సానియా-హింగిస్ జంట ప్రత్యర్థి చాన్ సిస్టర్స్ | Sania-Hingis pair opponent Chan Sisters | Sakshi
Sakshi News home page

సానియా-హింగిస్ జంట ప్రత్యర్థి చాన్ సిస్టర్స్

Published Wed, Oct 26 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

సానియా-హింగిస్ జంట ప్రత్యర్థి చాన్ సిస్టర్స్

సానియా-హింగిస్ జంట ప్రత్యర్థి చాన్ సిస్టర్స్

న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)కి రెండో సీడింగ్ లభించింది. గురువారం మొదలయ్యే డబుల్స్ టోర్నమెంట్‌లో ఎనిమిది జంటలు నాకౌట్ పద్ధతిలో టైటిల్ కోసం పోటీపడనున్నారుు. శుక్రవారం జరిగే తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన అక్కాచెల్లెళ్లు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్‌లతో సానియా-హింగిస్ తలపడతారు.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్లో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) లేదా ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా)లతో ఈ ఇండో-స్విస్ జంట ఆడాల్సి ఉంటుంది. 2014లో కారా బ్లాక్ (జింబాబ్వే)తో, 2015లో హింగిస్‌తో సానియా ఈ టైటిల్‌ను సాధించింది. ఈసారీ టైటిల్ గెలిస్తేనే సానియా ఈ ఏడాదిని టాప్ ర్యాంకర్‌గా ముగించే అవకాశం ఉంది. ఇటీవలే హింగిస్‌తో తన భాగస్వామ్యానికి ముగింపు పలికిన సానియా ఈ మెగా ఈవెంట్ కోసం మళ్లీ జతకట్టింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement