Martina Hingis
-
భావోద్వేగానికి లోనైన సానియా.. ఇక్కడే మొదలు, ఇక్కడే ముగింపు అంటూ..
Sania Mirza Gets Emotional Video: ‘‘నా ప్రొఫెషనల్ కెరీర్ ఇక్కడే.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్బోర్న్లో మొదలైంది.. ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసిపోతోంది కూడా. రాడ్ లావెర్ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా ఇక్కడ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి తర్వాత తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఓటమితో ముగింపు కాగా ఇప్పటికే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్లో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్. మరో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ చేరుకున్న సానియా మెల్బోర్న్లో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్నారు. బ్రెజిల్ జంట లూసియా స్టెఫానీ- రఫేల్ మాటోస్ చేతిలో ఓడిపోయిన భారత జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్రెజిల్ ద్వయానికి కూడా ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. కన్నీళ్లు పెట్టుకున్న సానియా.. 36 ఏళ్ల సానియా మీర్జా కెరీర్లో ఇది 11వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. కాగా సానియా ఇప్పటి వరకు 43 డబుల్స్ టైటిళ్లు గెలిచారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. నంబర్ 1గా.. కానీ అదొక్కటే లోటు మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. అంతేగాక మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగారు. అయితే కెరీర్లో ఒక్కసారి కూడా ఆమె మేజర్ సింగిల్స్ టైటిల్ గెలవలేకపోయారు. ఇదే సానియా కెరీర్లో పెద్దలోటు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్ ఎదుట ఆడిన ఫైనల్లో ఓడిపోయిన సానియా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. వి లవ్ యూ! ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము సానియా’’ అని ట్వీట్ చేశారు. కాగా వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ కోర్టుకు పూర్తిగా దూరం కానున్నారు. సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు- భాగస్వాములు ►2006- ఆస్ట్రేలియా ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2012- ఫ్రెంచ్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2014- యూఎస్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- బ్రూనో సోర్స్ ►2015- వింబుల్డన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2015- యూఎస్ ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2016- ఆస్ట్రేలియా ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ చదవండి: Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... “My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.” We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0 — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
టెన్నిస్‌కు మార్టినా హింగిస్ వీడ్కోలు
స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ ప్రకటించింది. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం విశేషం. 17 ఏళ్ల వయసులో అతి పిన్న వయసులో సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డుసృష్టించిన హింగిస్... ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. గతంలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పదేళ్ల పాటు ఆటకు దూరమైన హింగిస్ 2013 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది. -
సానియా-హింగిస్ జంటకు షాక్
భారత స్టార్ టాప్ ర్యాంక్‌కు ముప్పు సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఊహించని పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 2-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోరుుంది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోరుు, రష్యా జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెథానీ మాటెక్ సాండ్స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్)లతో వెస్నినా-మకరోవా తలపడతారు. బెథానీ-సఫరోవా జంట టైటిల్ గెలిస్తే మాత్రం సానియా మీర్జా తన ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోతుంది. -
సానియా-హింగిస్ జంట ప్రత్యర్థి చాన్ సిస్టర్స్
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)కి రెండో సీడింగ్ లభించింది. గురువారం మొదలయ్యే డబుల్స్ టోర్నమెంట్లో ఎనిమిది జంటలు నాకౌట్ పద్ధతిలో టైటిల్ కోసం పోటీపడనున్నారుు. శుక్రవారం జరిగే తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన అక్కాచెల్లెళ్లు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్‌లతో సానియా-హింగిస్ తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్లో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) లేదా ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా)లతో ఈ ఇండో-స్విస్ జంట ఆడాల్సి ఉంటుంది. 2014లో కారా బ్లాక్ (జింబాబ్వే)తో, 2015లో హింగిస్‌తో సానియా ఈ టైటిల్‌ను సాధించింది. ఈసారీ టైటిల్ గెలిస్తేనే సానియా ఈ ఏడాదిని టాప్ ర్యాంకర్‌గా ముగించే అవకాశం ఉంది. ఇటీవలే హింగిస్‌తో తన భాగస్వామ్యానికి ముగింపు పలికిన సానియా ఈ మెగా ఈవెంట్ కోసం మళ్లీ జతకట్టింది. -
డిఫెండింగ్ చాంపియన్స్‌కు నిరాశ!
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడికి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోరులో ఈ ఇండో-స్విస్ ద్వయం 6-7(1), 6-3, 11-13 తేడాతో అమెరికా జంట కోకో వాందివెగీ-రాజీవ్ రామ్ చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన పేస్-హింగిస్ల జంట, రెండో సెట్ ను చేజిక్కించుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో పేస్ జోడి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌ను చివరకు అమెరికా జంట కైవసం చేసుకోవడంతో మరోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ను సాధించాలనుకున్న పేస్-మార్టినా జోడి ఆశలు తీరలేదు. ఈ ఓటమితో యూఎస్ ఓపెన్‌లో లియాండర్ పోరాటం ముగిసింది. అంతకుముందు పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న(భారత్)-గాబీ డాబ్రాస్కో(కెనడా) జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ జోడీ 5-7, 6-3, 10-7 తేడాతో లుకాస్ కుబాట్-అండ్రియా హ్లవకోవా జంటపై గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జంట 6-2, 7-6 తేడాతో గొలుబిక్ విక్టోరియా-మెలికర్ నికోలేపై గెలిచి మూడో రౌండ్ లోకి ప్రవేశించింది. -
హింగిస్‌పై సానియా పైచేయి!
సిన్సినాటి: నిన్న, మొన్నటి వరకూ సానియా మీర్జా(భారత్)-మార్జినా హింగిస్(స్విట్జర్లాండ్)లు 'సాన్‌టినా'గా జోడిగా మనకు సుపరిచితమే. అయితే ఈ జోడీకి కటీఫ్ చెప్పుకున్న అనంతరం జరిగిన తొలి పోరులో మార్టినా హింగిస్‌పై సానియా మీర్జా పైచేయి సాధించింది. సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా - బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్) ద్వయం 7-5, 6-4 తేడాతో మార్టినా హింగిస్-కోకో వాండెవేగ్(అమెరికా)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో డబ్యూటీఏ డబుల్స్‌లో సానియా ఒంటిరిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది మార్చిలోసానియా-హింగిస్లు 'సాన్‌టినా'గా జత కట్టారు. అనంతరం ఈ జోడీ అప్రతిహత విజయాలతో దూసుకుపోయింది. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈ జోడి .. ఓవరాల్ గా 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2015 వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకున్న సాన్టినాలు.. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సైతం కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా గతేడాది తొమ్మిది టైటిల్స్ ఈ జోడి ఖాతాలో చేరాయి. దాంతో పాటు చార్లెస్టన్ టైటిల్ ను గెలిచిన అనంతరం వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ ఘోరంగా విఫలం కావడంతో తమ టెన్నిస్ బంధానికి కటీఫ్ చెప్పుకున్నారు. -
భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఇది అర్థమౌతుందా?
ఇదేం ప్రేమ కాదు. పెళ్లీ కాదు. టెన్నిస్! టెన్నిస్ నా ప్రాణం. గెలిచి తీరాలి. కోర్టుకి అసలు నేను గెలవడానికే వెళ్తాను. లేకుంటే కోర్టుతో నాకేం పని?! నా దేశం స్విట్జర్లాండ్‌తో ఏం పని? వెళ్లిపోయేదాన్ని ఎప్పుడో, స్వేచ్ఛగా.. ఆల్ప్స్ పర్వతాల మీదుగా, తెల్లని ధూళినై.. గమ్యమే లేకుండా.. గాలిలో తేలుకుంటూ! ప్రేమల్ని నిలుపుకోడానికి లైఫ్‌లో నేను ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదు. పెళ్లి కూడా అంతే. నా భర్త హ్యుటిన్ ఏడ్చేవాడు.. ‘షి ఈజ్ అన్ఫెయిత్పుల్’ అని. ‘ఆ బిచ్కి ఒక్కడు కాదు’ అని వీధుల్లో పొర్లాడి పొర్లాడి ఏడ్చేవాడు. అతని ఏడుపు అతనిది. నేనెందుకు అతనితో కలిసి ఏడవాలి? డబుల్స్ ఆడుతున్నామా! ఇంకో ఏడుపుగొట్టు జట్టుపై ఏడ్చి విజయం సాధించడానికి?! ‘లీవ్ మీ ఎలోన్’ అన్నాను ఒకరోజు. ‘మరైతే.. ఎవడితో ఎలోన్‌గా ఉండబోతున్నావ్?’ అన్నాడు. విడిపోడానికి ఒక్కమాట చాలు. వంద వాదులాటలు అక్కర్లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ టెన్నిస్. నా లవర్, నా లైఫ్ పార్ట్నర్ టెన్నిస్. ‘ఒక్కడితోనైనా సఖ్యతగా ఉన్నావా?’ అని అడిగి, అలిగి వెళ్లిపోయేవాడే నా ప్రతి బాయ్‌ఫ్రెండూ. ‘నాకన్నా టెన్నిస్సే ముఖ్యమా నీకు’ అని వాళ్ల ప్రశ్న. పెద్దగా అరుస్తారు. ఫ్లవర్‌వాజ్ పగలగొట్టేస్తారు. ‘ఆట తప్ప నీకేదీ ముఖ్యం కాదా?’.. నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్న ఇది! ఒక మనిషికి జీవితంలో ఒకటేగా ముఖ్యమైనది ఉంటుంది. ముఖ్యమైనవి చాలా ఉన్నాయీ అంటే, ఆ మనిషికి ఏదీ ముఖ్యమైనది కాదని, ఆ మనిషి జీవితంలో ఏదీ ముఖ్యమైనది లేదని. నార్మన్, గార్షియా, రాడెక్, ఐవో, అలేన్సో... అంతా ఒకేలా మూతి బిగించి కూర్చున్న మగాళ్లే. ఒక్కరి మోకాళ్లలో కూడా ఫ్రెండ్‌గా నిలబడే సత్తువ లేదు! హ్యుటిన్ మాత్రం మూతి పగలగొట్టడానికి వచ్చేవాడు. భర్త కదా! ‘ఆట కోసం నువ్వు దేన్నైనా వదులుకుంటావ్.. సిగ్గులేని దానివి’ అనేవాడు ఉక్రోషంగా. ఆటతో నాకు దగ్గరై, తన కోసం అదే ఆటకు దూరంగా ఉండమని నన్ను ఆదేశిస్తున్నాడంటే.. షేమ్ ఆన్ మీ? షేమ్ ఆన్ హిమ్? ఇష్టమైనదాని కోసం దేన్నయినా వదులు కోవాలి. అప్పుడే మన ఇష్టానికి మీనింగ్ ఉంటుంది. టెన్నిస్‌ను నేను ఇష్టపడుతున్నానంటే, టెన్నిస్‌ను నేను ప్రేమిస్తున్నానంటే, టెన్నిస్‌ను నేను నా ప్రాణంగా చేసుకున్నానంటే... టెన్నిస్‌ను నేను ఆడి తీరాలి. టెన్నిస్‌లో నేను గెలిచి తీరాలి. ప్రేమలో, పెళ్లిలో.. గెలిచానా ఓడానా నాకు పట్టింపు లేదు. టెన్నిస్ కోసం నేను ప్రేమ నుంచి, పెళ్లి నుంచి ఎన్నిసార్ల యినా బయటికి రావడం కూడా నాకు గెలుపే. గెలవడం కోసమే సానియా, నేను కలసి ఆడాం. గెలుస్తున్నంత కాలం కలిసే ఆడాం. ఇప్పుడు విడిపోయాం. గెలవడం కోసమే విడిపోయాం. కలిసున్నామా, విడిపోయామా అని కాదు. ఎవరి దారిలో వాళ్లం గెలుస్తున్నామా లేదా? అదీ ముఖ్యం. భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఈ మాట ఎప్పటికైనా అర్థమౌతుందా? నో. నెవర్. - మాధవ్ శింగరాజు మార్టినా హింగిస్ (టెన్నిస్ స్టార్) రాయని డైరీ -
'మా జోడి కటీఫ్‌కు కారణం అదే'
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో కటీఫ్ చేసుకోవడానికి తమ పేలవ ప్రదర్శన కారణమని స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ స్పష్టం చేసింది. తమ జంట విడిపోవడంపై తొలిసారి పెదవి విప్పిన మార్టినా.. ఇటీవల కాలంలో తమ ప్రదర్శన ఎంతమాత్రం ఆశాజనకంగా లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే సానియా మీడియాకు తెలియజేయగా, మార్టినా హింగిస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తమ 'టెన్నిస్ బంధానికి' గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొంది. గతేడాది మార్చిలోసానియా-హింగిస్లు 'సాన్‌టినా'గా జత కట్టారు. అనంతరం ఈ జోడీ అప్రతిహత విజయాలతో దూసుకుపోయింది. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈ జోడి .. ఓవరాల్ గా 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2015 వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకున్న సాన్టినాలు.. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సైతం కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా గతేడాది తొమ్మిది టైటిల్స్ ఈ జోడి ఖాతాలో చేరాయి. దాంతో పాటు చార్లెస్టన్ టైటిల్ ను గెలిచిన అనంతరం వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ జోడీ ఘోరంగా విఫలం కావడంతో వారి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను కాపాడుకోలేకపోవడంతో ఇక 'డబుల్స్'కు కటీఫ్ చెప్పాలని ఇరువురు క్రీడాకారిణులు నిశ్చయించుకున్నారు. -
సానియా, హింగిస్ విడిపోయారు
భాగస్వాములను మార్చుకున్న టెన్నిస్ స్టార్స్ న్యూఢిల్లీ: గతేడాది ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా రెండు గ్రాండ్‌స్లామ్ సహా తొమ్మిది టైటిళ్లతో పాటు డబ్ల్యుటీఏ చాంపియన్‌షిప్‌ను సైతం దక్కించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో అనుకున్న ఫలితాలు కనిపించకపోవడంతో 16 నెలల తమ భాగస్వామ్యానికి వీరు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి సానియా చెక్ రిపబ్లిక్కు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ బార్బోరా స్ట్రికోవాతో... హింగిస్ అమెరికాకు చెందిన కోకో వాండెవేగ్తో కలిసి బరిలోకి దిగనున్నారు. 2015 మార్చిలో సానియా, హింగిస్ జతకట్టారు. ‘హింగిస్‌తో సానియా భాగస్వామ్యం ముగిసింది. గత ఐదు నెలలుగా ఈ జోడి అనుకున్నంతగా రాణించలేకపోతోంది. టాప్-100కు పైగా ర్యాంకింగ్స్ కలిగిన ఆటగాళ్ల చేతిలోనూ ఓడిపోతున్నారు. అందుకే విజయాలు రానప్పుడు భాగస్వామిని మార్చుకోవడం అనివార్యం’ అని సానియా సన్నిహిత వర్గాలు తెలిపాయి. చివరిసారిగా ఈ జోడి గత నెలలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్లో పాల్గొని క్వార్టర్స్‌లో ఓడిపోయింది. -
సానియా జంటకు షాక్
మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట పోరాటం ముగిసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ ద్వయం శనివారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 4-6, 3-6తో క్రిస్టినా మెక్‌హాలె-అసియా మొహమ్మద్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సానియా, పేస్ జోడీలకు చుక్కెదురు
లండన్: డిఫెండింగ్ చాంపియన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వింబుల్డన్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 2-6, 4-6తో ఐదోసీడ్ టిమియా బాబోస్ (హంగేరి)-ష్వెదోవా (కజకిస్తాన్)ల చేతిలో పరాజయం చవిచూశారు. 68 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడి అంచనాలకు అనుగుణంగా రాణించలేదు. తొలిసెట్లో మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను చేజార్చుకుని సెట్‌ను కోల్పోయారు. ఇక రెండోసెట్‌లోనూ ఒకటి, నాలుగు గేమ్‌ల్లో సర్వీస్ కోల్పోవడంతో బాబోస్-ష్వెదోవా 5-1 ఆధిక్యంలోకి వెళ్లారు. అయితే ఏడు, తొమ్మిదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సానియా జంట ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించింది. కానీ పదో గేమ్‌లో ష్వెదోవా-బాబోస్ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో సానియా-హింగిస్‌లకు ఓటమి తప్పలేదు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో లియాండర్ పేస్-హింగిస్ జోడి 6-3, 3-6, 2-6తో కాంటినెన్ (ఫిన్లాండ్)-వాట్సన్ (బ్రిటన్) చేతిలో ఓడింది. -
సానియా జోడికి షాక్
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడికి ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి 2-6, 4-6 తేడాతో ఐదో సీడ్ తిమియా బాబోస్(హంగేరి)-ష్వెదోవా(రష్యా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన 'సాన్టీనా' జోడి భారంగా ఇంటి ముఖం పట్టింది. అనవసర తప్పిదాలతో సానియా జోడి తగిన మూల్యం చెల్లించుకుంది. మరోవైపు బాబోస్ జంట అంచనాలు మించి రాణించడంతో పోరు ఆద్యంతం ఏకపక్షంగా సాగింది. -
క్వార్టర్స్‌లో సానియా జోడి
వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి క్వార్టర్స్‌కు చేరింది. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సానియా జోడి 6-1, 6-0తో మెక్‌హేల్(అమెరికా)-ఒస్టాపెన్కో (లాత్వియా) జోడిపై అలవోకగా నెగ్గింది. సానియా, హింగిస్ల ధాటికి ప్రత్యర్థులు కేవలం 46 నిమిషాల్లో చేతులెత్తేశారు. తొలిసెట్లో రెండుసార్లు, రెండో సెట్లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసిన ‘సాన్టీనా’ మ్యాచ్ మొత్తం మీద కేవలం ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో భారత ఆటగాడు బోపన్న-మార్గియా (రొమేనియా) జోడి 6-2, 3-6, 4-6, 7-6(6), 6-8తో హెన్రి కొంటినెన్(ఫిన్లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్ కు సానియా జోడి
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడి క్వార్టర్స్‌కు చేరింది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడి 6-1, 6-0 తేడాతో మెక్ హేల్-ఓస్టాపెన్కోపై గెలిచి క్వార్టర్స్ కు చేరింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా జోడి ఆద్యంతం ఆకట్టుకుంది. తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక పాయింట్ మాత్రమే కోల్పోయిన సానియా జోడి.. రెండో సెట్లో మాత్రం దుమ్మురేపింది. మరోవైపు పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా(రోమేనియా) 6-2, 3-6, 6-4, 7-6, 6-8 తేడాతో కాంటినెన్-పీర్స్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. -
చరిత్ర సృష్టించిన లియాండర్
-
పేస్-హింగిస్ ‘మిక్స్డ్’ కెరీర్ స్లామ్
► ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఇండో-స్విస్ ద్వయం ► ఫైనల్లో సానియా-డోడిగ్ జోడీపై గెలుపు పారిస్: వయసు పెరిగినా వన్నె తగ్గలేదని భారత, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మార్టినా హింగిస్ నిరూపించారు. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో పేస్-హింగిస్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ పేస్-హింగిస్ జోడీ 4-6, 6-4, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయంపై విజయం సాధించింది. ఈ విజయంతో ఇటు పేస్... అటు హింగిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జతగా... వేర్వేరుగా కెరీర్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) ఘనతను పూర్తి చేసుకున్నారు. 42 ఏళ్ల పేస్‌కిది ఓవరాల్‌గా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో పురుషుల డబుల్స్ విభాగంలో 8... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 10 ఉన్నాయి. మరోవైపు 35 ఏళ్ల హింగిస్‌కు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో మహిళల సింగిల్స్ విభాగంలో 5ు... మహిళల డబుల్స్‌లో 12... మిక్స్డ్ విభాగంలో 5 టైటిల్స్ ఉన్నాయి. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు లక్షా 16 వేల యూరోలు (రూ. 87 లక్షల 81 వేలు)... రన్నరప్ సానియా-డోడిగ్ జోడీకి 58 వేల యూరోలు (రూ. 43 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సానియా-డోడిగ్ జంటతో జరిగిన ఫైనల్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. తొలి సెట్లో తొమ్మిది గేమ్‌ల వరుకు రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. అయితే పదో గేమ్‌లో పేస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమైన సానియా-డోడిగ్ ద్వయం సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో నాలుగో గేమ్‌లో సానియా-డోడిగ్ జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్-హింగిస్ జంట 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆరో గేమ్‌లో పేస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి సానియా ద్వయం స్కోరును 3-3తో సమం చేసింది. కానీ ఏడో గేమ్‌లో సానియా జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తమ సర్వీస్‌ను కాపాడుకొని పేస్ ద్వయం 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6-4తో దక్కించుకుంది. ఇక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో ప్రతి పాయింట్‌కూ రెండు జోడీలు పోరాడాయి. చివరకు అనుభవజ్ఞులైన పేస్-హింగిస్ జోడీ పైచేయి సాధించింది. గతేడాది హింగిస్‌తో కలిసి ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నె గ్గిన పేస్... ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్నారు. -
సానియా-హింగిస్ జంటకు షాక్
మూడో రౌండ్లో ఓడిన టాప్ సీడ్ జోడీ క్వార్టర్స్‌లో ముర్రే , వావ్రింకా పారిస్: వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఊహించని షాక్ ఎదురైంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్లలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీకి ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 3-6, 2-6తో క్రెజ్సికోవా-సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-కుద్రయెత్సెవా (రష్యా) జంట 6-2, 3-6, 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)-హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) 7-6 (7/5), 7-6 (7/4)తో జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్)లపై... రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) 6-2, 6-7 (4/7), 6-1తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్)లపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-6 (11/9), 6-4, 6-3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 6-7 (7/9), 6-3, 6-2తో ట్రయెస్కీ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ అల్బెర్ట్ రామోస్ (స్పెయిన్) 6-2, 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై సంచలన విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-4తో స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)పై, షెల్బీ రోజర్స్ (అమెరికా) 6-3, 6-4తో ఇరీనా బేగూ (రుమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
ప్రి క్వార్టర్స్‌కు చేరిన పేస్-హింగిస్ జోడి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో లియాండర్ పేస్(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో పేస్-హింగిస్ల జోడి 6-4, 6-4 తేడాతో అన్నా లీనా గ్రోన్‌ఫెల్డ్(జర్మనీ)- రాబర్ట్ ఫరాఖ్(కొలంబియా) ద్వయంపై గెలిచి ప్రి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్లో ఇరు జోడీలు 2-2 తో సమానంగా నిలిచిన సమయంలో పేస్-హింగిస్లు 4-2 తో ముందంజ వేసింది. ఆ తరువాత ఇరు జోడీలు తమ సర్వీసులు కాపాడుకుంటూ ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించారు. అయితే 10 గేమ్ లో మాత్రం పేస్-హింగిస్లు అనవసర తప్పిదాలు చేయకుండా తొలి సెట్‌ను గెలుచుకున్నారు. ఇక రెండో సెట్ మూడో గేమ్‌లో ఆధిక్యం సాధించిన పేస్-హింగిస్లు.. ఎనిమిదో గేమ్ లో రెండు బ్రేక్ పాయింట్లు లభించడంతో మరింత ముందుకు వెళ్లారు. అయితే ఆపై అన్నా లీనా గ్రోన్‌ఫెల్డ్-రాబర్ట్ ఫరాఖ్ లు ఎదురుదాడికి దిగినా, పేస్-హింగిస్ల తన అనుభవాన్ని ఉపయోగించి రెండో సెట్ ను కైవసం చేసుకుని ప్రి క్వార్టర్స్ కు చేరారు. గతేడాది ఈ జోడీ ఆస్ట్రేలియా, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ టైటిల్స్ ను గెలిచిన సంగతి తెలిసిందే. -
సానియా జంట శుభారంభం
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 7-6 (7/4), 6-2తో కసాత్కినా-పనోవా (రష్యా) ద్వయంపై నెగ్గి శుభారంభం చేసింది. పురుషుల డబు ల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-2, 6-2తో రాబర్ట్-సిడొరెంకో (ఫ్రాన్స్) జోడీపై... లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలెండ్) ద్వయం 7-6 (7/3), 7-6 (8/6)తో బ్యూరీ (బెలారస్)-ఇస్తోమిన్ (ఉజ్బెకిస్తాన్) జంటపై గెలిచి రెండో రౌండ్లోకి చేరుకున్నాయి. -
‘క్లే’లోనూ కొట్టారు
► సానియా జంటకు రోమ్ ఓపెన్ టైటిల్ ► సీజన్లో ఐదో ట్రోఫీ రోమ్: ఇప్పటివరకు హార్డ్, గ్రాస్ కోర్టులపై ఆధిపత్యం చలాయించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట... ఎట్టకేలకు క్లే కోర్టులపై (మట్టి కోర్టులు) తొలి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా అవతరించింది. ఫైనల్లో సానియా-హింగిస్ జోడీ 6-1, 6-7 (5/7), 10-3తో ‘సూపర్ టైబ్రేక్’లో మకరోవా-వెస్నినా (రష్యా) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ జోడీకి 1,23,700 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 93 లక్షల 64 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది వీరిద్దరికిది ఐదో టైటిల్. -
సెమీస్‌లో సానియా జంట
న్యూఢిల్లీ: రోమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం రోమ్‌లో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-2తో రాకెల్ అటావో-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-3, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)-విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై గెలిచి సెమీస్‌కు చేరింది. -
రన్నరప్ సానియా-హింగిస్ జంట
మాడ్రిడ్: సీజన్లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 4-6తో కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా-హింగిస్‌లకు 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రెండు వారాల క్రితం స్టట్గార్ట్ ఓపెన్ టోర్నీ ఫైనల్లోనూ సానియా జంట గార్సియా-మ్లాడెనోవిచ్ చేతిలోనే ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. -
ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో...
మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో సానియా జోడి మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-0తో వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)లపై గెలిచారు. దీంతో ఈ సీజన్లో ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. స్టట్గర్ట్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సానియా ద్వయానికి వరుసగా ఇది రెండో ఫైనల్. కేవలం 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది. వీళ్ల దాటికి తొలిసెట్లో ప్రత్యర్థులు ఒక్కసారి కూడా సర్వీస్ నిలబెట్టుకోలేకపోయారు. సానియా ద్వయం రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోవడంతో కింగ్-అల్లా జంటకు రెండు పాయింట్లు దక్కాయి. రెండోసెట్లో రెండు, నాలుగో గేమ్‌లో ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ 4-0 ఆధిక్యంలో నిలిచారు. ఆ తర్వాత కూడా అదే జోరుతో సెట్, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. ఈ సీజన్లో సానియా ఖాతాలో సిడ్నీ, బ్రిస్బేన్, ఆస్ట్రేలియన్, సెయింట్ పీటర్స్బర్గ్ టైటిల్స్ ఉన్నాయి. శనివారం జరిగే ఫైనల్లో సానియా-హింగిస్... ఐదోసీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మల్డోనోవిచ్లతో తలపడతారు. -
ఫైనల్లో సానియా జోడి
మాడ్రిడ్:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో సానియా ద్వయం 6-2, 6-0 తేడాతో వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)పై గెలిచి ఫైనల్ చేరింది. 50 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా జోడి ఆద్యంత ఆకట్టుకుని తుది పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు టైటిల్ సాధించిన సానియా జోడి.. మరో టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా, సానియా జోడికి ఇది వరుసగా రెండో ఫైనల్. అంతకుముందు స్టట్గర్ట్ టోర్నమెంట్లో సానియా-హింగిస్ ల ద్వయం ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. -
సెమీస్‌లో సానియా జోడి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-3, 6-2తో ఆరోసీడ్ హల్వకోవా -హర్డెకా (చెక్)పై గెలిచింది. గంటా 2 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది. సెమీస్‌లో సానియా జోడి... వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)తో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
మాడ్రిడ్: మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-0, 6-4తో చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) -దరియా జురాక్ (క్రొయేషియా) జంటపై గెలిచింది. -
రన్నరప్ సానియా జంట
స్టట్గార్ట్ (జర్మనీ): ఈ సీజన్లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 81 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 1-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జంటకు 17,459 యూరోల (రూ. 13 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సానియా-హింగిస్ జంట బ్రిస్బేన్ , సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టోర్నమెంట్లలో టైటిల్ సాధించింది. -
ఫైనల్లో సానియా జంట
స్టట్గార్ట్ (జర్మనీ): వరుసగా మూడు టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ సత్తా చాటుకుంది. పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-4, 7-5తో సబీనా లిసికి (జర్మనీ)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంలో తడబడ్డాయి. సానియా జంట ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)-క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్) లేదా కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
సెమీస్‌లో సానియా జోడీ
స్టట్గార్ట్ (జర్మనీ): పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-1, 6-3తో బార్బరా క్రెజిసికోవా-కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ 6-1, 6-1తో ఎరి హొజుమి-మియు కాటో (జపాన్)లపై గెలిచారు. మరోవైపు బార్సిలోనా ఓపెన్ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జోడీ 6-7 (5/7), 4-6తో ట్రీట్ హువె (ఫిలిప్పీన్స్)-మాక్స్ మిర్నీ (బెలారస్) జంట చేతిలో ఓడిపోయింది. -
సానియా-హింగిస్ జంటకు షాక్
ఇండియన్ వెల్స్ ఓపెన్ టోర్నీ కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా రెండో ఏడాది ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ జోడీకి ఈసారి రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 4-6తో వానియా కింగ్ (అమెరికా)-అలా కుద్రయెత్సెవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. -
సానియా జంట శుభారంభం
కాలిఫోర్నియా (అమెరికా): ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట శుభారంభం చేసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 7-5తో కేసీ డెలాక్వా-సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రెండో రౌండ్లో వానియా కింగ్ (అమెరికా)-అలా కుద్రయెత్సెవా (రష్యా)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
సానియా జంట జైత్రయాత్రకు బ్రేక్
దోహా: గతేడాది ఆగస్టులో మొదలైన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట అప్రతిహత విజయయాత్రకు బ్రేక్ పడింది. ఖతార్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ జోడీకి ఓటమి ఎదురైంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ద్వయం 6-2, 4-6, 5-10తో ఎలీనా వెస్నినా-దరియా కసాత్కినా (రష్యా) జంట చేతిలో పరాజయం పాలైంది. దాంతో సానియా-హింగిస్ జోడీ 41 వరుస విజయాలకు తెరపడింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట నాలుగు డబుల్‌ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట తడబడి మూల్యం చెల్లించుకుంది. ఒకవేళ ఈ టోర్నీలో సానియా జంట విజేతగా నిలిచిఉంటే 1990లో జానా నొవోత్నా-నటాషా జ్వెరెవా నెలకొల్పిన 44 వరుస విజయాల రికార్డును సమం చేసేది. -
వరుసగా 41వ విజయం
ఖతార్ ఓపెన్ క్వార్టర్స్లోసానియా-హింగిస్ దోహా: సానియామీర్జా-మార్టినా హింగిస్ విజయయాత్ర మరో టోర్నీలోనూ కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా-హింగిస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం రాత్రి హోరాహోరీగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నంబర్‌వన్ జోడి 6-4, 4-6, 10-4 స్కోరుతో యి ఫాన్ యు-సైసై జెంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు టైటిల్స్ గెలిచిన సానియా-హింగిస్ జంటకు ఇది వరుసగా 41వ విజయం. -
సానియా జంటకే టైటిల్
హింగిస్‌తో కలిసి మరో ట్రోఫీ సొంతం * ఇండో-స్విస్ జంటకు వరుసగా 40వ విజయం సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా): వేదిక మారినా... ప్రత్యర్థి మారినా... ఫలితం మాత్రం మారలేదు. అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ ఖాతాలో మరో టైటిల్‌ను జమచేసుకుంది. ఆదివారం ముగిసిన సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో వెరా దుషెవినా (రష్యా) -బార్బరా క్రెజ్సికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. సానియా-హింగిస్‌లకిది వరుసగా 40వ విజయం కావడం విశేషం. జతగా వీరిద్దరికిది 13వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది నాలుగోది. ఈ సంవత్సరం సానియా-హింగిస్లు బ్రిస్బేన్ ఓపెన్, సిడ్నీ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జోడీకి 40,170 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 27 లక్షల 36 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 36వ, హింగిస్ కెరీర్లో 54వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
మాది అక్కాచెల్లెళ్ల బంధం
హింగిస్ గురించి సానియా * తదుపరి లక్ష్యం ఫ్రెంచ్ ఓపెన్ సాక్షి, హైదరాబాద్: మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్ సన్నాహకాలపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్స్ విజేతగా నిలిచిన అనంతరం స్వస్థలం తిరిగొచ్చిన సానియా సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడింది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే డబుల్స్‌లో తన కెరీర్ గ్రాండ్‌స్లామ్ కల నెరవేరుతుందని సానియా చెప్పింది. ‘నా తదుపరి లక్ష్యం కచ్చితంగా ఫ్రెంచ్ ఓపెనే. అది గెలిస్తే నా లక్ష్యం పూర్తవుతుంది. అయితే అంత సులభం కాదు. నిజాయితీగా చెప్పాలంటే అది మాకు అన్నింటికంటే కష్టమైన వేదిక. నేనూ, హింగిస్ ఇద్దరమూ క్లే కోర్టులో బలహీనం. అయితే తీవ్రంగా శ్రమించి సాధించాలనే పట్టుదలగా ఉన్నాం’ అని ఆమె వెల్లడించింది. 2015 అద్భుతంగా గడిచిందని, ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తే చాలనుకున్న తనకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో అద్భుతమైన ఆరంభం లభించిందని తెలిపింది. 2016లో కనీసం మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతామని విశ్వాసం వ్యక్తం చేసింది. హింగిస్‌తో ఆరంభంలో జత కట్టినప్పుడు కేవలం తాము కోర్టులో భాగస్వాములుగానే వ్యవహరించామని, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆ బంధం దృఢం కావడంతోనే ఈ వరుస విజయాలు సాధ్యమయ్యాయని ఆమె గుర్తు చేసుకుంది. ‘మా ఇష్టాఇష్టాలు కూడా కలవడంతో కోర్టు బయట కూడా మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇది అక్కాచెల్లెళ్ల మధ్య బంధంలా మారింది. ఆమెకు ప్రత్యర్థిగానే మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ ఆడాల్సి రావడంతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాం. లాకర్ రూమ్‌లో కలిసినప్పుడు ఏడుపొక్కటే తక్కువ. మరుసటిరోజు ఇద్దరం కలిసి మళ్లీ ఫైనల్స్ ఆడాల్సి రావడం అంటే అది ఎలాంటి సమయమో అర్థం చేసుకోవచ్చు’ అని సానియా మీర్జా చెప్పింది. బిజీగా ఉండే డబ్ల్యూటీఏ షెడ్యూల్లో ఒలింపిక్స్ కోసమంటూ 4-5 నెలలు వృథా చేయలేమని, అది చేరువలో ఉన్న సమయంలోనే భాగస్వామి గురించి నిర్ణయం తీసుకుంటానని సానియా స్పష్టం చేసింది. ‘పేస్, బోపన్నలలో ఎవరితో కలిసి ఆడాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దానికి చాలా సమయముంది. కటాఫ్ తేదీనాటికి నేను టాప్-10లో ఉంటానని నమ్మకముంది గానీ వారిద్దరి ర్యాంకింగ్ గురించి నేను చెప్పలేను. మిక్స్డ్ డబుల్స్‌లో పతకానికి ఎంత అవకాశం ఉందో... ఫెడరర్, జొకోవిచ్‌లాంటి ఆటగాళ్లు బరిలోకి దిగితే ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది’ అని మీర్జా విశ్లేషించింది. తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నానన్న సానియా, గెలిచినప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అసంఖ్యాక సందేశాలు వస్తాయని, ఓడినప్పుడు తిట్లకూ కొదవ ఉండదని చెప్పింది. అరుదైన గౌరవం: భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది. ‘నాకు ముందుగా సమాచారం లేదు. నేను ఈ అవార్డును ఊహించలేదు. ట్విట్టర్లో కొంత మంది అభినందించడం ప్రారంభించడంతో తెలిసింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ఫోన్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఏ అవార్డు గొప్పతనం దానిదే. గతంలో న్యూయార్క్‌నుంచి వచ్చి మరీ ఖేల్త్న్ర అందుకున్నా. ఈ సారీ టోర్నీ లేకపోతే ఎక్కడున్నా వచ్చి తీసుకుంటా’ అని వెల్లడించింది. -
హింగిస్‌పై సానియాదే పైచేయి!
-
హింగిస్‌పై సానియాదే పైచేయి!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 7-6(1), 6-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) పై గెలిచి సెమీస్ లోకి ప్రవేశించారు. ఒక గంటా 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా-డోడిగ్ ద్వయం పదునైన ఏస్ లతో ఆకట్టుకుంది. తొలి సెట్ టై బ్రేక్ కు దారి తీసినా సానియా-డోడిగ్ లు ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హింగిస్-పేస్ పై పైచేయి సాధించి ఆ గేమ్ ను కైవసం చేసుకున్నారు. ఆ తరువాత కూడా అదే ఊపును కొనసాగించడంతో సానియా-డోడిగ్ జోడి సెమీస్ కు చేరింది. తమ తదుపరి పోరులో ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రోనో సోర్స్(బ్రెజిల్) జంటతో సానియా-డోడిగ్ జోడి తలపడనుంది. 2009 లో మహేష్ భూపతి కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను సానియా చివరిసారి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళల డబుల్స్ విభాగంలో హింగిస్ తో కలిసి ఫైనల్ కు చేరిన సానియా మరో టైటిల్ కు ఒక అడుగు దూరంలో నిలిచింది. -
ఇంకొక్క అడుగే...
♦ టైటిల్‌కు విజయం దూరంలో సానియా-హింగిస్ జంట ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం మెల్బోర్న్: జతగా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించే దిశగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ మరో అడుగు ముందుకేశారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జోడీగా మహిళల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన వీరిద్దరు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జంటను చిత్తుగా ఓడించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మొత్తానికి సానియా-హింగిస్‌లకిది వరుసగా 35వ విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటతో ఈ ఇండో-స్విస్ ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో హలవకోవా-హర్డెకా 3-6, 6-3, 6-1తో యి ఫాన్ జు-సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)లపై గెలిచారు. బోపన్న జంటకు నిరాశ మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. అన్‌సీడెడ్ జంట ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)-ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్) ద్వయం 6-2, 7-5తో మూడో సీడ్ బోపన్న-జాన్ చాన్ జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముగిసిన ప్రాంజల పోరాటం జూనియర్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, కర్మాన్ కౌర్ థండి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. పదో సీడ్ ప్రాంజల 5-7, 5-7తో ఎనిమిదో సీడ్ అనస్తాసియా పొటపోవా (రష్యా) చేతిలో; కర్మాన్ కౌర్ 6-3, 5-7, 5-7తో సారా టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-కర్మాన్ జంట 6-7 (3/7), 5-7తో మాడిఇంగ్లిస్-జైమీ జోడీ చేతిలో ఓడారు. -
ఆమెతో కలసి గెలిచి.. ఆమెపైనే పోరాటం
మెల్బోర్న్: టెన్నిస్ మహిళల డబుల్స్ జోడీ భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) రికార్డు విజయాలు సాధించారు. ఎన్నో టైటిళ్లు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో ఈ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్‌లో సానియా, హింగిస్ ద్వయం విజయం సాధించింది. అయితే ఇదే ఈవెంట్లో రేపు వీరిద్దరూ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రత్యర్థులుగా తలపడనున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా.. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డొడిగ్‌తో కలసి ఆడతుండగా, మరో భారత వెటరన్ లియాండర్ పేస్.. మార్టినా హింగిస్‌తో కలసి బరిలో దిగాడు. ఈ రెండు జోడీలు క్వార్టర్స్‌లో అడుగు పెట్టాయి. అయితే గురువారం జరిగే క్వార్టర్స్ పోరులో సానియా, ఇవాన్ జోడీ.. పేస్, హింగిస్ జంటతో అమీతుమీ తేల్చుకోనుంది. దీంతో మహిళల డబుల్స్‌లో జోడీగా ఆడుతున్న సానియా, హింగిస్ రేపు ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. -
మరో టైటిల్‌కు అడుగు దూరంలో సానియా
మెల్బోర్న్: సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్‌లో టాప్ సీడ్ సానియా, హింగిస్ 6-1, 6-0 స్కోరుతో జులియా జార్జెస్ (జర్మనీ), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా జోడీ వరుస సెట్లలో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జంట శుభారంభం
సిడ్నీ: ప్రత్యర్థులు ఎవరైనా... వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... అన్నింటినీ అధిగమిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఈ ఇండో-స్విస్ జంట శుభారంభం చేసింది. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-3తో డూక్వీ మెరీనో-పెరీరా జోడీపై అద్భుత విజయం సాధించింది. ఇది సానియా-హింగిస్ జంటకు వరుసగా 31వ విజయం. -
సిడ్నీ ఓపెన్ సానియా జోడీదే...
♦ వరుసగా 30 మ్యాచ్‌లు గెలిచిన సానియా-హింగిస్ ♦ సిడ్నీ ఓపెన్ కైవసం చేసుకున్న ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ: డబుల్స్ నెంబర్ వన్ జోడీ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కరోలిన్ గార్సియా-క్రిస్టినా మ్లడనోవిక్ జంటపై 1-6, 7-5, 10-5 తేడాతో సానియా, హింగిస్ విజయం సాధించారు. సుమారు గంట 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జంటపై గెలిచి వరుసగా 30వ గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి సెట్ గార్సియా-క్రిస్టినా ద్వయానికి కోల్పోవడం, రెండో సెట్లో 1-4తేడాతో వెనకుంజలో ఉన్నా టాప్ సీడ్ ఏ దశలోనూ తమ పోరాట పటిమను వీడలేదు. టై బ్రేకర్‌లో పాయింట్ సాధించి రెండో సెట్ గెలిచిన సానియా జోడీ మూడో సెట్లోనూ ప్రత్యర్థి జంట నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తంగా ఈ జోడికిది 11వ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. కాగా, సిడ్నీ ఓపెన్ ఈ ఏడాది వీరికి రెండో టైటిల్. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 15 మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది. -
చరిత్ర సృష్టించిన సానియా జోడీ
-
చరిత్ర సృష్టించిన సానియా జోడీ
సిడ్నీ: సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గురువారం జరిగిన సిడ్నీ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో శ్వేదోవా-ఓలారు జోడిపై 4-6, 6-3, 10-8తేడాతో నెగ్గడం ద్వారా వరుసగా 29 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి జోడీగా సానియా-హింగిస్ రికార్డు సృష్టించారు. ఈ గెలుపుతో ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన 28 వరుస విజయాల రికార్డును సమం చేసిన విషయం విదితమే. -
సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు
సిడ్నీ: టెన్నిస్ మహిళల డబుల్స్ లో సంచలనాలు సృష్టిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ తాజాగా మరో రికార్డు నమోదు చేసింది. గతేడాది ఓవరాల్‌గా 10 డబ్ల్యూటీఏ టైటిల్స్ నెగ్గిన సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్‌లో వరుసగా 28 మ్యాచ్‌లు గెలిచి అత్యధిక విజయాలు సాధించిన జోడిగా నిలిచారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ లియాంగ్, సువాయ్ పెంగ్ జోడిపై 6-2, 6-3 తేడాతో డబుల్స్ నంబర్ వన్ ద్వయం గెలిచింది. సుమారు గంటపాటు జరిగిన మ్యాచ్‌లో చైనా జోడీపై విజయంతో ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడంతో పాటు ఒకసారి తమ సర్వీస్ నిలబెట్టుకున్నారు. ఈ విజయంతో 1994లో డబుల్స్ ద్వయం గిగి ఫెర్నాండేజ్, నటాషా జ్వెరేవా నెలకొల్పిన వరుస విజయాల రికార్డును సానియా-హింగిస్ సమం చేశారు. -
సానియా జంట శుభారంభం
సిడ్నీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ తమ విజయపరంపరను కొనసాగిస్తోంది. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఈ టాప్ సీడ్ జంట 6-2, 6-3తో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై అలవోకగా గెలిచింది. సానియా జంటకిది వరుసగా 27వ విజయం కావడం విశేషం. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (ఆస్ట్రేలియా) జంట కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో బోపన్న-మెర్జియా 6-7 (2/7), 6-3, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)లపై విజయం సాధించారు. -
క్వార్టర్స్‌లో సానియా జోడీ
సిడ్నీ: సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) 6-2, 6-3 స్కోరుతో అనస్టాసియా రొడియోనోవా, అరినా రొడియోనోవాపై విజయం సాధించారు. సానియా, హింగిస్ జోడీకిది 27వ విజయం. క్వార్టర్స్‌లో సానియా ద్వయం చైనీస్ క్రీడాకారిణులు లియంగ్ చెన్, షువాయ్ పెంగ్‌తో తలపడనుంది. -
సానియా ఫస్ట్.. హింగిస్ నెక్స్ట్!
న్యూఢిల్లీ: ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ లో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సానియా మీర్జా(భారత్), మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ తమ తమ ర్యాంకులను నిలుపుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలోని వ్యక్తిగత రాంకింగ్స్ లో సానియా మీర్జా తన నంబర్ ర్యాంకును పదిలంగా ఉంచుకోగా, హింగిస్ రెండో స్థానాన్ని నిలుపుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సానియా 11, 395 పాయింట్లతో అగ్రస్థానంలో, హింగిస్ 11, 355 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరు జోడి కట్టిన అనంతరం 10 టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. వీటిలో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కూడా ఈ వరల్డ్ నంబర్ వన్ జోడీ తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది కూడా బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ తో సానియా-హింగిస్ జోడీ శుభారంభం చేసింది. దీంతో తమ వరుస టైటిల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకోగా, వారి వరుస విజయాల సంఖ్య 26కు చేరింది. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ లో భారత్ నుంచి రోహన్ బోపన్న ఒక్కడే టాప్-10లో స్థానం సంపాదించాడు. -
సానియా-హింగిస్ ‘సిక్సర్’
♦ వరుసగా ఆరో టైటిల్ నెగ్గిన ఇండో-స్విస్ ద్వయం ♦ బ్రిస్బేన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం ♦ ఫైనల్లో కెర్బర్-పెట్కోవిచ్ జంటపై గెలుపు బ్రిస్బేన్: ఊహించినట్టే కొత్త ఏడాదిని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్ టైటిల్‌తో ప్రారంభించారు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ 7-5, 6-1తో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 45,990 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 76 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ♦ జోడీగా సానియా-హింగిస్‌లకిది వరుసగా ఆరో టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించిన సానియా-హింగిస్ ఈ ఏడాది ఆడిన తొలి టోర్నీలోనే విజేతగా నిలిచారు. ♦ ఓవరాల్‌గా సానియా-హింగిస్ జంటకిది 10వ డబుల్స్ టైటిల్. సానియా కెరీర్లో ఇది 33 వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కు 51వది. ఈ ఇండో-స్విస్ జోడీకిది వరుసగా 26వ విజయం. మరోవైపు సానియా డబుల్స్ కెరీర్లో ఇది 401వ గెలుపు, హింగిస్‌కు 382వ విజయం. ♦ 69 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా-హింగిస్ రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి సెట్లో ఒకదశలో సానియా జంట 2-4తో వెనుకబడింది. అయితే వెంటనే తేరుకున్న ఈ ఇండో-స్విస్ జంట స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తర్వాత 12వ గేమ్‌లో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ ద్వయం తొలి సెట్‌ను 43 నిమిషాల్లో దక్కించుకుంది. ఇక రెండో సెట్లో ప్రపంచ నంబర్‌వన్ జంటకు ఎదురులేకపోయింది. పూర్తి సమన్వయంతో ఆడిన సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ♦ బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం సానియా, హింగిస్‌లకిది రెండోసారి. గతేడాది సబైన్ లిసికి (జర్మనీ) భాగస్వామిగా హింగిస్ టైటిల్ నెగ్గగా... 2013లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) భాగస్వామిగా సానియా ఈ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. ♦ 1994 తర్వాత మహిళల డబుల్స్‌లో ఓ జంట వరుసగా 26 మ్యాచ్‌లు నెగ్గడం ఇదే ప్రథమం. చివరిసారి 1994లో నటాషా జ్వెరెవా (బెలారస్)-గీగీ ఫెర్నాండెజ్ (అమెరికా) ద్వయం వరుసగా 28 మ్యాచ్‌లు గెలిచింది. ‘‘ప్రత్యర్థి జంట పటిష్టంగా ఉండటంతో మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిం చాలని తెలుసు. ఆరంభంలో వెనుకబడ్డా ఆ తర్వాత తేరుకున్నాం. 12వ గేమ్‌లో సర్వీస్ బ్రేక్ సాధించడం మ్యాచ్‌లో కీలక మలుపుగా భావిస్తున్నాను.’’ -సానియా మీర్జా ‘‘సీజన్‌నులో విజయంతో ప్రారంభించడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్రిస్బేన్ టైటిల్ నెగ్గడం గొప్పగా అనిపిస్తోంది. వచ్చే వారం సిడ్నీ ఓపెన్‌లోనూ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాం. అక్కడా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం.’’ -మార్టినా హింగిస్ -
సానియా జోడీ.. సాధించెన్
బ్రిస్బేన్: అదే జోరు..అదే ఫలితం. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)ల జోడీ ఈ సీజన్ ను కూడా టైటిల్ తో శుభారంభం చేసింది. బ్రిస్బేన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ల ద్వయం 7-5, 6-1 తేడాతో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించి టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. తొలి సెట్ లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న ఈ వరల్డ్ నంబరవన్ జోడీ.. ఆ తరువాత రెండో గేమ్ ను మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చేజిక్కించుకుంది. ఇది సానియా-హింగిస్ జంటకిది వరుసగా 26వ విజయం. దీంతో 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జంట వరుసగా 25 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డును సానియా-హింగిస్ జోడీ బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరి కలిసి సాధించిన టైటిల్స్ సంఖ్యను 10కు పెంచుకుంది. -
మరో టైటిల్ దిశగా...
♦ బ్రిస్బేన్ ఓపెన్ ఫైనల్లో ♦ సానియా జంట బ్రిస్బేన్: కొత్త ఏడాది, కొత్త సీజన్లోనూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన జోరును కొనసాగిస్తోంది. తనకెంతో కలిసొచ్చిన స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి సానియా మీర్జా బ్రిస్బేన్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 7-5తో ఆండ్రియా క్లెపెక్ (స్లొవేకియా)-అలా కుద్రయెత్సెవా (రష్యా) జోడీపై విజయం సాధించింది. సానియా-హింగిస్ జంటకిది వరుసగా 25వ విజయం కావడం విశేషం. చివరిసారి ఈ ఇండో-స్విస్ జోడీకి గతేడాది ఆగస్టులో సిన్సినాటి ఓపెన్ సెమీఫైనల్లో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి ఎదురైంది. శనివారం జరిగే ఫైనల్లో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ)లతో సానియా-హింగిస్ తలపడతారు. 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జంట వరుసగా 25 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ తర్వాత సానియా-హింగిస్ జోడీయే ఈ ఘనత సాధించింది. -
టైటిల్‌కు అడుగు దూరంలో..
బ్రిస్బేన్: గతేడాది విశేషంగా రాణించిన సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)జోడీ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ జోడీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా-హింగిస్ల జంట 6-3, 7-5 తేడాతో అంద్రెజా క్లెపేక్-కుద్రయస్తివా (రష్యా) జోడిపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ప్రస్తుతం మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ గా కొనసాగుతున్న సానియా-హింగిస్ల ద్వయం తొలి గేమ్ ను అలవోకగా గెలుచుకున్నా... రెండో గేమ్ లో మాత్రం రష్యా జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. అయినప్పటికీ సానియా-హింగిస్లు అనవసర తప్పిదాలకు పదేపదే చేయకుండా రెండో గేమ్ ను గెలుచుకుని టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచారు. -
సెమీస్‌లో సానియా జంట
బ్రిస్బేన్: గతేడాది పది డబుల్స్ టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి బ్రిస్బేన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 4-6, 10-6తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. అంతకుముందు తొలి రౌండ్లో సానియా-హింగిస్ 6-1, 6-2తో షహర్ పీర్ (ఇజ్రాయెల్)- శాంచెజ్ (అమెరికా)లపై గెలిచారు. -
సానియా-హింగిస్ జోడికి ఐటీఎఫ్ అవార్డు
లండన్:ఈ ఏడాది మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) వరల్డ్ చాంపియన్స్ అవార్డును భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మహిళల మాజీ నెంబరవన్ మార్టినా హింగిస్(స్విట్టర్లాండ్)ల జోడి గెలుచుకుంది. 2015 మార్చిలో జత కట్టిన వీరిద్దరూ విశేషంగా రాణించి మొత్తం తొమ్మిది టైటిల్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. వరుసగా 22 మ్యాచ్‌లను సానియా జోడీ గెలుచుకోవడం విశేషం. దీంతో ఊహించినట్లుగానే ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ అవార్డుకు ఈ జోడీ ఎంపికైంది. కాగా, 2000లో మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఐటీఎఫ్ అవార్డును మార్టినా హింగిస్ గెలుచుకుంది. ఐటీఎఫ్ అవార్డును గెలుచుకోవడం పట్ల సానియా ఆనందం వ్యక్తం చేసింది. 'ఈ సంవత్సరం మాకు చాలా సంతృప్తిని మిగిల్చింది. అనుకున్నదాని కంటే చాలా సాధించాం. ఐటీఎఫ్ అవార్డును స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నా సక్సెస్ భారత్ లో చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది'అని సానియా పేర్కొంది. -
హైదరాబాద్ ఆతిథ్యానికి ముగ్ధురాలైన హింగిస్
మూసాపేట (హైదరాబాద్) : హైదరాబాద్ నగరం చాలా బాగుందని, ఇక్కడి అతిథ్యం ఇంకా బాగుందని టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ అన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని సుజనాఫోరం మాల్లో ఎస్వీఎం ఫన్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మార్టినా హింగిస్, థామస్ జాన్సన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు వినోద కేంద్రంలో బౌలింగ్ గేమింగ్ ఎంతో ఉత్సాహంగా ఆడారు. హింగిస్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో ఆడటం సంతోషంగా ఉందని, నిన్న మ్యాచ్ గెలవడం ఆనందాన్నిచ్చిందన్నారు. టైటిల్ కోసం కృషి చేస్తామని చెప్పారు. -
హైదరాబాద్‌లో నేటి నుంచి సీటీఎల్
ఏసెస్ తరఫున బరిలో హింగిస్ సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్ టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్‌లకు నేటి నుంచి హైదరాబాద్ వేదిక కానుంది. లాల్‌బహదూర్ స్టేడియంలో ఆది, సోమవారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో నాగ్‌పూర్ ఆరెంజర్స్‌తో తలపడే హైదరాబాద్ ఏసెస్... మరుసటి రోజు చెన్నై వారియర్స్‌ను ఎదుర్కొంటుంది. హైదరాబాదీ సానియా మీర్జా భాగస్వామి, ప్రపంచ డబుల్స్ రెండో ర్యాంకర్ అయిన మార్టినా హింగిస్ ఈ ఏడాది కూడా ఏసెస్ జట్టు తరఫునే బరిలోకి దిగుతుండటం విశేషం. ఆమెతో పాటు థామస్ జాన్సన్, ఇవో కార్లోవిచ్, జీవన్ నెడుంజెళియన్, ఆదిల్ కళ్యాణ్పూర్, సామ సాత్విక ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఒక ‘టై’గా పరిగణిస్తారు. ఈ ‘టై’లో ఐదు సెట్లు ఉంటాయి. ఈ ఐదు సెట్లు వరుసగా లెజెండ్స్ సింగిల్స్, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఒక్కో సెట్లో ఐదు గేమ్‌లే ఆడతారు. ఐదు సెట్లు కలిపి ఎక్కువ గేమ్‌లు గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా చెన్నైతో జరిగి తొలి ‘టై’లో హైదరాబాద్ విజయం సాధించింది. -
'మరి కొన్నేళ్లు ఆ జోడిదే హవా'
ముంబై: ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ నంబర్ వన్ క్రీడాకారిణులు సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లపై భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది రెండు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ తో సహా తొమ్మిది టైటిల్స్ ను గెలిచిన సానియా-హింగిస్ ల జోడి కొన్నేళ్ల పాటు అదే ఊపును కొనసాగించి మరిన్ని గ్రాండ్ స్లామ్స్ ను సొంతం చేసుకుంటారని భూపతి అభిప్రాయపడ్డాడు. ' సానియా ఒక స్ఫూర్తి. గత మూడు సంవత్సరాల నుంచి తీవ్రంగా కష్టపడుతూ మంచి ఫలితాలను సాధిస్తోంది. ఆ జోడి జైత్రయాత్ర ఈ ఏడాదికి మాత్రమే పరిమితం కాదు.. వారి హవా మరి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆటలో సానియా-హింగిస్ ల సహకారం నిజంగా అద్భుతం' అని భూపతి కొనియాడాడు. 2016 రియో ఒలింపిక్స్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల ద్వయం, పురుషల డబుల్స్ లో రోహన్ బోపన్న-లియాండర్ పేస్ ల జోడి పతకాలను సాధించే అవకాశం ఉందన్నాడు. -
సూపర్ సానియా
ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో ఈ ఏడాది అంచనాలకు మించి రాణించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సీజన్‌ను గొప్ప విజయంతో ముగించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ స్టార్ మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా సీజన్ ముగింపు టోర్నమెంట్‌ను వరుసగా రెండోసారి నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా సానియా కొత్త చరిత్ర సృష్టించింది. * రెండోసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సొంతం * ఈసారి హింగిస్‌తో కలిసి ఘనత * ఒక్క సెట్ కోల్పోకుండా జైత్రయాత్ర * సీజన్లో ఇండో-స్విస్ జోడీకిది తొమ్మిదో టైటిల్ సింగపూర్: ఎలాంటి సంచలనం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా-హింగిస్ 6-0, 6-3తో ముగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) జోడీని చిత్తుగా ఓడించింది. * కేవలం 66 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జంట పూర్తి ఆధిపత్యం చలాయించింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ ఇండో-స్విస్ జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్లో ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్లో కాస్త పోటీ ఎదుర్కొన్న సానియా-హింగిస్ జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. * ఈ టోర్నమెంట్లో సానియా-హింగిస్ ద్వయం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. గత 22 మ్యాచ్‌ల నుంచి సానియా జంటకు ఓటమి లేకపోవడం విశేషం. * గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గడం సానియాకిది రెండోసారి. గతేడాది కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా ఈ టైటిల్‌ను సాధించగా... ఈసారి హింగిస్‌తో టైటిల్‌ను నిలబెట్టుకుంది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. * ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా.. ఈ ఏడాది 10వ టైటిల్. హింగిస్‌తో కలిసి తొమ్మిదోది. సానియా-హింగిస్ జంట ఈ ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్, చార్ల్స్టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ ఓపెన్, వుహాన్ ఓపెన్, బీజింగ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీల్లో టైటిల్స్ సాధించింది. సిడ్నీ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. * మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్లో ఇది 50వ డబుల్స్ టైటిల్. తద్వారా ఈ ఘనత సాధించిన 16వ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా, రోసీ కాసల్స్, పామ్ ష్రైవర్, బిల్లీ జీన్ కింగ్, జ్వెరెవా, లీసా రేమండ్, యానా నొ వోత్నా, అరంటా శాంచెజ్, గీగీ ఫెర్నాండెజ్, సుకోవా, లారిసా, కారా బ్లాక్, రెనీ స్టబ్స్, వెండీ టర్న్బాల్, లీజెల్ హుబెర్ ఉన్నారు. 1 సిడ్నీ ఓపెన్ భాగస్వామి: బెథానీ మాటెక్ (అమెరికా) ఫైనల్ ప్రత్యర్థి: రాకెల్ కాప్స్-అబిగేల్ స్పియర్స్ (అమెరికా); ఫైనల్ స్కోరు: 6-3, 6-3 2 ఇండియన్ వెల్స్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా) ఫైనల్ స్కోరు: 6-3, 6-4 3 మియామి ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా) ఫైనల్ స్కోరు: 7-5, 6-1 4 చార్ల్స్టన్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: డెలాక్వా (ఆస్ట్రేలియా)-జురాక్ (క్రొయేషియా); ఫైనల్ స్కోరు: 6-0, 6-4 5 వింబుల్డన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా) ఫైనల్ స్కోరు: 5-7, 7-6 (7/4), 7-5 6 యూఎస్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-ష్వె దోవా (కజకిస్తాన్); ఫైనల్ స్కోరు: 6-3, 6-3 7 గ్వాంగ్జూ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: షిలిన్ జు-జియోడి యు (చైనా) ఫైనల్ స్కోరు: 6-3, 6-1 8 వుహాన్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: ఇరీనా-మోనికా నికెలెస్కూ (రుమేనియా); ఫైనల్ స్కోరు: 6-2, 6-3 9 బీజింగ్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: హావో-యుంగ్ జాన్ (తైపీ) ఫైనల్ స్కోరు: 6-7 (9/11), 6-1, 10-8 10 డబ్ల్యూటీఏ ఫైనల్స్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: ముగురుజా- కార్లా నవారో (స్పెయిన్); ఫైనల్ స్కోరు: 6-0, 6-3 ఏడేళ్ల తర్వాత... ఈ ఏడాది మార్చిలో మార్టినా హింగిస్‌తో కలిసి సానియా మీర్జా తొలిసారి బరిలోకి దిగింది. జంటగా ఆడిన తొలి టోర్నమెంట్ (ఇండియన్ వెల్స్)లోనే వీరికి టైటిల్ దక్కింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు టోర్నీల్లో (మియామి, చార్ల్స్టన్) ఈ ద్వయం విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ క్రమంలో సానియా మీర్జా ఏప్రిల్‌లో డబుల్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆరు టోర్నీల్లో సానియా-హింగిస్ ఆడినా వారికి టైటిల్ దక్కలేదు. వింబుల్డన్ టోర్నీలో టైటిల్ సాధించి ఈ జంట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. టొరంటో, సిన్సినాటి టోర్నీల్లో వీరు విఫలమైనా... వెంటనే తేరుకొని ఆ తర్వాత వరుసగా నాలుగు టోర్నీల్లో టైటిల్స్ సంపాదించారు. ఈ క్రమంలో 2008 తర్వాత ఒకే సీజన్లో అత్యధికంగా తొమ్మిది టైటిల్స్ నెగ్గిన జంటగా సానియా-హింగిస్ గుర్తింపు పొందారు. 2008లో కారా బ్లాక్-లీజెల్ హుబెర్ ద్వయం 10 టైటిల్స్ సాధించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో సానియా-హింగిస్ జంట 16 టోర్నీల్లో బరిలోకి దిగి... తొమ్మిదింటిలో టైటిల్ సాధించింది. ఈ ఏడాది సానియా మీర్జా నలుగురు వేర్వేరు (సు వీ సెయి, బెథానీ మాటెక్, కేసీ డెలాక్వా, మార్టినా హింగిస్) భాగస్వాములతో 22 టోర్నమెంట్లలో బరిలోకి దిగి 65 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కోర్టు లోపలే కాదు బయట కూడా మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం, స్నేహం ఉంది. జీవితకాలం కష్టపడేది ఇలాంటి క్షణాల కోసమే. వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో సాధించిన ఈ విజయం అద్భుతం. ఆటతోపాటు అదృష్టం కూడా కలిసి రావడంతో ఈ ఏడాది మా జంటకు మంచి ముగింపు లభించింది. -సానియా మీర్జా ఈ రోజు మేమిద్దరం అద్భుతంగా ఆడాం. సానియా ఆటతీరును ఎంత ప్రశంసించినా తక్కువే. కోర్టులో అద్భుత కదలికలతో అనుక్షణం నాకు మద్దతుగా నిలిచింది. మంచి భాగస్వామి లభిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సానియా నిరూపించింది. -మార్టినా హింగిస్ -
సానియా అదరహో...
-
సానియా అదరహో...
-
సానియా అదరహో...
సింగపూర్: మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి జోడీ కట్టిన తరువాత అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నభారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరోసారి అదరగొట్టింది. సీజన్ ముగింపు టోర్నీ అయిన డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం చేసుకుని తమ జంటకు తిరుగులేదని నిరూపించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా ద్వయం 6-0, 6-3 తేడాతో ఎనిమిదో సీడ్ ముగురుజ్జా-సూరేజ్ నవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించి టైటిల్ ను ముద్దాడింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్యను తొమ్మిదికి పెంచుకోగా.. ఆ జోడీ ఖాతాలో వరుసగా 22 వ విజయం వచ్చి చేరింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్కిది 50వ డబుల్స్ టైటిల్ కావడం మరో విశేషం. తొలి సెట్ లో సానియా జోడి వరుస బ్రేక్ పాయింట్లను సాధించి ఆ గేమ్ ను దక్కించుకోగా, రెండో సెట్ లో మాత్రం స్పెయిన్ జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, ఎక్కవ తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆ సెట్ ను సాధించి మ్యాచ్ విన్నర్ గా అవతరించింది. వీరిద్దరూ జోడి కట్టిన అనంతరం పదిసార్లు ఫైనల్స్ కు చేరగా, ఒక్కసారి మాత్రమే ఓటమి చవిచూశారు. తాజా విజయంతో ఈ ఏడాది సానియా ఖాతాలో పది టైటిల్స్ చేరాయి. అందులో తొమ్మిది టైటిల్స్ ( డబ్యూటీఏ టూర్ ఫైనల్స్, ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది. ఈ టోర్నీలో సానియా-హింగిస్ ల జోడి ఆట సాగిందిలా.. గత సోమవారం జరిగిన డబుల్స్ తొలి మ్యాచ్ సానియా-హింగిస్ జోడీ 6-4, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించి శుభారంభ చేసింది. 75 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించి మొదటి అడ్డంకిని అధిగమించింది. బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించి దాదాపు సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. 76 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్ లో సానియా జోడీకి రెండో సెట్ లో గట్టి పోటీ ఎదురైనా విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 90 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా గట్టి పోటీని ఎదుర్కొని పోరులో నిలబడింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట 6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. గంటా 23 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా జోడి పోరాడి తుది పోరుకు అర్హత సాధించింది. -
మరో టైటిల్ కు అడుగు దూరంలో...
సింగపూర్: వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట 6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది. ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది. నంబర్ వన్ ర్యాంకు పదిలం డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్ ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా.. వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ ఏడాది సానియా ఖాతాలో తొమ్మిదో టైటిల్స్ చేరాయి. అందులో ఎనిమిది టైటిల్స్ (ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది. -
సెమీస్ కు చేరిన సానియా జోడి
సింగపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా మూడో విజయాన్ని సాధించి సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించింది. 90 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో ఈ ఇండో-స్విస్ జోడీకి గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్నా.. రెండో సెట్ లో మాత్రం తీవ్ర పోటీ తప్పలేదు. ఓదశలో సెట్ చేజారిపోతున్నట్లు కనిపించినా.. పోరాడి రెండో సెట్ ను కూడా కైవసం చేసుకుని సెమీస్ కు చేరింది. ఈ తాజా విజయంతో సానియా-హింగిస్ జంట తమ వరుస విజయాలను సంఖ్యను 20 కు పెంచుకుని తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. -
సానియా జంటకు రెండో విజయం
సింగపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ జోడీకి రెండో సెట్లో గట్టి పోటీ లభించింది. రెండో సెట్లో ఒకదశలో సానియా-హింగిస్ 1-4తో వెనుకబడ్డారు. అయితే వెంటనే తేరుకొని వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. శుక్రవారం జరిగే తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో తిమియో బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా-హింగిస్ తలపడతారు. వరుసగా రెండు విజయాలు సాధించిన సానియా జోడీకి సెమీఫైనల్ స్థానం దాదాపు ఖాయమైంది. -
‘అష్ట’ చమక్
చైనా ఓపెన్ విజేత సానియా-హింగిస్ జోడి ఈ సీజన్లో జతగా ఎనిమిదో టైటిల్ రూ. 2.13 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం బీజింగ్: ఏ శుభ సమయాన మార్టినా హింగిస్‌తో జోడీ కుదిరిందోగానీ ఈ ఏడాది సానియా మీర్జా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కలయా, నిజమా అన్నట్టు ఈ హైదరాబాద్ అమ్మాయి తన స్విట్జర్లాండ్ భాగస్వామితో కలిసి ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ సీడింగ్‌కు తగ్గట్టుగా రాణించి విజేతగా అవతరించింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ద్వయం 6-7 (9/11), 6-1, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 3,29,354 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 13 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో సానియా ఖాతాలో ఈ ఏడాది తొమ్మిదో టైటిల్ చేరింది. ఎనిమిది టైటిల్స్ (ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 31వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్కిది 49వ డబుల్స్ టైటిల్. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సానియా జోడీ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. గంటపాటు జరిగిన ఈ సెట్లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ ఆ తర్వాత తమ సర్వీస్‌ను కోల్పోయింది. టైబ్రేక్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు పోరాడినా తుదకు కీలకదశలో తడబడి సెట్‌ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో సానియా-హింగిస్ జంట చెలరేగింది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా-హింగిస్ సమన్వయంతో రాణించి కీలకదశలో పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. కేసీఆర్ అభినందన చైనా ఓపెన్ టైటిల్ సాధించిన సానియా జోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. -
ఫైనల్లో సానియా జోడి
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్ జోడి మరో టైటిల్‌కు చేరువయింది. చైనా ఓపెన్‌లో ఈ జోడి ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో సానియా-హింగిస్ 6-2, 6-3తో చైనా ద్వయం చెన్ లియాంగ్, యఫాన్ వాంగ్‌పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టాప్‌సీడ్ సానియా ద్వయం జోరుకు అన్‌సీడెడ్ ప్రత్యర్థులు ఎదురు నిలువలేకపోయారు. తొలి సెట్లో నాలుగుసార్లు, రెండోసెట్లో ఒక్కసారి ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా జోడి ఈ ఏడాది ఇప్పటికే ఏడు టైటిల్స్ గెలిచింది. చైనా ఓపెన్ ఫైనల్లోనూ గెలిస్తే సానియా-హింగిస్ ద్వయం ఈ ఏడాది ఎనిమిదో టైటిల్ సొంతం చేసుకుంటారు. -
మరో టైటిల్ వేటలో..
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చైనా ఓపెన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడి 6-2, 6-3 తేడాతో చెన్ లియాంగ్-యఫాన్ వాంగ్(చైనా) జోడీపై గెలిచి ఫైనల్ కు చేరింది. వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జోడి మరో టైటిల్ వేటకు సిద్ధమైంది. ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ మరో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో ప్రత్యర్థికి సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా కోల్పోకుండా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. -
మరో టైటిల్ కు రెండు అడుగుల దూరంలో...
బీజింగ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)తో కలిసి చైనా ఓపెన్ డబ్యూటీఏ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడీ 7-6(5), 6-4 తేడాతో జులియా(జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా(చెక్ ) జోడీపై విజయం సాధించి సెమీస్ కు చేరింది. ఒక గంటా 20 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న సానియా జోడీ.. రెండో గేమ్ లో మాత్రం దూకుడును కొనసాగించి ఆ సెట్ ను కైవసం చేసుకుంది. ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ మరో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా ప్రత్యర్థికి కోల్పోని సంగతి తెలిసిందే. -
అదే జోరు... అదే ఫలితం
-
అదే జోరు... అదే ఫలితం
సానియా-హింగిస్ జంటకు ఏడో డబుల్స్ టైటిల్ వుహాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఇండో-స్విస్ ద్వయం రూ. 84 లక్షల 98 వేల ప్రైజ్‌మనీ సొంతం న్యూఢిల్లీ: వేదిక మారినా... ప్రత్యర్థి కొత్త వారైనా... అదే జోరు... అదే సమన్వయం... ఆఖరికి అదే ఫలితం... వెరసి భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా తన స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో శనివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీపై విజయం సాధించింది. గంటా తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడానికి శ్రమించాయి. ఫలితంగా మ్యాచ్ మొత్తంలో ఐదు సర్వీస్ బ్రేక్‌లు నమోదయ్యాయి. సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయిన సానియా-హింగిస్ జంట ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. అయితే కీలకదశలో పాయింట్లు నెగ్గి ఫలితాన్ని శాసించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు లక్షా 30 వేల 300 డాలర్ల (రూ. 84 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో సానియా మొత్తం 10 టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకోగా... ఎనిమిదింటిలో విజేతగా నిలిచింది. హింగిస్‌తో కలిసి ఏడు... బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఒక టైటిల్‌ను ఈ హైదరాబాద్ అమ్మాయి కైవసం చేసుకుంది. ఓవరాల్ కెరీర్లో సానియాకిది 30వ టైటిల్. మరోవైపు హింగిస్కిది 48వ టైటిల్. గత 13 మ్యాచ్‌ల్లో సానియా-హింగిస్ జంట ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఆదివారం ఆరంభమయ్యే చైనా ఓపెన్‌లో సానియా-హింగిస్ జంటకు టాప్ సీడింగ్ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మేమిద్దరం మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. అందుకే వరుస సెట్లలో మ్యాచ్‌లను గెలుస్తున్నాం. కోర్టు లోపల, కోర్టు బయట మేమిద్దం మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. క్లిష్ట సమయాల్లో పరస్పరం విశ్వసిస్తాం. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి. -సానియా మీర్జా -
వుహాన్ ఓపెన్ టైటిల్ సానియా జోడీదే
చైనా: వుహాన్ ఓపెన్ టైటిల్‌ను సానియా జోడీ కైవసం చేసుకుంది. శనివారం చైనాలోని వుహాన్‌లో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా - స్విస్ స్టార్ మార్టినా హింగిస్ జోడీ, ఇరీనా కామెలియా బెగూ - మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ ఏడాది పదో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
ఫైనల్లో సానియా జంట
న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది పదో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలోని వుహాన్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజ యం సాధించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ఇ రీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీతో సానియా-హింగిస్ తలపడతారు. -
సెమీస్ లో సానియా జోడి
వూహాన్:ఈ ఏడాది స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జోడి కట్టిన అనంతరం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వరుస విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల గ్వాంగ్జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టైటిల్ ను గెలిచిన ఈ జోడి.. చైనాలో జరుగుతున్న వూహాన్ ఓపెన్ లో సెమీస్ లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడి 6-2, 6-2 తేడాతో అమెరికా జంట రక్వీల్ కాప్స్-జోన్స్ లను ఓడించి సెమీస్ కు చేరింది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సానియా జోడీ ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు రెండో రౌండ్ లో ఆస్ట్రేలియన్ జంట లౌదియా జాన్స్- ఇగ్నాకిక్ లపై 3-6, 2-6 తేడాతో గెలిచిన సానియా జోడి అదే ఊపును క్వార్టర్స్ లో కూడా కనబరిచింది. -
సానియా-హింగిస్ ‘సిక్సర్’
- ఇండో-స్విస్ జంటకే గ్వాంగ్జూ ఓపెన్ టైటిల్ - ఈ సీజన్లో ఈ జోడీకిది ఆరో ట్రోఫీ గ్వాంగ్జూ (చైనా): ‘సరిలేరు మాకెవ్వరూ’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ జంట ఈ సీజన్లో తమ ఖాతాలో ఆరో టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం ముగిసిన గ్వాంగ్జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో జు షిలిన్-యు జియోడి (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 12,300 డాలర్ల (రూ. 8 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. - 58 నిమిషాలపాటు జరిగిన ఈ టైటిల్ పోరులో సానియా జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినప్పటికీ, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేశారు. - ఓవరాల్‌గా ఈ ఏడాది సానియా మీర్జాకిది ఏడో డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌తో జతగా ఆరోది కావడం విశేషం. ఆదివారం చైనాలో మొదలయ్యే వుహాన్ ఓపెన్‌లోనూ టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగే సానియా-హింగిస్ జంటకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది. - ఈ ఏడాదే హింగిస్‌ను డబుల్స్ భాగస్వామిగా చేసుకున్న సానియా ఆమెతో కలిసి 13 టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. ఇందులో ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్, చార్ల్స్టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ ఓపెన్లలో టైటిల్స్ సాధించింది. - గ్వాంగ్జూ ఓపెన్‌లో టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందిన ఈ ఇండో-స్విస్ ద్వయం టైటిల్ నెగ్గే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోకకపోవడం విశేషం. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ సానియా-హింగిస్ జోడీ ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా విజేతగా నిలిచింది. -
ఆ జంట సూపర్!
గ్వాంగ్జూ: మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో జత కట్టిన అనంతరం భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన టైటిల్ వేటలో ముందుకు దూసుకుపోతోంది. ఈ ఏడాది హింగిస్ తో జత కట్టిన తరువాత మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కూడా చేజిక్కించుకుంది. 2015 వ సంవత్సరాన్ని ఇండియన్ వెల్స్ టైటిల్ తో శుభారంభం చేసిన ఈ జోడి... ఆపై మియామి ఓపెన్ ను, ఫ్యామిలీస్ సర్కిల్స్ టైటిల్స్ ను సాధించింది. అనంతరం వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ తో పాటు, యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ సానియా-హింగిస్ ల జోడి సాధించి సత్తాను చాటుకున్నారు. తాజాగా గ్వాంగ్ జూ డబ్యుటీఏ టైటిల్ ను కూడా సానియా జోడి దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా జోడీపై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకోవడం ద్వారా సానియా జోడి తమ టైటిల్ సంఖ్యను ఆరుకు పెంచుకుంది. ఈ ఏడాది ఏడు డబుల్స్ టైటిల్స్ ను సాధించిన సానియా .. హింగిస్ తో జోడి కట్టిన తరువాత ఆరు టైటిల్ ను సాధించడం గొప్ప విషయమే. గతేడాది డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ తర్వాత కారా బ్లాక్ (జింబాబ్వే)తో విడిపోయిన సానియా... ఈ ఏడాది సు వీ సెయి (చైనీస్ తైపీ)తో కలిసి నాలుగు టోర్నమెంట్లలో ఆడింది. ఖతార్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ జంట మిగతా మూడు టోర్నీల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. దాంతో పరస్పర అవగాహనతో వారి భాగస్వామ్యానికి తెరపడింది. అటు తరువాత హింగిస్ తో జతకట్టిన సానియా వరుస విజయాలను నమోదు చేస్తోంది. అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ఈ జోడి నిజంగా సూపర్ కదూ.. -
మరోసారి మెరిసిన సానియా
గ్వాంగ్జూ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ ల జోడి మరో టైటిల్ ను సాధించింది. గ్వాంగ్ జూ డబ్యుటీఏ ఫైనల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో సానియా -హింగిస్ ల జంట 6-3, 6-1 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు షిలిన్ యూ- జూ యూ(చైనా)పై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో సానియా జంట 58 నిమిషాల్లోనే తుదిపోరును ముగించి మరోసారి తమ సత్తాను చాటుకున్నారు. తాజా టైటిల్ తో ఈ సంవత్సరం సానియా ఏడు టైటిల్స్ ను సాధించింది. అందులో ఆరు మార్టినా హింగిస్‌తో ఉండగా, మరొకటి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సాధించింది. -
ఫైనల్లో సానియా జంట
గ్వాంగ్జూ : ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా మరో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా గ్వాంగ్జూ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో జూలియా గ్లుష్కో (ఇజ్రాయెల్)-రెబెకా పీటర్సన్ (స్వీడన్) జంటపై గెలిచింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం సానియా ఇప్పటికే ఆరు టైటిల్స్ సాధించింది. అందులో ఐదు మార్టినా హింగిస్‌తో ఉండగా, మరొకటి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సాధించింది. -
ఫైనల్లో సానియా జోడి
గ్వాంగ్జౌ: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను గెలిచి ఊపులో ఉన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ ల జోడీ అదే ఆటతీరును గ్వాంగ్జౌ ఓపెన్ లో కూడా కొనసాగిస్తోంది. మహిళల డబుల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడీ 6-3, 6-4 తేడాతో గ్లుష్కో, రెబెకా పీటర్సన్ల జోడీపై విజయం సాధించి ఫైనల్ కు చేరింది. తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న సానియా జోడీ.. రెండో సెట్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే ఎటువంటి తప్పిదాలు అవకాశం ఇవ్వని సానియా జోడి రెండో సెట్ ను కూడా గెలుచుకుని ఫైనల్ పోరుకు సిద్ధమైంది. కేవలం గంటా 12 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించిన సానియా -హింగిస్ లు తమ సత్తాను మరోమారు చాటుకున్నారు. అంతకుముందు గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనా-లెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై నెగ్గిన సానియా జోడీ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. -
సెమీస్‌లో సానియా జోడి
గ్వాంగ్జౌ: సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 6-2, 6-3తో అనా-లెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై సానియా జోడి వరుస సెట్లలో నెగ్గింది. యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఊపులో ఉన్న సానియా, హింగిస్ నేడు (శుక్రవారం) జరిగే సెమీస్‌లో జూలియా గ్లుష్కో, రెబెకా పీటర్సన్‌లతో ఆడతారు. -
ఒకే ఫార్మాట్లో ఆడటం కష్టం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముంబై : టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఆడడం శారీరకంగా అనుకూలంగానే ఉన్నా మానసికం గా చాలా కష్టంగా ఉంటుందని సానియా మీర్జా అభిప్రాయపడింది. ఆదివారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో సానియాకు గౌరవ జీవితకాల సభ్యత్వం ఇచ్చారు. ‘నేను ప్రస్తుతం ఒక ఫార్మాట్లోనే ఆడుతున్నాను. ఇది నా శరీరానికి సులువుగా ఉంది. కానీ మానసికపరంగా చాలా కష్టపడుతున్నాను. ఏడాదిలో 25 వారాలపాటు ఆట గురించే ఆలోచించడం సులువు కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం 60 మ్యాచ్‌లు ఆడాను. మార్టినా హింగిస్‌తో కలిసే 50దాకా ఆడాను. ఒకరి శక్తిసామర్థ్యాలపై మరొకరికి నమ్మకముంది. నేను ప్రపంచ నంబర్‌వన్‌గా ఉంటే తను రెండో ర్యాంకులో ఉంది. అయితే ఎవరైనా అన్ని టోర్నీలూ గెలువలేరు’ అని సానియా తెలిపింది. సింగిల్స్‌లో ఎనిమిదేళ్లు ఆడానని, గాయాల కారణంగా ఆ విభాగానికి దూరమైనా అంతకన్నా గొప్ప కెరీర్ దొరికిందని పేర్కొంది. మరోవైపు డేవిస్‌కప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం నిరాశపరిచిందని తెలిపింది. డబుల్స్‌లో పేస్, బోపన్న ఓటమి ఫలితాన్ని దెబ్బతీసిందని చెప్పింది. -
సానియా... మళ్లీ సాధించెన్
♦ హింగిస్‌తో కలిసి యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ వశం ♦ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం న్యూయార్క్ : ఈ ఏడాది అద్వితీయ ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో మరో గొప్ప విజయం సాధించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత జులైలో హింగిస్‌తోనే కలిసి సానియా వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. ఈ టోర్నీలో ఈ ఇండో-స్విస్ జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సానియా-హింగిస్‌లకు 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది. రన్నరప్ డెలాక్వా-ష్వెదోవా జోడీకి 2 లక్షల 75 వేల డాలర్లు (రూ. కోటీ 82 లక్షలు) దక్కాయి. ► 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంట సమన్వయంతో ఆడింది. తొలి సెట్లో రెండుసార్లు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో సానియా తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ఈ ద్వయం 31 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ సానియా జోడీ తమ జోరు కొనసాగించింది. మూడుసార్లు తమ ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ► ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది ఐదో డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. మహిళల డబుల్స్‌లో మార్టి నా హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఆమె వింబుల్డన్ టైటిల్ నెగ్గగా... మిక్స్డ్ డబుల్స్‌లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009, 2012)... బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా 2014 యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది. ► మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్లో ఇది 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో సింగిల్స్‌లో ఐదు, మహిళల డబుల్స్‌లో 11, మిక్స్డ్ డబుల్స్‌లో నాలుగు ఉన్నాయి. గతేడాది యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)తో రన్నరప్‌గా నిలిచిన హింగిస్.. ఈ ఏడాది సానియాతో కలిసి ట్రోఫీని నెగ్గడం విశేషం. హింగిస్‌కు 2015లో భారత భాగస్వాములతో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ కావడం గమనార్హం. ► ఈ టోర్నీలో బరిలోకి దిగకముందే ష్వెదోవా సెప్టెంబరు 11ను తన వివాహ తేదీగా ఖరారు చేసుకుంది. అయితే అనూహ్యంగా ఆమె ఫైనల్‌కు చేరుకోవడంతో వివాహాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం. ‘ఈ ఏడాది అన్నీ కలిసొచ్చాయి. ప్రపంచ నంబర్‌వన్ అయ్యాను. వింబుల్డన్ టైటిల్ కూడా గెలిచాం. ఇప్పుడు యూఎస్ ఓపెన్ సాధించాం. గతేడాది ఇదే వేదికపై మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచా. ఫైనల్‌కు ముందు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. సహజసిద్ధమైన ఆటను ఆడాం. హింగిస్ మంచి ప్రోత్సాహమిచ్చింది. ఆర్థర్ యాష్ స్టేడియంలో అభిమానుల మద్దతు బాగుంది. ఎక్కడికి వెళ్లినా భారతీయులు మంచి అభిమానాన్ని చూపుతారు. ఇక్కడ కూడా అలాంటి మద్దతే ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.’ -సానియా మీర్జా -
యూఎస్ ఓపెన్: ఉమెన్ డబుల్స్ ఫైనల్లో సానియా జోడీ విజయం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా-మార్టినా హింగీస్ జోడీ విజయం సాధించింది. 6-3, 6-3 తేడాతో డెలాక్వా- ష్వెదోవాను హింగీస్ సానియా జోడీ చిత్తు చేసింది. దాంతో యూఎస్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ టైటిల్ ను సానియా జోడీ కైవసం చేసుకుంది. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ ను సానియా జోడీ సాధించింది. -
మిక్స్డ్ డబుల్స్ లో లియాండర్ ,మార్టినా విజయం
-
చరిత్ర సృష్టించిన లియాండర్ పేస్
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్, స్విట్జర్లాండ్ భామ మార్టినా హింగిస్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. ఒకే ఏడాది మూడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గి, పేస్-హింగిస్ జోడీ చరిత్ర సృష్టించింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామున జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో పేస్-హింగిస్ ద్వయం 6-4, 3-6, 10-7 తేడాతో అమెరికా జోడీ సామ్ కెర్రీ - బెథానీ మాటెక్ లపై విజయం సాధించింది. ఈ ఏడాది వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు కూడా కైవసం చేసుకున్న విషయం విదితమే. తాజా విజయంతో 1969 తర్వాత ఓ క్యాలెండర్ ఏడాదిలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 3 గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన జంటగా పేస్-హింగిస్లు చరిత్ర సృష్టించారు. పేస్‌కు ఇది 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, స్విస్ స్టార్ మార్టినా హింగిస్ తన ఖాతాలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. హింగిస్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించగా, అవన్నీ భారతీయ భాగస్వాములతోనే నెగ్గడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పేస్‌కు ఇది 9వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, అత్యధికంగా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఖాతాలో 10 టైటిల్స్ ఉన్నాయి. మరో టైటిల్ సాధిస్తే ఈ విభాగంలోనూ పేస్ తన రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. -
ఇటు సానియా... అటు పేస్
మార్టినా హింగిస్ జతగా మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్స్ న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్లు ‘డబుల్ ధమాకా’ సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశారు. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా... మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత జులైలో హింగిస్‌తో కలిసి సానియా, పేస్లు వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఇంకో రెండు విజయాలు సాధిస్తే హింగిస్ తన ఖాతా లో మరో రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలను జమ చేసుకోనుంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-1తో సారా ఎరాని-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై గెలిచింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి సెట్లో సానియా జంటకు కాస్త పోటీ ఎదురైనా, రెండో సెట్ మాత్రం ఏకపక్షంగా సాగింది. కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్); అనా లెనా గ్రోయెనిఫెల్డ్ (జర్మనీ)-కోకో వాండెవెగె (అమెరికా)ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సానియా-హింగిస్ జంట తలపడుతుంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-2, 7-5తో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో పేస్ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్లో రెండుసార్లు, రెండో సెట్లో రెండుసార్లు బోపన్న జోడీ సర్వీస్‌లను బ్రేక్ చేసిన పేస్ జంట తమ సర్వీస్‌ను ఒక్కసారి కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గం. 9.30 మొదలయ్యే ఫైనల్లో అన్‌సీడెడ్ జోడీ సామ్ క్వెరీ-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో పేస్-హింగిస్ జంట అమీతుమీ తేల్చుకుంటుంది. -
యూఎస్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో పేస్ జోడీ
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి లియాండర్ పేస్- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 4వ సీడ్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-5 తేడాతో 2వ సీడ్ జోడీ రోహన్ బోపన్న(భారత్) - యంగ్ జాన్ చన్ లపై విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ మిక్స్డ్ డబుల్స్ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో ఏ మాత్రం పోటీ ఇవ్వని బోపన్న-యంగ్ ద్వయం రెండో సెట్లో అద్భత పోరాట పటిమను ప్రదర్శించింది. కానీ, వెటరన్ ఆటగాడు పేస్, స్విస్ స్టార్ హింగిస్ జోడీ అనుభవం ముందు బోపన్న జంట తలవంచక తప్పలేదు. మహిళల డబుల్స్ విభాగంలోనూ మార్టినా హింగిస్ భారత స్టార్ క్రీడాకారిణి సానియా మిర్జాతో కలిసి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం విదితమే. -
యూఎస్ ఓపెన్ ఫైనల్లో సానియా జోడీ
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి సానియా మిర్జా- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సానియా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-4, 6-1 తేడాతో ఇటలీకి చెందిన 11వ సీడ్ జోడీ సారా ఎరాని - పెనెట్టాపై విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో కాస్తంతా పోరాటం చేసిన ఎరానా - పెనెట్టా జోడీ రెండో సెట్లో పూర్తిగా చతికిలబడింది. -
యూఎస్ ఓపెన్ పైనల్లో ప్రవేశించిన సానియా
-
యూఎస్ ఓపెన్ సెమీస్ లో సానియా-హింగిస్
న్యూయార్క్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. మార్టినా హింగిస్ తో కలసి ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో తైపీకి యంగ్ జాన్ చాన్-చింగ్ చాన్ జోడిపై 7-6(5) 6-1 తేడాతో ఓడించారు. 85 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా-హింగిస్ నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించారు. సెమీఫైనల్లో ఇటాలీకి చెందిన సారా ఎరానీ- ఫ్లవియా పెనెట్టా జోడితో వీరిద్దరూ తలపడతారు. -
రెండో రౌండ్లో సానియా జంట
మహిళల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 6-1, 6-2తో కైట్లిన్ క్రిస్టియన్-సబ్రీనా సంతమరియా (అమెరికా) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్) ద్వయం 5-7, 6-4, 3-6తో స్టీవ్ జాన్సన్-స్యామ్ క్వెరీ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో ఓడిన సానియా జంట
టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఈ జోడీ 3-6, 2-6 తేడాతో కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్), కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన సానియా జంట తమ సర్వీస్‌ను ఐదు సార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. సెమీస్‌లో నిష్ర్కమించిన సానియా జోడికి 350 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 32,520 డాలర్లు (రూ. 21 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సెమీస్‌లో సానియా జంట
టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా జోడీ 6-4, 6-2తో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఈ ఇండో-స్విస్ జంట నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా-కాటరీనా స్రెబోత్నిక్లతో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
టొరంటో: రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-2తో జూలియా జార్జెస్ (జర్మనీ)-క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలండ్) జంటపై గెలిచింది. -
అటు నేనే... ఇటు నేనే..!
మార్టినా హింగిస్ టెన్నిస్‌కు, భారత అభిమానులకు కూడా కొత్తేం కాదు. ఒకప్పుడు సింగిల్స్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ స్విస్ తార అందరికీ సుపరిచితమే. అయితే ఈసారి వింబుల్డన్‌లో భారత్‌కు లభించిన రెండు టైటిల్స్‌లోనూ తన పాత్ర ఉంది. సానియాతో జతగా డబుల్స్, పేస్ జోడీగా మిక్స్డ్ డబుల్స్ నెగ్గింది. మనోళ్లతో హింగిస్‌కు ఎలా జోడీ కుదిరింది. ఒకప్పుడు ప్రపంచ సింగిల్స్ నంబర్‌వన్ ఇప్పుడు డబుల్స్ మాత్రమే ఎందుకు ఆడుతోంది? వింబుల్డన్‌లో భారత్ గర్వించదగ్గ రెండు విజయాల్లోనూ స్విట్జర్లాండ్ స్టార్ హింగిస్ పాత్ర ఉంది. భారత క్రీడాకారులతో జతకట్టి రెండు టైటిల్స్ సాధించిన హింగిస్.. తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. అమెరికాలో టీమ్ టెన్నిస్ పోటీల సందర్భంగా పేస్, హింగిస్ల జోడీ కుదిరింది. పేస్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని చెప్పిన ఈ స్విస్ స్టార్... ఈ ఏడాది రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ రెండింటిలోనూ పేస్‌తో కలిసి కప్‌ను ముద్దాడింది. ఇక సానియా గత ఏడాది వరకు కారా బ్లాక్‌తో కలిసి డబుల్స్ ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో కొత్త భాగస్వామిని ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇదే సమయంలో హింగిస్ కూడా తగిన డబుల్స్ భాగస్వామి లేక ఇబ్బంది పడుతోంది. గత ఏడాది ఐపీటీఎల్ సందర్భంగా ఏర్పడిన సాన్నిహిత్యంతో ఈ ఇద్దరి కామన్ స్నేహితుడు ఒకరు కలిసి ఆడమని సూచించారు. దీంతో ఈ ఇద్దరూ మార్చిలో జతకట్టారు. అప్పటి నుంచి ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. హింగిస్ కెరీర్ ఆసక్తికరం అవిభాజ్య చెకోస్లొవేకియాలో 1980, సెప్టెంబరు 30న జన్మించిన హింగిస్ ఏడేళ్ల వయసులో స్విట్జర్లాండ్‌కు వలస వెళ్లింది. తల్లి మెలానీ శిక్షణలో రాటుదేలి 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారింది. ఏడాదిన్నర తిరిగేలోపు ‘గ్రాండ్‌స్లామ్ చాంపియన్’గా అవతరించింది. 1996లో 15 ఏళ్ల 9 నెలల వయసులో హెలెనా సుకోవాతో కలిసి వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన హింగిస్... 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకొని పెను సంచలనం సృష్టించింది. 1998లో ఒకే సీజన్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో డబుల్స్ టైటిల్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో పిన్న వయస్సులో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 2001లో తన కోచ్‌గా ఉన్న తల్లి మెలానీతో విడిపోవడం... కుడి చీలమండ గాయం కారణంగా హింగిస్ ఆటతీరు లయ తప్పింది. అదే ఏడాది కాప్రియాటికి నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన హింగిస్, 2003లో ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెండేళ్ల తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హింగిస్ మళ్లీ రాకెట్ పట్టింది. అయితే ఆమెలో మునుపటి జోరు కనిపించలేదు. నాలుగేళ్లపాటు ఆడిన ఆమె ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ మాత్రం చేరలేదు. 2007లో డోపింగ్‌లో పట్టుబడిన హింగిస్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత ఇన్విటేషన్, లెజెండ్స్లాంటి విభాగాలలో సరదాగా టెన్నిస్ ఆడిన హింగిస్ 2013లో మళ్లీ కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. అయితే ఈసారి సింగిల్స్‌ను వదులుకొని డబుల్స్‌కే పరిమితమైంది. పలువురు క్రీడాకారిణులతో జతకట్టిన హింగిస్ గొప్ప విజయాన్ని రుచి చూడలేకపోయింది. అయితే 2015లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో భాగస్వామ్యం హింగిస్ కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. మూడు పదుల వయసు దాటినా అపార అనుభవానికి నైపుణ్యం జతకలవడంతో హింగిస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, పదునైన రిటర్న్‌లు చేయడంలో తిరుగులేని హింగిస్‌కు ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా రూపంలో మరో మంచి భాగస్వామి లభించింది. సానియా సర్వీస్‌లో నిలకడ, శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద హింగిస్ అప్రమత్తతతో ఈ జోడీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు 34 ఏళ్ల హింగిస్ లక్ష్యం వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం. -
పేస్ జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
-
పేస్ జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
లండన్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో 16వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్లో ‘మిక్స్డ్’ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట 6-1, 6-1తో పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా పేస్ కెరీర్లో ఇది నాలుగో వింబుల్డన్ మిక్స్డ్ టైటిల్. -
నా కల సాకారం
లండన్ : భారతదేశం గర్వించదగ్గ మరో ఘనత... దేశంలో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచేలా మరో గొప్ప టైటిల్... సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... రెండేళ్లుగా అసమాన ఆటతీరుతో చెలరేగుతున్న భారత టెన్నిస్ స్టార్ తాజాగా వింబుల్డన్‌లో మిహ ళల డబుల్స్ టైటిల్‌తో మరో ఘనతను సొంతం చేసుకుంది. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్‌లలోనూ ఏదో ఒక విభాగంలో టైటిల్ సాధించి కెరీర్ స్లామ్‌ను పూర్తి చేసుకుంది. మార్టినా హింగిస్‌తో కలిసి ఫైనల్లో 5-7, 7-6 (7/4), 7-5తో రష్యా జోడి వెస్నినా, మకరోవాపై గెలిచింది. విజయం తర్వాత సానియా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... వింబుల్డన్ విజయం: చాంపియన్‌గా నిద్రలేవడం అనేది గొప్ప అనుభూతి. దీనిని వర్ణించడానికి మాటలు సరిపోవు. వింబుల్డన్ టైటిల్‌కు విలువ కట్టలేం. ఇది సాధించాలనేది నా కల. నా కెరీర్లో ఈ ఘనత సాధించడం, 4 గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం నా అదృష్టం. అద్భుతమైన ఫైనల్: ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఎంత బాగా జరగాలో అలా జరిగింది. నలుగురం కూడా సర్వశక్తులూ ఒడ్డి పోరాడాం. మా ప్రత్యర్థులు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా వాళ్ల సర్వీస్ చాలా బాగుంది. ఒక బ్రేక్ దొరికితే మరింత దూకుడుగా ఆడాలనేది మా వ్యూహం. దానిని అమలు చేసి ఫలితం సాధించాం. హార్డ్కోర్ట్ సీజన్‌పై గురి : త్వరలో హార్డ్కోర్ట్ సీజన్ ప్రారంభం కానుంది. దీనికోసం మరింత కష్టపడతాను. వింబుల్డన్‌లో సర్వీస్‌కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. హార్డ్కోర్టులలో మా శైలి ఆట ద్వారా ఫలితాలు ఎక్కువగా వస్తాయి. రాబోయే సీజన్లో మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నాను. స్ఫూర్తి పెరిగితే సంతోషం : నా విజయం మరికొంతమంది భారతీయ మహిళల్లో స్ఫూర్తిని పెంచొచ్చు. నేను ఆడేది గెలవడం కోసం. ఆ గెలుపు ద్వారా మరింత మంది అమ్మాయిలు స్ఫూర్తి తెచ్చుకుని గెలిస్తే మరీ సంతోషం. ఆందోళన చెందలేదు: ఫైనల్లో వెనకబడ్డ సమయంలో ఆందోళన చెందలేదు. కెరీర్లో ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం. ఇలాంటి వాటి మీద ఏళ్ల తరబడి కష్టపడ్డాం. కాబట్టి నియంత్రణతోనే ఆడాం. తప్పులు చేయకుండా ఆడాం: ఎట్టి పరిస్థితుల్లోనూ మన తప్పుల వల్ల మ్యాచ్ పోగూడదు. వాళ్లు గెలవాలంటే మనకంటే మెరుగ్గా ఆడాలి. అంటే మేం ప్రతి బంతినీ కోర్టులో సరైన ప్రదేశంలోకి పంపాలి. ఇదే వ్యూహంతో ఆడితే ఏదో ఒక సమయంలో ప్రత్యర్థులు తప్పు చేస్తారు. చివరికి అదే జరిగింది. అభినందనల వెల్లువ సానియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సహా అనేకమంది ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు. ‘సానియా సాధించిన విజయం దేశంలో మహిళలకు ప్రేరణ ఇస్తుంది. నీతోపాటు దేశమంతా నీ విజయానికి సంబరం జరుపుకుంటోంది’ అని ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు. ‘సానియా, హింగిస్ అద్భుతంగా ఆడారు. వింబుల్డన్‌లో మరపురాని విజయాన్ని నమోదు చేసి మమ్మల్ని గర్వపడేలా చేశారు’ అని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర మంత్రులు సోనోవాల్, అరుణ్ జైట్లీ కూడా ఇదే రీతిన తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సానియా మీర్జా సాధించిన విజయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. ‘అంతర్జాతీయ టోర్నమెంట్స్ గెలుస్తూ హైదరాబాదీ అమ్మాయిలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సానియాకు నా అభినందనలు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సానియాను అభినందించారు. సంబరాలు లేవు : సానియా మీర్జాకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు అనేక మంది ప్రముఖులు ఫైనల్‌కు వెళ్లారు. బాలీవుడ్ హీరో, డెరైక్టర్ ఫర్హాన్ అక్తర్, పాకిస్తాన్ క్రికెటర్ అజహర్ మహమూద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ తదితరులు ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్ చూశారు. అయితే మ్యాచ్ అయిపోయేసరికి రాత్రి 10 గంటలు దాటిపోవడంతో సానియా-హింగిస్ సంబరాలేమీ చేసుకోకుండా హోటల్‌కు వెళ్లారు. -
వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి
వింబుల్డన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్్ లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో 6-1, 6-1తేడాతో పేస్-హింగీస్ జోడి ఆస్ట్రేలియన్ హంగారీయన్, అలెగ్జాండర్ పేయా జోడిపై గెలుపొందింది. దాంతో వింబుల్డన్ లియాండర్‌కు ఇది మూడవ టైటిల్ ను కైవసం చేసుకుంది. లియాండర్ తన కెరియర్లో 16వ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకుంది. -
రెండో రౌండ్ లోకి సానియా జోడి
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ పోరులో సానియా జోడీ 6-2, 6-2 తేడాతో దియాస్-హెంగ్ ద్వయంపై విజయం సాధించి రెండో రౌండ్ లోకి ప్రవేశించారు. గంటా తొమ్మిది నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సానియా -హింగిస్ లు తమ పదునైన షాట్లతో అలరించి జయకేతనం ఎగురవేశారు. దీంతో తన తదుపరి మ్యాచ్ లో కిమికో డేట్ -ఫ్రాన్సెస్కాలతో పోరుకు సన్నద్ధమైయ్యారు. -
సానియా జంటకు షాక్
ఈస్ట్‌బోర్న్ (లండన్) : ఎగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా జోడి 5-7, 4-6తో గార్సియా (ఫ్రాన్స్)- స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడింది. సానియా జోడీకి 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చినా మూడు మాత్రమే సాధించింది. -
తొలి రౌండ్లో సానియా జంట ఓటమి
బర్మింగ్‌హామ్: కొత్త భాగస్వామితో బరిలోకి దిగిన సానియా మీర్జాకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. మార్టినా హింగిస్ అందుబాటులో లేని కారణంగా డబ్ల్యుటీఏ ఏగాన్ క్లాసిక్ టోర్నీలో కేసీ డెల్లాక్వా (ఆసీస్)తో ఆడిన సానియా 4-6, 2-6 తేడాతో జీ జెంగ్, యంగ్-జాన్ చాన్ (చైనా) జంట చేతిలో వరుస సెట్లలో ఓడింది. టాప్ సీడ్ సానియా జంట తమకు లభించిన నాలుగు బ్రేక్ పాయింట్ అవకాశాలను వినియోగించుకోలేక తగిన మూల్యం చెల్లించుకుంది. అలాగే తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. తర్వాతి టోర్నీలు ఈస్ట్‌బర్న్, వింబుల్డన్‌లలో మాత్రం ఎప్పటిలాగే సానియా, హింగిస్ జంటగా ఆడతారు. -
సానియా జంటకు చుక్కెదురు
మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) పోరాటం ముగిసింది. టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 5-7, 2-6తో బెథానీ మాటెక్ (అమెరికా)-సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. నేటి మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ ఇవనోవిచ్ (7) ఁ సఫరోవా (13) సెరెనా (1) ఁ బాసిన్‌స్కీ (23) నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్ సాయంత్రం గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జంట
మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-4తో కరిన్ నాప్-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడీపై గెలిచింది. సరిగ్గా గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. పేస్ జంటకు ఓటమి పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా); రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటలకు మూడో రౌండ్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆరో సీడ్ ఫాబియో ఫాగ్నిని-సిమోన్ బోలెలి (ఇటలీ) ద్వయం 6-2, 6-4తో పేస్-నెస్టర్ జంటపై, ఐదో సీడ్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) ద్వయం 6-3, 6-7 (7/9), 6-3తో బోపన్న-మెర్జియా జోడీపై గెలిచాయి. ప్రాంజలకు నిరాశ జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్లో ప్రాంజల 6-7 (1/7), 4-6తో ప్రిస్కిల్లా హాన్ (ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడంతో పాటు కీలకదశలో తడబాటుకులోనైన ప్రాంజలకు పరాజయం తప్పలేదు. -
రన్నరప్ సానియా జంట
న్యూఢిల్లీ : రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట రన్నరప్‌గా నిలిచింది. రోమ్‌లో ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 4-6, 3-6తో మూడో సీడ్ తిమి బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరుకునే క్రమంలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని సానియా జంట తుదిపోరులో మాత్రం వరుస సెట్లలో ఓడింది. 72 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జోడీ తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా-హింగిస్‌లకు 57,840 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 42 లక్షలు)తోపాటు 585 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జతగా ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంటకు ఫైనల్లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. తొలి మూడు టోర్నమెంట్లలో (ఇండియన్ వెల్స్, మియామి, ఫ్యామిలీ సర్కిల్ కప్) విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం పోర్షె గ్రాండ్‌ప్రిలో రెండో రౌండ్లో, మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. -
ఫైనల్లో సానియా జంట
న్యూఢిల్లీ : గత రెండు టోర్నీల్లో విఫలమయ్యాక... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జతగా ఈ ఇద్దరూ నాలుగో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన సానియా-హింగిస్ జంట శనివారం జరిగిన సెమీఫైనల్లో 6-2, 7-6 (7/5)తో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్)-కాటరినా స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంటకు రెండో సెట్లో గట్టిపోటీ లభించినా కీలకమైన టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హింగిస్‌తో కలిసి ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్టన్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా... స్టట్గార్ట్ ఓపెన్‌లో రెండో రౌండ్లో... మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
సెమీస్‌లో సానియా జోడి
రోమ్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో సానియా జోడి 6-4, 6-3తో జులియా జార్జెస్ - సిల్వ సోలెర్ జంటపై గెలిచింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టాప్‌సీడ్ సానియా జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్) - ఫ్లోరిన్ (రుమేనియా) జోడి క్వార్టర్స్‌లో 2-6, 7-5, 8-10తో జీన్ రోజెర్ (నెదర్లాండ్స్)-హోరియా (రుమేనియా) జోడి చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
న్యూఢిల్లీ : రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-1తో ఇరీనా కామెలియా బేగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జంటను ఓడించింది. తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన ఈ ఇండో-స్విస్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-3, 6-4తో లియోనార్డో మాయెర్-యువాన్ మొనాకో (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో జానెట్టి హుసరోవా (స్లొవేకియా)-రలూకా ఒలారు (రుమేనియా) ద్వయంపై గెలిచింది. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-మెర్జియా 5-7, 7-6 (7/5), 10-6తో మారిన్ ద్రగాంజ (క్రొయేషియా)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 5-7, 3-6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
14 వరుస విజయాల తర్వాత ఓటమి
స్టట్ గార్ట్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు షాక్ తగిలింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు దక్కించున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లో సానియా పరాజయం పాలైంది. సానియా- మార్టినా హింగ్ జోడి జైత్రయాత్రకు బ్రేక్ పడింది. పోర్షె టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ తొలి రౌండ్ లోనే ఈ జంట ఓడింది. పెట్రా మార్టిక్(క్రొయేషియా), స్టెపానీ ఓగ్ట్(లీచెటెన్ స్టీన్) చేతిలో 3-6 3-6 తేడాతో సానియా-హింగిస్ జోడి పరాజయం పాలైంది. 14 విజయాల తర్వాత సానియా-హింగిస్ జంటకు ఎదురైన తొలి ఓటమి ఇది. వరుసగా ఇండియన్ వెల్స్, మియామి, చార్లెస్టన్ టోర్నమెంట్లలో డబుల్స్ టైటిల్స్ గెలిచిన ఈ విక్టరీ పెయిర్.. పోర్షె టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ లో తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది. -
మహిళల డబుల్స్‌లో నెంబర్ 1 సానియా
చార్లెస్టన్ (యూఎస్ఏ): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్ మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో సానియా మీర్జా - మార్టినా హింగిస్ జో్డీ విజయం సాధించింది. దీంతో మహిళల డబుల్స్‌లో సానియా ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. భారత్‌లో ఈ స్థాయికి చేరిన మొదటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా. మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో డెల్లాక్వా - జురాక్ జోడీపై సానియా-హింగిస్లు 6-0, 6-4 స్కోర్‌తో గెలుపొందారు. ఈ సీజన్లో సానియా గెలుచుకున్న మూడవ టైటిల్ ఇది. -
వారెవ్వా... సానియా
♦ హింగిస్‌తో కలిసి మియామి ఓపెన్ టైటిల్ కైవసం ♦ రూ. కోటీ 83 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఫ్లోరిడా (అమెరికా) : కొత్త భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సమన్వయం అద్భుత ఫలితాలను ఇస్తోంది. రెండు వారాల క్రితం జతగా బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం మియామి ఓపెన్‌లోనూ మెరిసింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లోని ప్రీమియర్ టోర్నీల్లో ఒకటైన మియామి ఓపెన్‌లో సానియా-హింగిస్ జంట చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 7-5, 6-1తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 2,95,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 83 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 25వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కు 43వ డబుల్స్ టైటిల్. సింగిల్స్ విభాగంలోనూ హింగిస్ ఖాతాలో 43 టైటిల్స్ ఉండటం విశేషం. 66 నిమిషాలపాటు జరిగిన మియామి ఫైనల్లో సానియా జంటకు తొలి సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకదశలో ఈ ఇండో-స్విస్ జోడీ 2-5తో వెనుకబడింది. అయితే కోర్టులో అద్భుత సమన్వయంతో కదులుతూ, అందివచ్చిన బ్రేక్ పాయింట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సానియా-హింగిస్ జంట వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గి తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. తొలి సెట్‌ను గెల్చుకునే దశ నుంచి కోల్పోయిన మకరోవా-వెస్నినా జంట రెండో సెట్లో డీలా పడింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ఇక తేరుకోలేకపోయింది. ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో మాదిరిగానే ఈ టోర్నీలోనూ సానియా-హింగిస్ జంట తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గడం విశేషం. నేను రెండు విషయాల గురించి చాలా కాలంగా కలగంటున్నాను. మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ నెగ్గడం, ప్రపంచ నంబర్‌వన్ కావడం. ఇప్పుడు నంబర్‌వన్‌కు చాలా దగ్గరలో ఉన్నాను. ఈ సమయంలో దాని గురించి పట్టించుకోననే మాట నేను చెప్పను. ఎందుకంటే నేనూ సాధారణ మానవమాత్రురాలినే. ప్రతీ మ్యాచ్‌లో టాప్ ర్యాంక్ గురించి ఆలోచిస్తున్నాను. త్వరలో దక్కుతుందని ఆశిస్తున్నాను కూడా. గత రెండేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నా. అదే కొనసాగిస్తా. ఈ సీజన్ మొత్తం హింగిస్‌తో కలిసి ఆడాలని నిర్ణయించుకున్నాను. -సానియా వరుసగా రెండు ప్రీమియర్ టైటిల్స్ సాధించడంతో... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు మరింత చేరువైంది. సోమవారం అమెరికాలోని చార్ల్స్టన్లో మొదలైన ‘ఫ్యామిలీ సర్కిల్ కప్’లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా జంట ఈ టోర్నీలోనూ విజేతగా నిలిస్తే... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సానియా సొంతమవుతుంది. ప్రస్తుతం సారా ఎరాని, రొబెర్టా విన్సీ ఇద్దరూ 7640 పాయింట్లతో సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. సానియా మూడో ర్యాంక్‌లో (7495 పాయింట్లతో) ఉంది. -
సానియా ఖాతాలో మరో టైటిల్
మియామి : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో మైలు రాయిని అధిగమించింది. మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో నెగ్గి 25వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), టాప్‌సీడ్ సానియా జోడి మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ ఫైనల్లో రష్యాకు చెందిన సెకండ్ సీడెడ్ ఎకరీనా మకరోవా, ఎలీనా వెస్నినా జోడితో తలపడ్డారు. ప్రారంభంలో వెనుకంజ వేసినప్పటికీ , తరువాత పుంజుకుని 7-5, 6-1తో పాయింట్లతో విజయం సాధించింది సానియా జోడీ. రెండు వారాల క్రితం బీఎన్పీ పరిబాస్ ఓపెన్ ఫైనల్లోనూ మకరోవా-వెస్నినాపై గెలిచిన సానియా జోడీ టైటిల్ సాధించడం విశేషం. -
ఫైనల్లో సానియా జోడి
మియామి : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో టైటిల్‌కు చేరువయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), సానియా జోడి మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం) జరిగిన సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా జోడి 6-2, 6-4తో టిమియా బాబోస్, క్రిస్టినా మాలెనోవిచ్‌పై నెగ్గారు. ఫైనల్లో వీరు మకరోవా, వెస్నినా జోడితో తలపడతారు. రెండు వారాల క్రితం బీఎన్పీ పరిబాస్ ఓపెన్ ఫైనల్లోనూ మకరోవా-వెస్నినాపై గెలిచిన సానియా జోడీ టైటిల్ సాధించడం విశేషం. -
ఫైనల్లో సానియా-హింగిస్ జంట
ఇండియన్ వెల్స్ ఓపెన్ కాలిఫోర్నియా: కలిసి ఆడుతున్న తొలి టోర్నమెంట్‌లోనే సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సానియా-హింగిస్ ద్వయం తమ జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-0, 6-4తో లీసా రేమండ్ (అమెరికా)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీని ఓడించింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఫైనల్లో రెండో సీడ్ మకరోవా-వెస్నినా (రష్యా)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
సెమీస్‌లో సానియా జంట
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-4, 6-2తో డానియెలా హంతుచోవా (స్లొవేకియా)-కరీన్ నాప్ (ఇటలీ) జోడీపై గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసినప్పటికీ తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీస్‌లో లీసా రేమండ్ (అమెరికా)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
డబుల్స్‌లో సానియా కొత్త భాగస్వామి హింగిస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ విభాగంలో కొత్త భాగస్వామిని ఎంచుకుంది. సీజన్‌లోని తదుపరి టోర్నమెంట్లలో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా బరిలోకి దిగనుంది. గతేడాది డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ తర్వాత కారా బ్లాక్ (జింబాబ్వే)తో విడిపోయిన సానియా... ఈ ఏడాది సు వీ సెయి (చైనీస్ తైపీ)తో కలిసి నాలుగు టోర్నమెంట్లలో ఆడింది. ఖతార్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ జంట మిగతా మూడు టోర్నీల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ‘సు వీ సెయితో నాలుగు టోర్నీలు ఆడాను. కానీ మేం గొప్ప ఫలితాలు సాధించలేకపోయాం. ఇద్దరి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. దాంతో పరస్పర అవగాహనతో మా భాగస్వామ్యానికి తెరదించుతున్నాం. మిగతా సీజన్లో నేను మార్టినా హింగిస్‌తో కలిసి ఆడనున్నాను’ అని డబుల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌గా ఉన్న సానియా వివరించింది. -
వారెవ్వా... పేస్
⇒ 41 ఏళ్ల వయస్సులో 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ⇒హింగిస్‌తో కలిసి ‘మిక్స్డ్’ విభాగంలో విజేత ⇒ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడోసారి ఈ ఘనత మెల్బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది. ఓవరాల్‌గా పేస్ కెరీర్లో ఇది 15 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఇందులో ఎనిమిది పురుషుల డబుల్స్ విభాగంలో, ఏడు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పేస్‌కిది మూడో మిక్స్డ్ డబుల్స్ టైటిల్. గతంలో మార్టినా నవ్రతిలోవా (2003లో); కారా బ్లాక్ (2010లో) లతో కలసి అతను చాంపియన్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు 1,42,500 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 68 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఫైనల్ పేస్, హింగిస్ ధాటికి ఏకపక్షంగా ముగిసింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మూడు పదుల వయసు దాటినప్పటికీ పేస్, హింగిస్లిద్దరూ ఆద్యంతం సమన్వయంతో కదలడం, కీలకదశలో పాయింట్లు రాబట్టడంతో నెస్టర్-మ్లడెనోవిచ్ జంట ఏదశలోనూ తేరుకోలేకపోయింది. ‘‘ఆస్ట్రేలియాకు క్రమం తప్పకుండా రావడం, విజేతగా నిలువడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. హింగిస్‌తో కలిసి ఆడటం ఆనందంగా అనిపించింది. ఆమె ఆట నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను.’’ -పేస్ -
హైదరాబాద్‌లో మార్టిన హింగీస్ సందడి
-
కొత్త కొత్తగా ఉంది!
చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌పై హింగిస్ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం తర్వాత హైదరాబాద్ నగరం మరో చెప్పుకోదగ్గ టెన్నిస్ టోర్నీకి వేదిక అయింది. ఎల్బీ స్టేడియంలో నేడు, రేపు చాంపియన్స్ లీగ్ టెన్నిస్ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరును ఎదుర్కొంటుంది. మంగళవారం పుణేతో హైదరాబాద్ తలపడుతుంది. జోరుగా ప్రాక్టీస్... ఆదివారం ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఏసెస్ ఆటగాళ్లు చాలా సేపు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత యువ ఆటగాళ్లతో మాజీ వరల్డ్ నంబర్‌వన్ మార్టినా హింగిస్ ముచ్చటించింది. చిన్నారులు తమ అభిమాన ప్లేయర్లతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అనంతరం ఏసెస్ జట్టు యజమానులు రాజేశ్, కృష్ణంరాజులతో కలిసి ఆటగాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘చాంపియన్స్ టెన్నిస్ లీగ్ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఆటతో పాటు అనేక మంది మాజీ సహచరులను కలిసే అవకాశం కూడా దక్కుతోంది. ఫార్మాట్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఫిలిప్పోసిస్తో నేను గతంలోనూ మిక్స్డ్ డబుల్స్ ఆడాను’ అని హింగిస్ వ్యాఖ్యానించింది. భారత వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. ‘మ్యాచ్‌కు దాదాపు నాలుగు వేల మంది ప్రేక్షకులు వస్తారని విన్నాను. హోంగ్రౌండ్లో ప్రేక్షకులు మాకు మద్దతిస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ ప్రాక్టీస్ కూడా కొత్తగా అనిపించింది. ఇంత మంది మధ్య నేనెప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు’ అని హింగిస్ వెల్లడించింది. ఏసెస్‌ను విజేతగా నిలబెడతామని ఈ సందర్భంగా ఫిలిప్పోసిస్ విశ్వాసం వ్యక్తం చేశాడు. యూజ్నీ తనదైన శైలిలో సెల్యూట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హౌస్‌ఫుల్... సోమ, మంగళవారాల్లో ఇక్కడ జరిగే సీటీఎల్ టోర్నీ మ్యాచ్‌ల కోసం టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ‘బుక్ మై షో’ ద్వారా ఆన్లైన్ అమ్మకాలకు మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ సర్క్యూట్లో రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా, గతంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టెన్నిస్ స్టార్లు ఈ బరిలోకి దిగుతుండటంతో ఈ టోర్నీ పట్ల ఆసక్తి నెలకొంది. ఎల్బీ స్టేడియంలో చాలా కాలంగా పెద్దగా మ్యాచ్‌లు జరగని సెంటర్ కోర్టును సీటీఎల్ కోసం ఉపయోగించనున్నారు. ఇందు కోసం అపరిశుభ్రంగా ఉన్న కోర్టులను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్ది సిద్ధం చేశారు. నేటి మ్యాచ్‌లో ఎవరితో ఎవరు... లెజెండ్స్: ఫిలిప్పోసిస్ ఁ ఎన్క్విస్ట్ మిక్స్డ్ డబుల్స్: హింగిస్, యూజ్నీ ఁ వీనస్ విలియమ్స్, లోపెజ్ మహిళల సింగిల్స్: హింగిస్ ఁ వీనస్ పురుషుల డబుల్స్: యూజ్నీ, జీవన్ ఁ లోపెజ్, రామ్‌కుమార్ రామనాథన్ పురుషుల సింగిల్స్: యూజ్నీ ఁ లోపెజ్. -
ఏడేళ్ల తర్వాత...
స్విస్ స్టార్ హింగిస్‌కు డబుల్స్ టైటిల్ మియామి: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్... ఏడేళ్ల తర్వాత తన ఖాతాలో అంతర్జాతీయ టైటిల్‌ను జమచేసుకుంది. 33 ఏళ్ల ఈ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి జర్మనీ భామ సబీనా లిసికితో కలిసి ప్రతిష్టాత్మక సోనీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన హింగిస్-లిసికి ద్వయం ఫైనల్లో 4-6, 6-4, 10-5లో మకరోవా-వెస్నినా (రష్యా) జోడిపై గెలిచింది. 2007లో దోహా ఓపెన్ తర్వాత హింగిస్ నెగ్గిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఓవరాల్‌గా హింగిస్కిది 81వ టైటిల్ కావడం విశేషం. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన హింగిస్ గాయాల బారిన పడటంతో 2003లో ఆటకు వీడ్కోలు పలికింది. 2005లో పునరాగమనం చేసింది. 2007లో డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడటంతో మరోసారి కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. సస్పెన్షన్ కాలం ముగిశాక 2009లో మరోసారి రాకెట్ పట్టింది.