
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్‌జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment