'మా జోడి కటీఫ్కు కారణం అదే' | Martina Hingis Says Recent Poor Results Main Reason For Split With Sania Mirza | Sakshi
Sakshi News home page

'మా జోడి కటీఫ్కు కారణం అదే'

Published Thu, Aug 11 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

'మా జోడి కటీఫ్కు కారణం అదే'

'మా జోడి కటీఫ్కు కారణం అదే'

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో కటీఫ్ చేసుకోవడానికి తమ పేలవ ప్రదర్శన కారణమని స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ స్పష్టం చేసింది. తమ జంట విడిపోవడంపై తొలిసారి పెదవి విప్పిన మార్టినా.. ఇటీవల కాలంలో తమ ప్రదర్శన ఎంతమాత్రం ఆశాజనకంగా లేదని  పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే సానియా మీడియాకు తెలియజేయగా, మార్టినా హింగిస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తమ 'టెన్నిస్ బంధానికి' గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొంది.

గతేడాది మార్చిలోసానియా-హింగిస్లు  'సాన్టినా'గా జత కట్టారు. అనంతరం ఈ జోడీ అప్రతిహత విజయాలతో దూసుకుపోయింది. వరుసగా 41 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని ఈ జోడి .. ఓవరాల్ గా 14 టైటిల్స్ను సొంతం చేసుకుంది. ఇందులో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2015 వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకున్న సాన్టినాలు.. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సైతం కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా గతేడాది తొమ్మిది టైటిల్స్ ఈ జోడి ఖాతాలో చేరాయి. దాంతో పాటు చార్లెస్టన్ టైటిల్ ను గెలిచిన అనంతరం వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ జోడీ ఘోరంగా విఫలం కావడంతో వారి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ను కాపాడుకోలేకపోవడంతో ఇక 'డబుల్స్'కు కటీఫ్ చెప్పాలని ఇరువురు క్రీడాకారిణులు నిశ్చయించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement