bopanna
-
నిఖత్ శుభారంభం..
అస్తానా (కజకిస్తాన్): ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 5–0తో రఖీమ్బెర్దీ జన్సాయా (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు) కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు.మీనాక్షి 4–1తో గసిమోవా రొక్సానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... అనామిక పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుమ్బయేవా అరైలిమ్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. ఇస్మిత్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఇష్మిత్ 0–5 తో అర్మాత్ (కజకిస్తాన్) చేతిలో, సోనియా 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు.ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ..రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలిరౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–2తో అర్నాల్డి–పసారో (ఇటలీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బొలెలీ–వావాసోరి (ఇటలీ)లతో బోపన్న–ఎబ్డెన్ తలపడతారు. -
బోపన్న జోడీ అవుట్
మోంటెకార్లో (మొనాకో): పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో టాప్ సీడ్ బోపన్న–ఎబ్దెన్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. తొలి రౌండ్ ‘బై’ పొందిన బోపన్న–ఎబ్డెన్ జంట బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–6, 6–7 (6/8)తో మాట్ పావిచ్ (క్రొయేషియా)–మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 25,510 యూరోల (రూ. 22 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
‘మై లార్డ్’ అనకండి..సగం వేతనం ఇచ్చేస్తా!
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. -
బోపన్న... విజయంతో వీడ్కోలు
లక్నో: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్‌ను విజయంతో ముగించాడు. మొరాకోతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–2 పోటీలో భాగంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6–2, 6–1తో బెన్చెట్రిట్–యూనెస్ లారూసి జంటపై గెలిచింది. 2002లో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన 43 ఏళ్ల బోపన్న భారత్ తరఫున మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. డబుల్స్‌లో 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. సింగిల్స్‌లో 10 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. డేవిస్ కప్ నుంచి రిటైరయిన్పటికీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో బోపన్న టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తాడు. డబుల్స్ మ్యాచ్ తర్వాత జరిగిన సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో యాసిన్ దిల్మీపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6–1, 5–7, 10–6తో వాలిద్‌ను ఓడించడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. -
బోపన్న జంట ఓటమి
రోమ్: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. మూడో సీడ్ యువాన్ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీతో జరిగిన తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) జంట 6–7 (5/7), 3–6తో ఓడిపోయింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న జంటకు 10,020 యూరోలు (రూ. 7 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
దివిజ్, బోపన్న జోడీలకు నిరాశ
న్యూఢిల్లీ: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మొనాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత డబుల్స్ టాప్ ర్యాంకర్ రోహన్ బోపన్న... రెండో ర్యాంకర్ దివిజ్ శరణ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. దివిజ్ శరణ్–లాస్లో జెరి (సెర్బియా) జంట 2–6, 1–6తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో... బోపన్న–డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయం 6–4, 3–6, 11–13తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయాయి. తొలి రౌండ్లో ఓడిన దివిజ్, బోపన్న జోడీలకు 10,020 యూరోలు (రూ. 7 లక్షల 87 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
తొలి రౌండ్లోనే దివిజ్–బోపన్న జంట ఓటమి
గత వారం స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన దివిజ్ శరణ్–రోహన్ బోపన్న జంటకు రెండో టోర్నమెంట్లో మాత్రం నిరాశ ఎదురైంది. సిడ్నీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ఈ భారత జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయంతో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–దివిజ్ జంట 2–6, 4–6తో ఓడిపోయింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడినప్పటికీ భారత జంటకు 2,870 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
తొలి రౌండ్లోనే బోపన్న జంట ఓటమి
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో బరిలోకి దిగిన బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం తొలి రౌండ్లో... దివిజ్ శరణ్ (భారత్)– సితాక్ (న్యూజిలాండ్) జోడీ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాయి. బోపన్న–వాసెలిన్ జంట 6–7 (4/7), 4–6తో మెక్లాచ్లాన్ (జపాన్)–స్ట్రఫ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. కుబోట్ (పోలాండ్)–మెలో (బ్రెజిల్) జంట 6–3, 6–4తో దివిజ్–సితాక్ ద్వయంపై గెలిచింది. దివిజ్–సితాక్ జంటకు 27,450 డాలర్లు (రూ. 20 లక్షల 37 వేలు), బోపన్న–వాసెలిన్ జోడీకి 14,480 డాలర్లు (రూ. 10 లక్షల 74 వేలు ) ప్రైజ్‌మనీగా లభించాయి. -
బోపన్న జంట సంచలనం
న్యూఢిల్లీ: బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. స్పెయిన్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 7–6 (9/7), 6–3తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై సంచలన విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–వాసెలిన్ జంట ఒక్క ఏస్ కొట్టకుండా, ఒక్క డబుల్ ఫాల్ట్ చేయకుండా ఆడింది. తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో బోపన్న–వాసెలిన్ పైచేయి సాధించారు. రెండో సెట్లో ఒకసారి కొంటినెన్–పీర్స్ జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని బోపన్న జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. -
పతకం ముంగిట...
-
'భారత్‌కు కాంస్య పతకాన్ని సాధిస్తాం'
రియో డి జనీరో: భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో మిశ్రమ ఫలితం వచ్చింది. సానియా మిర్జా, రోహన్ బోపన్న జోడీ ఆదివారం తెల్లవారుజామున జరిగిన తొలి సెమీస్ పోరులో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం చేతిలో 2-6, 6-2, 10-3 (టై బ్రేక్) తేడాతో ఓటమి చెందింది. తొలి సెట్ ను సునాయాసంగా సొంతం చేసుకున్న సానియా-బోపన్న జోడీ రెండో రౌండ్ నుంచి తడబాటుకు గురైంది. దీంతో ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గిన అనుభవమున్న వీనస్ తన జోడీతో కలిసి చెలరేగిపోయింది. బోపన్న మీడియాతో మాట్లాడుతూ.. తొలి సెట్ కోల్పోయినా వీనస్ జోడీ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. ఈ క్రెడిట్ అంతా వీనస్ కే చెందుతుందన్నాడు. ముఖ్యంగా వీనస్ సర్వీస్ తమను ఇబ్బంది పెట్టిందని బోపన్న పేర్కొన్నాడు. ఓటమి నుంచి త్వరగా కోలుకుని కాంస్య పతకం నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా మాట్లాడుతూ.. ఈ ఓటమి నుంచి కోలుకుని బరిలో దిగడం చాలెంజింగ్ గా ఉంటుందని పేర్కొంది. అయితే సాధ్యమైనంత త్వరగా మానసికంగా, శారీరకంగానూ కోలుకుని మరుసటి మ్యాచ్‌కు సిద్థంగా ఉంటామని చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మొదట స్కోరు చేసిన విషయాలు గుర్తించి, ఎక్కడెక్కడ పాయింట్లు కోల్పోయాయో వాటిని సరిదిద్దుకోవాలని అభిప్రాయపడింది. -
పతకం ముంగిట...
మరో విజయం సాధిస్తే సానియా-బోపన్న జంటకు పతకం మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో భారత జోడీ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత అభిమానుల నిరీక్షణకు తెరపడేలా కనిపిస్తోంది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి సానియా మీర్జా-రోహన్ బోపన్న సెమీస్‌కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. సెమీస్‌లో గెలిస్తే స్వర్ణం లేదా రజతం దక్కుతుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడిపోయినా... కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మీరు ఈ వార్త చదివే సమయానికి మనవాళ్లు ఫైనల్‌కు చేరి కనీసం స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఆశ్చర్యపోకండి! రియో డి జనీరో: అంతా అనుకున్నట్లు జరిగితే రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ చేయనుంది. టెన్నిస్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-రోహన్ బోపన్న ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పతకానికి కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-4, 6-4తో ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో సానియా-బోపన్న తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జంట ఫైనల్‌కు చేరుకుంటుంది. తద్వారా రజతం లేదా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా సానియా-బోపన్నలకు కాంస్య పతక అవకాశాలు సజీవంగా ఉంటాయి. మిక్స్డ్ డబుల్స్ రెండో సెమీస్‌లో ఓడిన జోడీతో (బెథానీ మాటెక్ సాండ్స్-జాక్ సోక్ లేదా రాడెక్ స్టెపానెక్-లూసీ హర్డెకా) సానియా-బోపన్న ఆడాల్సి ఉంటుంది. డబుల్స్‌లో అంతగా అనుభవం లేని ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న పూర్తి సమన్వయంతో ఆడారు. నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పదునైన రిటర్న్‌లతో ఆధిపత్యం కనబరిచారు. ఏడో గేమ్‌లో హితెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఎనిమిదో గేమ్‌లో తమ సర్వీస్‌నూ కాపాడుకొని 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... పదో గేమ్‌లో బోపన్న ఏస్‌లతో అలరించి సెట్‌ను అందించాడు. రెండో సెట్లో ఐదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఆ తర్వాత 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో సెట్‌నూ 6-4తో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సానియా-బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడి
ఎస్ హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): రికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న జోడీ క్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న, నికోలస్ మహత్ (ఫ్రాన్స్) జోడీ 6-1, 6-4తో రాబిన్ హస్సే, గిలెర్మో గార్సియా లోపెజ్ జంటపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బోపన్న జోడీ గిల్స్ ముల్లర్, ఫ్రెడెరిక్ నీల్సన్ జంటతో తలపడుతుంది. -
వింబుల్డన్ నుంచి బోపన్న జోడి నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న-మెర్జియా జంట ఓటమి పాలైంది. సెమీస్‌లో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా)ల జోడీ 4-6, 6-2, 6-3, 13-11 తేడాతో బోపన్న జోడీపై గెలుపొందింది. దీంతో బోపన్న జోడీ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్నజంట టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జోడీ మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి సెమీ ఫైనల్ కు ప్రవేశించినా.. ఫైనల్ కు చేరాలనుకున్న ఆశమాత్రం తీరలేదు. -
ప్రిక్వార్టర్స్‌లో పేస్, బోపన్న జోడీలు
పారిస్: భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ జోడితో పాటు రోహన్ బోపన్న ద్వయం బీఎన్పీ పారిబా ఏటీపీ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. కెనడాకు చెందిన డానియెల్ నెస్టోర్తో కలిసి పేస్ జంట ఏడో సీడ్‌గా, రోజర్ వాసెలిన్ ఎడ్యుర్డ్ (ఫ్రాన్స్)తో బోపన్న జోడి ఐదో సీడ్‌గా బరిలోకి దిగాయి. అయితే ఈ రెండు జంటలకు తొలి రౌండ్లో బై లభించింది. దీంతో గాంజలెజ్-స్కాట్ లిప్స్కీ... జేమి ముర్రే-జాన్ పీర్స్ల మధ్య మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్స్‌లో పేస్ జోడి తలపడనుంది. ఇస్నర్-మోన్రో... జొనాథన్-సిజ్స్లింగ్ల మధ్య తొలి రౌండ్ విజేతతో బోపన్న జోడి పోటీపడుతుంది.