తొలిరౌండ్‌లోనే ఓడిన సోమ్‌దేవ్ | Somdev Devvarman bows out in first round of Barcelona Open | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్‌లోనే ఓడిన సోమ్‌దేవ్

Published Wed, Apr 23 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

తొలిరౌండ్‌లోనే ఓడిన సోమ్‌దేవ్

తొలిరౌండ్‌లోనే ఓడిన సోమ్‌దేవ్

 బార్సిలోనా: భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టాడు. తాజాగా బార్సిలోనా ఓపెన్‌లో మార్టిన్ క్లిజన్ (స్లొవేకియా) చేతిలో సోమ్‌దేవ్ 2-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. ఢిల్లీ ఓపెన్ చాలెంజర్ టోర్నీ గె లిచిన అనంతరం సోమ్‌దేవ్ దుబాయ్ ఈవెంట్‌లో డెల్ పొట్రోపై మాత్రమే నెగ్గాడు. అది కూడా ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకోవడంతో సాధ్యమైంది.
 
 డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, ఐజమ్ ఉల్ హక్ ఖురేషి జోడి వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ అన్‌సీడెడ్ జంట 6-1, 6-4 తేడాతో ట్రీట్ హుయే (ఫిలిప్పైన్స్), డొమినిక్ ఇన్‌గ్లాట్ (బ్రిటన్)ను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement