
ఇటీవలే యానిమల్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రస్తుత యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా టాప్‌లో దూసుకెళ్తోంది.
అయితే యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నారు. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన రష్మికను ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వార్త నిజం కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రష్మిక, ప్రభాస్ ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు. దీంతో ఈ జంటను స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
కాగా.. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2024లో ప్రారంభిస్తామని సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ సమ్మర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత మారుతి డైరెక్షన్‌లో 'ది రాజా సాబ్' నటించనున్నారు. మరోవైపు రష్మిక మందన్నా పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment