పారిస్: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దేశాధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్‌లో మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది.
తొలి దశలో పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టింది. న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 27.99 శాతం వచ్చాయి. మేక్రాన్ పార్టీ 20.04 శాతంతో సరిపెట్టుకుంది. జూలై 7న రెండో రౌండ్ పోలింగ్ ఉంటుంది. గత నెలలో ఈయూ ఎన్నికల్లో కూడా నేషనల్ ర్యాలీ పార్టీయే విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment