Guangzhou Open
-
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో సానియా జోడి
గ్వాంగ్జౌ: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను గెలిచి ఊపులో ఉన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ ల జోడీ అదే ఆటతీరును గ్వాంగ్జౌ ఓపెన్ లో కూడా కొనసాగిస్తోంది. మహిళల డబుల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడీ 6-3, 6-4 తేడాతో గ్లుష్కో, రెబెకా పీటర్సన్ల జోడీపై విజయం సాధించి ఫైనల్ కు చేరింది. తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న సానియా జోడీ.. రెండో సెట్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే ఎటువంటి తప్పిదాలు అవకాశం ఇవ్వని సానియా జోడి రెండో సెట్ ను కూడా గెలుచుకుని ఫైనల్ పోరుకు సిద్ధమైంది. కేవలం గంటా 12 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించిన సానియా -హింగిస్ లు తమ సత్తాను మరోమారు చాటుకున్నారు. అంతకుముందు గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనా-లెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై నెగ్గిన సానియా జోడీ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.