లోనూ కొట్టారు
► సానియా జంటకు రోమ్ ఓపెన్ టైటిల్ ► సీజన్లో ఐదో ట్రోఫీ రోమ్: ఇప్పటివరకు హార్డ్, గ్రాస్ కోర్టులపై ఆధిపత్యం చలాయించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట... ఎట్టకేలకు క్లే కోర్టులపై (మట్టి కోర్టులు) తొలి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా అవతరించింది. ఫైనల్లో సానియా-హింగిస్ జోడీ 6-1, 6-7 (5/7), 10-3తో ‘సూపర్ టైబ్రేక్’లో మకరోవా-వెస్నినా (రష్యా) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ జోడీకి 1,23,700 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 93 లక్షల 64 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది వీరిద్దరికిది ఐదో టైటిల్.