
న్యూఢిల్లీ: బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. స్పెయిన్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–వాసెలిన్ ద్వయం 7–6 (9/7), 6–3తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై సంచలన విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–వాసెలిన్ జంట ఒక్క ఏస్ కొట్టకుండా, ఒక్క డబుల్ ఫాల్ట్ చేయకుండా ఆడింది.
తొలి సెట్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో బోపన్న–వాసెలిన్ పైచేయి సాధించారు. రెండో సెట్‌లో ఒకసారి కొంటినెన్–పీర్స్ జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని బోపన్న జంట విజయాన్ని ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment