‘క్లే’లోనూ కొట్టారు | Sania Mirza-Martina Hingis clinch Rome Masters title | Sakshi
Sakshi News home page

‘క్లే’లోనూ కొట్టారు

Published Mon, May 16 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

‘క్లే’లోనూ కొట్టారు

‘క్లే’లోనూ కొట్టారు

సానియా జంటకు రోమ్ ఓపెన్ టైటిల్
సీజన్‌లో ఐదో ట్రోఫీ
 

రోమ్: ఇప్పటివరకు హార్డ్, గ్రాస్ కోర్టులపై ఆధిపత్యం చలాయించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట... ఎట్టకేలకు క్లే కోర్టులపై (మట్టి కోర్టులు)  తొలి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా అవతరించింది.

ఫైనల్లో సానియా-హింగిస్ జోడీ 6-1, 6-7 (5/7), 10-3తో ‘సూపర్ టైబ్రేక్’లో మకరోవా-వెస్నినా (రష్యా) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ జోడీకి 1,23,700 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 93 లక్షల 64 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది వీరిద్దరికిది ఐదో టైటిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement