న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ50 మహిళల టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఏడుగురు బరిలోకి దిగగా... రియా భాటియా మినహా మిగతా ఆరుగురు భమిడిపాటి శ్రీవల్లి రషి్మక, అంకితా రైనా, కర్మన్ కౌర్, ఆకాంక్ష, వైదేహి, వైష్ణవి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ రషి్మక 1–6, 3–6తో మరియా కొజిరెవా (రష్యా) చేతిలో, అంకిత రైనా 1–6, 3–6తో లౌరా సామ్సన్ (చెక్ రిపబ్లిక్) చేతిలో, కర్మన్ కౌర్ 4–6, 1–6తో పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో, వైదేహి 4–6, 4–6తో తాతియానా ప్రొజోరోవా (రష్యా) చేతిలో, వైష్ణవి 6–7 (3/7), 2–6తో డాలియా జకుపోవిచ్ (స్లొవేనియా) చేతిలో, ఆకాంక్ష 0–6, 1–6తో ఫాన్‌గ్రాన్ టియాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. రియా భాటియా 7–6 (7/3), 2–6, 7–5తో ఎరి షిమిజు (జపాన్)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment