సానియా-హింగిస్ జంటకు షాక్ | Sania-Hingis pair to shock | Sakshi
Sakshi News home page

సానియా-హింగిస్ జంటకు షాక్

Published Sun, Oct 30 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

సానియా-హింగిస్ జంటకు షాక్

సానియా-హింగిస్ జంటకు షాక్

భారత స్టార్ టాప్ ర్యాంక్‌కు ముప్పు


సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఊహించని పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 2-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోరుుంది.

గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోరుు, రష్యా జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెథానీ మాటెక్ సాండ్‌‌స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్)లతో వెస్నినా-మకరోవా తలపడతారు.  బెథానీ-సఫరోవా జంట టైటిల్ గెలిస్తే మాత్రం సానియా మీర్జా తన ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement