
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దాదాపు అందరూ హీరో ఒకటి తర్వాత ఒకటి అంటూ సినిమాలు చేస్తుంటే డార్లింగ్ హీరో మాత్రం ఒకేసారి రెండు మూడు మూవీస్ చేస్తున్నాడు. అయినా సరే టైమ్ సరిపోవట్లేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొన్ని స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టాడట!
బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ వరస సినిమాలు చేస్తున్నాడు. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాల్ని రిలీజ్ చేశాడు. దేశవ్యాప్తంగా వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది.
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
మరోవైపు 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో 'స్పిరిట్' చేయాలి. లెక్క ప్రకారం జనవరి నుంచే షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ప్రభాస్ షూటింగ్స్ వల్ల స్పిరిట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మొదలుపెడితే మరొకటి చేయకూడదని సందీప్.. ప్రభాస్ కి చెప్పాడట.
దీంతో చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్ని పూర్తి చేసి.. మే నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సెట్స్ పైకి వస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని.. ఒక్కసారి ప్రభాస్ వస్తే ఆపకుండా షూటింగ్ చేసి పూర్తి చేస్తారని టాక్. ఈ మూవీలో ప్రభాస్.. పోలీస్ గా కనిపించబోతున్నాడని ఇదివరకే సందీప్ చెప్పాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment