స్పిరిట్‌లో ఎవరు? | Rashmika Mandanna, Kiara Advani being considered for Prabhas upcoming film Spirit | Sakshi
Sakshi News home page

స్పిరిట్‌లో ఎవరు?

Published Sat, May 14 2022 12:57 AM | Last Updated on Sat, May 14 2022 12:58 AM

Rashmika Mandanna, Kiara Advani being considered for Prabhas upcoming film Spirit - Sakshi

హీరో ప్రభాస్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసేది ఎవరు? రష్మికా మందన్నానా? కియారా అద్వానీయా? అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌లో ఒకటి. ఈ చర్చ జరుగుతున్నది ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ‘స్పిరిట్‌’ చిత్రం గురించే. ఈ చిత్రం కోసం రష్మికా మందన్నా, కియారా అద్వానీలను సందీప్‌ సంప్రదించారట. వీరిద్దరిలో ఒకర్ని కథానాయికగా ఎంపిక చేయనున్నారని టాక్‌. ఆ ఒక్కరు ఎవరు? అనే చర్చ జరుగుతోంది.

కాగా ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌గా సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్‌’లో కియారా హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్‌’లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇలా.. ఈ ఇద్దరి హీరోయిన్లూ సందీప్‌ దర్శకత్వంలో చాన్స్‌ దక్కించుకున్నారు. అయితే ఈ రెండూ హిందీ సినిమాలే. మరి.. పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘స్పిరిట్‌’లో ఈ ఇద్దరిలో ఒకరు కథానాయికగా కనిపిస్తారా లేక ఈ ఇద్దరూ కాకుండా వేరే తార తెరపైకి వస్తారా? అనేది తెలియాలంటే కాస్త వెయిట్‌ చేయాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement