14 వరుస విజయాల తర్వాత ఓటమి | Sania Mirza, Martina's winning run broken in Stuttgart | Sakshi
Sakshi News home page

14 వరుస విజయాల తర్వాత ఓటమి

Published Thu, Apr 23 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

14 వరుస విజయాల తర్వాత ఓటమి

14 వరుస విజయాల తర్వాత ఓటమి

స్టట్ గార్ట్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు షాక్ తగిలింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు దక్కించున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లో సానియా పరాజయం పాలైంది. సానియా- మార్టినా హింగ్ జోడి జైత్రయాత్రకు బ్రేక్ పడింది. పోర్షె టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ తొలి రౌండ్ లోనే ఈ జంట ఓడింది. పెట్రా మార్టిక్(క్రొయేషియా), స్టెపానీ ఓగ్ట్(లీచెటెన్ స్టీన్) చేతిలో 3-6 3-6 తేడాతో సానియా-హింగిస్ జోడి పరాజయం పాలైంది.

14 విజయాల తర్వాత సానియా-హింగిస్ జంటకు ఎదురైన తొలి ఓటమి ఇది. వరుసగా ఇండియన్ వెల్స్, మియామి, చార్లెస్టన్ టోర్నమెంట్లలో డబుల్స్  టైటిల్స్ గెలిచిన ఈ విక్టరీ పెయిర్.. పోర్షె టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ లో తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement