
న్యూఢిల్లీ: వచ్చే నెలలో చైనాతో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఉదర సంబంధిత గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని యూకీ తెలిపాడు. యూకీ స్థానంలో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వచ్చాడు.
ఏప్రిల్ 6, 7 తేదీల్లో తియాన్‌జిన్ వేదికగా చైనాతో భారత్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో భారత్ 3–0తో ఆధిక్యంలో ఉంది. గత రెండు వారాల్లో జరిగిన ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’లో ఆడిన యూకీ గైర్హాజరీ భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment