Barcelona Open
-
నాదల్కు చుక్కెదురు
బార్సిలోనా: స్పెయిన్ దిగ్గజం, 12 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 5–7, 1–6తో డి మినార్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. 2003 తర్వాత నాదల్ మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్లో పరాజయం చవిచూశాడు. తుంటి గాయంతో నాదల్ ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. బ్రిస్బేన్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా ప్లేయర్ జోర్డాన్ థాంప్సన్ చేతిలో ఓడిపోయాడు. -
Barcelona Open: నాలుగో సీడ్ జోడీపై బోపన్న ద్వయం గెలుపు
బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాట్ పావిచ్–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. -
బార్సిలోనా ఓపెన్‌కు రాఫెల్ నాదల్ దూరం
మాడ్రిడ్: ఎడమ తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... ఈనెల 17న మొదలయ్యే బార్సిలోనా ఓపెన్ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ బరిలోకి దిగడంలేదు. 36 ఏళ్ల నాదల్ బార్సిలోనా ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 12 సార్లు చాంపియన్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాకేత్ జోడీ ఫ్లోరిడాలో జరుగుతున్న సరసోటా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లో 2–6, 4–6తో డస్టిన్ బ్రౌన్ (జమైకా)–టిమ్ సాండ్కౌలెన్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. సాకేత్, యూకీలకు 1,930 డాలర్ల (రూ. 1 లక్షా 57 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. కాంస్యంతో ముగింపు అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత జట్టు కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరిరోజు శుక్రవారం పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో అనిరుధ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక బౌట్లో అనిరుధ్ 12–2తో సర్దార్బెక్ ఖొల్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అనిరుధ్ 8–2తో తైకి యామమోటో (జపాన్)పై నెగ్గి, క్వార్టర్ ఫైనల్లో 0–2తో బతిర్‌ముర్జయెవ్ యుసుప్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. బతిర్‌ముర్జయెవ్ ఫైనల్ చేరుకోవడంతో అనిరుధ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. భారత్‌కే చెందిన పంకజ్ (61 కేజీలు), యశ్ (74 కేజీలు), దీపక్ పూనియా (92 కేజీలు), జాంటీ కుమార్ (86 కేజీలు) పతకాల బౌట్లకు అర్హత పొందలేకపోయారు. ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించింది. జొకోవిచ్‌కు షాక్ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి 2 గంటల 54 నిమిషాల్లో 4–6, 7–5, 6–4తో టాప్ సీడ్ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2013, 2015లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సిట్సిపాస్ (గ్రీస్), మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ఇంటిముఖం పట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–2, 6–4తో రెండో సీడ్ సిట్సిపాస్‌పై, హోల్గర్ రూన్ (డెన్మార్క్) 6–3, 6–4తో మెద్వెదెవ్పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. -
బార్సిలోనా ఓపెన్‌కు నాదల్ దూరం
Rafael Nadal: పక్కటెముకల గాయం నుంచి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఇంకా కోలుకోలేదు. దీంతో స్వదేశంలో ఈనెల 18 నుంచి జరిగే బార్సిలోనా ఓపెన్ టోర్నీకి అతడు దూరమయ్యాడు. కాగా బార్సిలోనా ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 12 సార్లు విజేతగా నిలిచాడు నాదల్. ఇక వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకల్లా నాదల్ కోలుకునే అవకాశముంది. 35 ఏళ్ల నాదల్ ఓవరాల్‌గా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా అందులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే 13 ఉన్నాయి. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
మరో మైలురాయి చేరుకున్న రఫెల్
-
నాదల్ 11వ సారి...
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వ సారి బార్సిలోనా ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాదల్ 6–2, 6–1తో స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. నాదల్ కెరీర్లో ఇది 77వ సింగిల్స్ టైటిల్. ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్– 97 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా–94 టైటిల్స్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
బోపన్న జంట సంచలనం
న్యూఢిల్లీ: బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. స్పెయిన్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 7–6 (9/7), 6–3తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై సంచలన విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–వాసెలిన్ జంట ఒక్క ఏస్ కొట్టకుండా, ఒక్క డబుల్ ఫాల్ట్ చేయకుండా ఆడింది. తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో బోపన్న–వాసెలిన్ పైచేయి సాధించారు. రెండో సెట్లో ఒకసారి కొంటినెన్–పీర్స్ జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని బోపన్న జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. -
మరో చరిత్రపై నాదల్ గురి
పదోసారి బార్సిలోనా ఓపెన్‌లో ఫైనల్లోకి బార్సిలోనా (స్పెయిన్): గత వారమే మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో పదోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ‘మరో చరిత్ర’కు విజయం దూరంలో ఉన్నాడు. బార్సిలోనా ఓపెన్‌లో నాదల్ పదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫైనల్‌కు చేరుకున్న తొమ్మిదిసార్లూ నాదలే విజేతగా నిలిచాడు. ఈసారీ గెలిస్తే రెండు టోర్నమెంట్లను (మోంటెకార్లో, బార్సిలోనా) పదిసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా నాదల్ గుర్తింపు పొందుతాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4తో జెబలోస్ (అర్జెంటీనా)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో నాదల్ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో థీమ్ 6–2, 3–6, 6–4తో ఆండీ ముర్రే (బ్రిటన్)పై నెగ్గాడు. -
తొలిరౌండ్లోనే ఓడిన సోమ్‌దేవ్
బార్సిలోనా: భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు. తాజాగా బార్సిలోనా ఓపెన్‌లో మార్టిన్ క్లిజన్ (స్లొవేకియా) చేతిలో సోమ్‌దేవ్ 2-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. ఢిల్లీ ఓపెన్ చాలెంజర్ టోర్నీ గె లిచిన అనంతరం సోమ్‌దేవ్ దుబాయ్ ఈవెంట్లో డెల్ పొట్రోపై మాత్రమే నెగ్గాడు. అది కూడా ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకోవడంతో సాధ్యమైంది. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, ఐజమ్ ఉల్ హక్ ఖురేషి జోడి వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ అన్‌సీడెడ్ జంట 6-1, 6-4 తేడాతో ట్రీట్ హుయే (ఫిలిప్పైన్స్), డొమినిక్ ఇన్‌గ్లాట్ (బ్రిటన్)ను ఓడించింది.