హిలెరాడ్ (డెన్మార్క్): భారత్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు.
కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment