ప్రభాస్‌తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్! | Rashmika Mandanna Hints At Dream Collaboration With Prabhas During The Girlfriend Movie Promotions, Post Went Viral | Sakshi
Sakshi News home page

Rashmika: ప్రభాస్‌ సరసన రష్మిక.. నా బాడీని తీసుకెళ్లండన్న నెటిజన్!

Nov 3 2025 9:29 PM | Updated on Nov 4 2025 12:14 PM

Rashmika Mandanna says she would love to work with Prabhas

రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్‌ శెట్టి శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్‌ 7న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్‌లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్బాస్షోలోనూ సందడి చేసింది.

తాజాగా ది గర్ల్ఫ్రెండ్మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్తో చిట్చాట్ నిర్వహించింది. రష్అవర్ పేరుతో ట్విటర్వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్తో కలిసి నటిస్తారా? అలా జరిగితే మీ కాంబో హైప్దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక.. ప్రభాస్తో నటించడం నాకు కూడా ఇష్టమే.. ఒకవేళ ప్రభాస్ మేసేజ్చూస్తారని ఆశిస్తున్నా.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. గతంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికీ బాలీవుడ్ భామ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ఫ్రెండ్చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement