Rashmika Mandanna With Rumoured Boyfriend Vijay Deverakonda In Dubai, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో రష్మిక-విజయ్ చక్కర్లు.. ఈసారి మాత్రం..!

Published Wed, Feb 1 2023 6:10 PM | Last Updated on Wed, Feb 1 2023 7:29 PM

Rashmika Mandanna with rumoured boyfriend Vijay Deverakonda In Dubai - Sakshi

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ గురించి టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ జంట ఎక్కడికెళ్లినా ఇద్దరు ప్రత్యక్షమవుతుంటారు. గతంలో వ్యాకేషన్‌కు వెళ్లి సోషల్ మీడియాలో షేర్ ఫోటోలు షేర్ చేసి దొరికిపోయారు. తాజాగా మరోసారి ఈ జంట దుబాయ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. 

దుబాయ్‌లో విజయ్ దేవరకొండ, అతని కుటుంబంతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అక్కడే విజయ్‌ పక్కన రష్మిక నవ్వుతూ కనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ జంట రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పలేదు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న విజయ్‌తో అతని తల్లిదండ్రులతో కలిసి వ్యాకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో పలుసార్లు విదేశాల్లో పర్యటించినా.. ఇద్దరు కలిసి ఫోటోలో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ ఫోటోలను కొందరు నెటిజన్లు ట్విటర్‌లో షేర్ చేశారు. 

రష్మిక -విజయ్ 

రష్మిక మందన్నా, విజయ్ జంటగా తెలుగులో రెండు చిత్రాల్లో నటించారు. అయితే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. కాగా.. విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం 'లైగర్'లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత సమంతతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు రష్మిక చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను'లో కనిపించింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ పుష్ప సీక్వెల్‌లో నటిస్తోంది. ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో 'యానిమల్' చిత్రంలో కనిపంచనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement