లక్నో: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్‌ను విజయంతో ముగించాడు. మొరాకోతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–2 పోటీలో భాగంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6–2, 6–1తో బెన్‌చెట్రిట్–యూనెస్ లారూసి జంటపై గెలిచింది. 2002లో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన 43 ఏళ్ల బోపన్న భారత్ తరఫున మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. డబుల్స్‌లో 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. సింగిల్స్‌లో 10 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు.
డేవిస్ కప్ నుంచి రిటైరయిన్పటికీ ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో బోపన్న టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తాడు. డబుల్స్ మ్యాచ్ తర్వాత జరిగిన సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో యాసిన్ దిల్మీపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6–1, 5–7, 10–6తో వాలిద్‌ను ఓడించడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment