Davis Cup Tennis
-
Davis Cup 2023: తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత డేవిస్‌కప్ టెన్నిస్ జట్టులో సాకేత్
సాక్షి, హైదరాబాద్: నార్వే వేదికగా నార్వే జట్టుతో ఈనెల 16, 17వ తేదీల్లో జరిగే డేవిస్‌కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. గాయంతో వైదొలిగిన డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనిని ఎంపిక చేశారు. ఈ ఏడాది యూకీ బాంబ్రీతో కలిసి సాకేత్ ఐదు ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. ప్రస్తుతం సాకేత్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 96వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2014లో తొలిసారి భారత డేవిస్‌కప్ జట్టులోకి ఎంపికైన సాకేత్ డేవిస్‌కప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. -
వరల్డ్ గ్రూప్–1లోనే భారత్.. డెన్మార్క్‌పై ఘన విజయం
న్యూఢిల్లీ: ఈ ఏడాది డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. డెన్మార్క్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గింది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ ద్వయం 6–7 (4/7), 6–4, 7–6 (7/4)తో నీల్సన్–టార్పెగార్డ్ జంటను ఓడించి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. భారత్ విజయం ఖరారు అయినప్పటికీ రివర్స్ సింగిల్స్‌ను నిర్వహించారు. రామ్‌కుమార్ 5–7, 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇంగిల్డ్సెన్పై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. అనంతరం నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
డేవిస్ కప్ పోరు: భారత్ x పాకిస్తాన్
అంతర్జాతీయ క్రీడా వేదికపై ఎక్కడైనా భారత్, పాకిస్తాన్ మధ్య పోరు అంటే అమితాసక్తి రేగడం సహజం. ఇప్పుడు ఈ రెండు జట్లు టెన్నిస్ కోర్టులో సమరానికి సన్నద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక డేవిస్ కప్ మ్యాచ్ సమరంలో దాయాదులు తలపడబోతున్నాయి. ఈ పోరుకు తటస్థ వేదికగా కజకిస్తాన్‌లోని నూర్–సుల్తాన్‌ను ఎంపిక చేశారు. మ్యాచ్‌లు ఇండోర్‌లోనే జరుగుతున్నా... దాదాపు మైనస్ 20 డిగ్రీల వరకు ఉంటున్న స్థానిక ఉష్ణోగ్రతతో కూడా ఆటగాళ్లు పోరాడాల్సి వస్తోంది. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ 1 పోరులో భాగంగా నేటినుంచి జరిగే సమరంలో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతోంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్‌లు, శనివారం డబుల్స్‌తో పాటు రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక వేళ ఏదైనా జట్టు 3–0తో ఆధిక్యం సాధించినా నాలుగో మ్యాచ్ కూడా జరుగుతుంది. ఐదో మ్యాచ్‌ను మాత్రం ఆడకుండా తప్పుకునేందుకు రెండు జట్లకు అవకాశం ఉంది. నిజానికి ఈ మ్యాచ్ వేదిక పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్. అయితే ఇరు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని కారణంగా పాక్‌లో పర్యటించేందుకు భారత్ తిరస్కరించింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేదికను కజకిస్తాన్‌కు మార్చాల్సి వచ్చింది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు మార్చి 2020లో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించి క్రొయేషియాతో తలపడుతుంది. భారత్‌కు ఎదురుందా! అనుభవం, తాజా ఫామ్వంటివి చూసుకుంటే పాకిస్తాన్‌కంటే భారత జట్టు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. పేస్‌లాంటి సీనియర్, నాగల్, రామ్కుమార్లాంటి యువ ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో చెలరేగుతుంటే పాక్ ఆటగాళ్ల ప్రదర్శన ఐటీఎఫ్ ఫ్యూచర్స్ స్థాయి టోర్నీలకే పరిమితమవుతోంది. 46 ఏళ్ల వయసులో మరో సారి డేవిస్ కప్‌లో సత్తా చాటేందుకు పేస్ సిద్ధమవుతుండటం విశేషం. జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి అతను బరిలోకి దిగుతున్నాడు. నాగల్, రామ్‌కుమార్ సింగిల్స్ భారం మోస్తారు. గతంలో రెండు డేవిస్ కప్ మ్యాచ్‌లలోనూ ఓడిన నాగల్ సింగిల్స్‌లో ఈ సారి బోణీ చేసే అవకాశం ఉంది. ఐసాముల్ హక్ ఖురేషీ, అఖీల్ ఖాన్‌లాంటి ఆటగాళ్లతో పాకిస్తాన్ జట్టు డబుల్స్‌లో కొంత పటిష్టంగా కనిపించింది. కానీ స్వదేశంనుంచి మ్యాచ్‌ను మార్చినందుకు నిరసనగా వీరిద్దరు తప్పుకోవడంతో ఆ జట్టు మరింత బలహీన పడింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌తో తలపడనున్న 17 ఏళ్ల షోయబ్ కనీసం ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ మెయిన్ డ్రాలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చలి తాకిడికి... నూర్–సుల్తాన్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 20 డిగ్రీలకు చేరడంతో డేవిస్ కప్ మ్యాచ్ ఇండోర్ హార్డ్ కోర్టులో నిర్వహిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా వేడి హీటర్లు ఏర్పాటు చేశారు. అయితే బయటి వాతావరణం కూడా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో భారత్ పలు జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను ఆటగాళ్లకు అందజేయడంతో పాటు తొలిసారి ఇద్దరు ఫిజియోలు జట్టుతో పాటు ప్రయాణిస్తున్నారు. -
సాకేత్ ముందంజ
బెంగళూరు: భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 6–3, 7–6 (7/3)తో ఆదిల్ కల్యాణ్‌పుర్ (భారత్)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో నెడొల్కో (రష్యా)పై, శశికుమార్ 7–6 (8/6), 6–3తో అల్టామిరానో (అమెరికా)పై నెగ్గారు. డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–4, 6–3తో సుమీత్ నాగల్ (భారత్)–బ్రైడెన్ ష్నుర్ (కెనడా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
డబుల్స్‌లోనూ నిరాశే
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
లియాండర్ పేస్పై వేటు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను సెర్బియాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయలేదు. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు సెర్బియాలో ఈ పోటీ జరుగుతుంది. గత ఏప్రిల్‌లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (43) సాధించిన ప్లేయర్‌గా లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెర్బియాతో మ్యాచ్ కోసం రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల భారత జట్టును ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన జంట బోపన్న–దివిజ్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుంది. యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్, ప్రజ్నేశ్ సింగిల్స్‌లో పోటీపడతారు. మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా, జీషాన్ అలీ కోచ్‌గా వ్యవహరిస్తారు. -
సింగిల్స్‌లో భారత్‌కు షాక్
తియాన్‌జెన్ (చైనా): ప్రొఫెషనల్ టెన్నిస్‌లో ఇటీవల సంచలన విజయాలు సాధిస్తోన్న భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సుమీత్ నాగల్ డేవిస్‌కప్‌లో మాత్రం నిరాశపరిచారు. చైనాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో తొలి రోజు జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 132వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–7 (4/7), 4–6తో 332వ ర్యాంకర్ వీ బింగ్ వూ చేతిలో... 213వ ర్యాంకర్ సుమీత్ నాగల్ 4–6, 1–6తో 247వ ర్యాంకర్ జీ జాంగ్ చేతిలో ఓడిపోయారు. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించాలంటే చైనాతో నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ తప్పనిసరిగా గెలవాలి. తొలుత జరిగే డబుల్స్ మ్యాచ్‌లో డి వూ–మావో జిన్ గాంగ్‌తో పేస్–బోపన్న జోడీ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పేస్ నెగ్గితే డేవిస్‌కప్ చరిత్రలోఅత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ఉ.గం. 7.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చైనాతో డేవిస్ కప్ పోరుకు భారత్ సై
తియాన్‌జెన్ (చైనా): ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా భారత్, చైనా జట్ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్ నేడు మొదలవుతుంది. తొలి రోజు సింగిల్స్ విభాగంలో వీ బింగ్‌తో రామ్‌కుమార్; జీ జాంగ్‌తో సుమిత్ ఆడతారు. రెండో రోజు శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో పేస్–బోపన్న జంట డి వూ–మావొ జిన్ గాంగ్ జోడీతో ఆడనుంది. డబుల్స్ మ్యాచ్ తర్వాత రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్ విభాగం లో డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కడానికి భారత దిగ్గజం లియాండర్ పేస్ మరో విజయం దూరంలో ఉన్నాడు. -
చైనాతో డేవిస్ కప్ పోటీకి యూకీ దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో చైనాతో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఉదర సంబంధిత గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని యూకీ తెలిపాడు. యూకీ స్థానంలో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వచ్చాడు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తియాన్జిన్ వేదికగా చైనాతో భారత్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో భారత్ 3–0తో ఆధిక్యంలో ఉంది. గత రెండు వారాల్లో జరిగిన ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’లో ఆడిన యూకీ గైర్హాజరీ భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశముంది. -
బెల్జియం ఈసారైనా?
పారిస్: 117 ఏళ్ల చరిత్ర కలిగిన డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు బెల్జియం జట్టుకు మరో అవకాశం లభించింది. గతంలో రెండుసార్లు (2015లో, 1904లో) ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న బెల్జియం మూడో ప్రయత్నంలోనైనా డేవిస్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొదలయ్యే డేవిస్ కప్ ఫైనల్లో తొమ్మిదిసార్లు చాంపియన్ ఫ్రాన్స్‌తో బెల్జియం జట్టు తలపడుతుంది. డేవిస్ కప్ ముఖాముఖి పోరులో ఫ్రాన్స్ 4–3తో బెల్జియంపై ఆధిక్యంలో ఉంది. బెల్జియం ఆశలన్నీ ప్రపంచ ఏడో ర్యాంకర్ డేవిడ్ గాఫిన్‌పై ఉండగా... ఫ్రాన్స్ భారమంతా ప్రపంచ 15వ ర్యాంకర్ జో విల్ఫ్రైడ్ సోంగాపై ఉంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో లుకాస్ పుయి (ఫ్రాన్స్)తో గాఫిన్... సోంగా (ఫ్రాన్స్)తో స్టీవ్ డార్సిస్ తలపడతారు. -
పేస్‌కు చోటు లభించింది కానీ...
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో సీనియర్, దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌కు చోటు దక్కింది. అయితే మ్యాచ్‌లో బరిలోకి దిగే విషయాన్ని మాత్రం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి అప్పగించారు ‘ఐటా’ సెలక్టర్లు. సోమవారం సమావేశమైన ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ ఆరుగురితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సింగిల్స్ ఆటగాళ్లున్నారు. రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్ఞేశ్ గున్నెశ్వరన్, శ్రీరామ్ బాలాజీలను సింగిల్స్ కోసం ఎంపిక చేయగా... రోహన్ బోపన్న, లియాండర్ పేస్ డబుల్స్ ఆటగాళ్లు. అయితే బరిలోకి దిగే నలుగురిని కెప్టెన్ మహేశ్ భూపతి నిర్ణయిస్తారని ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోరులో భాగంగా భారత్... ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. బెంగళూరులో వచ్చే నెల 7 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దీనికి సరిగ్గా పది రోజుల ముందు తుది నలుగురు ఆటగాళ్లను భూపతి ఎంపిక చేసుకుంటాడని ఛటర్జీ పేర్కొన్నారు. మరో విజయం సాధిస్తే పేస్ డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. -
డబుల్స్ మ్యాచ్ మనదే
సాకేత్-బోపన్న జోడి గెలుపు భారత్‌కు 2-1 ఆధిక్యం కొరియాతో డేవిస్‌కప్ పోరు బుసాన్ (కొరియా): డేవిస్‌కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొందేందుకు భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది. ఆసియా-ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్లో భాగంగా కొరియాతో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో గెలిచి భారత్ 2-1 ఆధిక్యం సాధించింది. రోహన్ బోపన్న-సాకేత్ మైనేని జోడి 7-6 (7/4), 5-7, 7-6 (2/7), 6-3తో హ్యుంగ్ తైక్ లీ-లిమ్ యాంగ్ క్యు జంటపై గెలుపొందింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ విజయం సాధించగా... సనమ్‌సింగ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం జరగనున్న రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్‌లో గెలుపొందినా కొరియాపై భారత్ విజయం నమోదు చేయనుంది. దీంతో కొరియాతో ఇప్పటిదాకా 3-6గా ఉన్న ముఖాముఖి రికార్డును సవరించుకోవడంతోపాటు 2008 తరువాత తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో లిమ్ యాంగ్ క్యు తో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్; హ్యున్ చుంగ్‌తో సనమ్‌సింగ్ తలపడతారు.