ఫైనల్లో సానియా జోడి | Sania mirza and Martina enter Guangzhou Open final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జోడి

Published Fri, Sep 25 2015 5:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

ఫైనల్లో సానియా జోడి

ఫైనల్లో సానియా జోడి

గ్వాంగ్జౌ: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను గెలిచి ఊపులో ఉన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ ల జోడీ అదే ఆటతీరును గ్వాంగ్జౌ ఓపెన్ లో కూడా కొనసాగిస్తోంది.  మహిళల డబుల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడీ 6-3, 6-4 తేడాతో గ్లుష్కో,  రెబెకా పీటర్సన్‌ల జోడీపై విజయం సాధించి ఫైనల్ కు చేరింది. 

 

తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న సానియా జోడీ.. రెండో సెట్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే ఎటువంటి తప్పిదాలు అవకాశం ఇవ్వని సానియా జోడి రెండో సెట్ ను కూడా గెలుచుకుని ఫైనల్ పోరుకు సిద్ధమైంది. కేవలం గంటా 12 నిమిషాల్లోనే మ్యాచ్ ను  ముగించిన సానియా -హింగిస్ లు తమ సత్తాను మరోమారు చాటుకున్నారు. అంతకుముందు గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనా-లెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై నెగ్గిన సానియా జోడీ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement