French president
-
సాక్షి కార్టూన్
-
ఉక్రెయిన్‌లో తక్షణమే శాంతి నెలకొనాలి
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్‌లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్‌లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.నాటో నుంచి బయటికొస్తాంనాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే. -
ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం
జెరూసలేం: ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహు మండిపడ్డారు. ‘‘మాక్రాన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఇరాన్ అండదండలు అందిస్తున్న అరాచకశక్తులపై ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇందుకు నాగరిక దేశాలన్నీ మద్దతు ఇవ్వాలి. కానీ ఫ్రాన్స్, ఇతర పశి్చమ దేశాలు మాకు ఆయుధాలివ్వొద్దని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అంటూ ఆదివారం దుయ్యబట్టారు. ‘‘మేం ఏడు దిక్కులా శత్రువులతో పోరాడుతున్నాం. గాజాలో హమాస్‌పై, లెబనాన్‌లో హెజ్»ొల్లాపై, యెమెన్‌లో హౌతీలపై, ఇరాక్, సిరియాల్లో షియా మిలిటెంట్లపై పోరాడుతున్నాం. ఇరాన్ ప్రభుత్వం మిలిటెంట్లకు ఆయుధ సరఫరా ఆపడం లేదు. మిలిటెంట్ శక్తులు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తున్న పశి్చమ దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలివ్వడం మాత్రం నిలిపివేస్తున్నాయి’’ అని ఆక్షేపించారు. ఎవరి సహకారమున్నా, లేకపోయినా యుద్ధంలో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్‌లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్‌లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్‌ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్‌వర్క్ డ్రెస్‌లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. -
ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్లో విపక్ష కూటమి గెలుపు
పారిస్: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దేశాధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి దశలో పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టింది. న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 27.99 శాతం వచ్చాయి. మేక్రాన్ పార్టీ 20.04 శాతంతో సరిపెట్టుకుంది. జూలై 7న రెండో రౌండ్ పోలింగ్ ఉంటుంది. గత నెలలో ఈయూ ఎన్నికల్లో కూడా నేషనల్ ర్యాలీ పార్టీయే విజయం సాధించింది. -
G7 Summit 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు
జీ7 సమావేశం కోసం విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తోనూ మోదీ చర్చలు జరిపారు. ‘మా ఇద్దరి మధ్య ఏడాదికాలంలో జరిగిన నాలుగో భేటీ ఇది. అద్భుతంగా జరిగింది. ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్, హారిజాన్ 2047 సహా రక్షణ, అణు, అంతరిక్షం, సముద్రమార్గంలో వాణిజ్యం, విద్య, వాతావరణ మార్పులు, డిజిటల్ మౌలిక వసతులు, కనెక్టివిటీ, కృత్రిమ మేథ రంగాల్లో పరస్పర తోడ్పాటుపై చర్చలు జరిపాం. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలపై మరింత మక్కువ పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదీ మాట్లాడుకున్నాం’ అని మోదీ చెప్పారు. శుక్రవారం ఇటలీకి చేరుకున్నాక మోదీ తొలుత మేక్రాన్‌ను కలిశారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఒక అంతర్జాతీయ నేతతో మోదీ సమావేశంకావడం ఇదే తొలిసారి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్‌లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్‌లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్‌మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్‌మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్‌బాగ్ ప్యాలెస్‌కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నుంచి హాజరవుతున్న ఆరవ అధ్యక్షునిగా మాక్రాన్ నిలవనున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఆయన హాజరుకాలేనని వెల్లడించారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ఫ్రెంచ్ మాజీ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ 1976, 1998లో రెండుసార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో ఈ వేడుకలకు హాజరయ్యారు. STORY | French President Macron set to be Republic Day chief guest READ: https://t.co/P8euyRpHkB pic.twitter.com/cMuCijvqcl — Press Trust of India (@PTI_News) December 22, 2023 భారత్‌లో జరిగిన జీ-20 మీటింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ప్రధాని మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. మధ్యాహ్న భోజన సమావేశంలోనూ పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై పురోగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. గతేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలను ఆహ్వానిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022లో విదేశీ నేతలను ఆహ్వానించలేదు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
G20 Summit: బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ► ‘మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. ► జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ► శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ► వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ► జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ► వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ► డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ► వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
G20 Summit: 10న ప్రధానితో మాక్రాన్ భేటీ
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీకి హాజరవుతున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల10న ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. శిఖరాగ్రం ఆఖరి రోజైన ఆదివారం ఫ్రాన్సు అధ్యక్షుడు ప్రధానితో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా, ఇండోనేసియా అధ్యక్షుడు విడోడో, సౌదీ యువరాజు సల్మాన్తోనూ చర్చలు జరుపుతారు. -
నేటి నుంచి ఫ్రాన్స్‌లో... ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అధికారిక పర్యటన వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ కవాతులో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం పాల్గొననుంది. ప్రధాని అయ్యాక మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మోదీకి ఫ్రాన్స్ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులనూ మోదీ కలుస్తారు. అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. ‘ఇండియా–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆరంభమైన ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ‘ నేవీ వేరియంట్ 26 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఖరారుకావచ్చు’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. ఫ్రాన్స్ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్ ఎలీసెస్ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్ ఫైటర్జెట్లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి. తిరుగుప్రయాణంలో యూఏఈలో పర్యటన ఫ్రాన్స్ పర్యటన తర్వాత తిరుగుప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తో ఈ సందర్భంగా మోదీ భేటీ కానున్నారు. సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. ‘కాప్–28కు యూఏఈ, జీ20కి భారత్ సారథ్యం వహిస్తున్న ఈ తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరపనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు
ముంబై : గురువారం ముంబైలోని మహమ్మద్ అలీ రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పోస్టర్లు కలకలం రేపాయి. అలా రోడ్డుపై వందల సంఖ్యలో పోస్టర్లు దర్శనమివ్వటంతో పాదచారులు, వాహనదారులు ఆసక్తిగా వాటిని తిలకించారు. సమాచారం అందుకున్న ఫైధోనీ పోలీసులు రోడ్డు వద్దకు చేరుకుని పోస్టర్లను తీసివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( నా పిల్లలకు ఈ మాట చెప్పండి..) కాగా, గురువారం ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో ఓ దుండగుడు కత్తి దాడి జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనిపై ఇమాన్యుయేల్ స్పందిస్తూ.. దాన్ని మతోన్మాదుల దాడిగా పేర్కొన్నారు. ‘ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోస్టర్లు ముంబైలోని రోడ్డుమీద కనిపించటం చర్చనీయాంశంగా మారింది. -
ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ కు ఘన స్వాగతం
-
మాక్రన్‌కు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్‌కు రాష్ట్రపతి భవన్లో ఘనస్వాగతం లభించింది. నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు గౌరవవందనాలతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ మాక్రన్ దంపతులకు ఆత్మీయస్వాగతం పలికారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ, మాక్రన్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరగనున్నాయి. మాక్రన్ వెంట ఆయన భార్య బ్రిగిటె మేరీ, మంత్రులు వచ్చారు. -
ప్రధాని.. అధ్యక్షుడి మధ్య పోరు తప్పదా?
మాక్రాన్ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే ఫ్రాన్స్ అధ్యక్షుడికి ముందున్నది ముళ్లబాట పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయల్ మాక్రాన్ ఎన్నికలో ఎన్ని విశేషాలు చోటుచేసుకున్నాయో, మున్ముందు ఆయనకు అన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. 59 ఏళ్లలో దేశ పార్లమెంట్ (నేషనల్ అసంబ్లీ)లో ఒక్క సీటు కూడా లేకుండానే దేశానికి అధ్యక్షుడై ఎల్సీ ప్యాలెస్‌లోకి అడుగుపెడుతున్న తొలి వ్యక్తి మాక్రాన్. ఫ్రాన్స్ ఐదో రిపబ్లిక్ (గణతంత్ర) వ్యవస్థ అమల్లోకి వచ్చిన 1958, అక్టోబర్ 4వ తేదీ నాటి నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పార్టీకి చెందిన వ్యక్తి దేశాధ్యక్షుడు కావడం ఇదే మొదటిసారి. గతంలో సోషలిస్ట్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న మాక్రాన్ ‘ఎన్ మార్చే (ముందుకే)’ అన్న పార్టీని 2016లో స్థాపించి ఇప్పుడు ఆ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పోటీచేసి విజయం సాధించారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికల తర్వాతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్‌కు ఎన్నికైన వారిని డిప్యూటీలు అని పిలుస్తారు. డిప్యూటీలు మద్దతిచ్చే వ్యక్తినే ప్రధానమంత్రిగా దేశాధ్యక్షుడు నియమించాలి. ప్రధానిని నియమించడం కత్తిమీద సామే మాక్రాన్ కూడా వచ్చే నెలలో జరుగనున్న దేశ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ ప్రధానమంత్రిని నియమించాలి. ఇదే ఇప్పుడు ఆయన ముందున్న రెండో పెద్ద సవాల్. మొదటి సవాల్ కింద ఆయన దేశాధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థి లా పెన్‌తో తలపడి రెండోరౌండ్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఆయన దేశ ప్రధానమంత్రిని నియమించడం కత్తిమీద సాము లాంటిదే. వచ్చే ఎన్నికల్లో మాక్రాన్ పార్టీ ‘ఎన్ మార్చే’ పోటీ చేసినా ఆయన పార్టీకి 15 నుంచి 20 సీట్లకు మించి రావని తాజా ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. జాతీయ అసెంబ్లీగా వ్యవహరించే ఫ్రాన్స్ పార్లమెంట్లో మొత్తం 577 సీట్లు ఉన్నాయి. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొని వారి అభిప్రాయం మేరకే దేశ ప్రధాన మంత్రిని దేశాధ్యక్షుడు నియమించాలని దేశ ఐదో రిపబ్లిక్ రాజ్యాంగం సూచిస్తోంది. అందుకు భిన్నంగా దేశాధ్యక్షుడు వ్యవహరిస్తే ప్రధాన మంత్రిపై అవిశ్వాస తీర్మానంపెట్టి సదరు ప్రధానిని తీసివేసే హక్కు పార్లమెంట్ సభ్యులకు ఉంది. అమెరికా అధ్యక్ష తరహా కాదు ఫ్రాన్స్ పరిపాలనా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి తరహా లాంటిది కాదు, అలా అని భారత్ లాంటి పార్లమెంటరీ తరహా వ్యవస్థా కాదు. ఒకరకంగా సెమీ అధ్యక్ష పాలనావ్యవస్థ అనవచ్చు. భారత్ తరహాలో లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయి. లోక్‌సభకు ప్రత్యక్ష, రాజ్యసభకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభను సెనేట్ అని పిలుస్తారు. ప్రభుత్వానికి ప్రధానమంత్రి అధిపతి అయితే దేశానికి దేశాధ్యక్షుడు అధిపతి. భారత్ తరహాలో కాకుండా ఫ్రాన్స్ ప్రజలు 1962 నుంచి దేశాధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. రాజకీయానుభవం లేకపోయినా సరే దేశంలోని వివిధ స్థాయిల పాలనా వ్యవస్థల్లో ఎన్నికైన 500 మంది అభ్యర్థుల సంతకాలు సాధిస్తే ఎవరైనా దేశాధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అయితే విజయం సాధించాలంటే 50 శాతానికిపైగా ఓట్లు రావాల్సిందే. అలా రాలేదంటే ఎక్కువ ఓట్లతో ముందున్న ఇద్దరి మధ్య మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. వాటినే రెండో రౌండ్ ఎన్నికలంటారు. అంతకు ముందు లే పెన్ కంటే కేవలం మూడు శాతం ఓట్లు అధికంగా సాధించిన మాక్రాన్ రెండో రౌండ్ ఎన్నికల్లోనే 60 శాతానికిపైగా ఓట్లతో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏ పార్టీ నుంచైనా ప్రధానిని నియమించవచ్చు భారత్‌లో లాగా లోక్‌సభలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ నుంచే ప్రధాన మంత్రిని దేశాధ్యక్షుడు ఎంపిక చేయాలనే నిబంధనేమీ లేదు. అయితే ఆయనకు మెజారిటీ లోక్‌సభ సభ్యుల మద్దతు ఉండాలి. ఇక లోక్‌సభ సభ్యులైన డిప్యూటీలను కేబినెట్ మంత్రులుగా నియమించే అధికారాలు కూడా దేశాధ్యక్షుడికి ఉన్నాయి. కేబినెట్ సమావేశాలను కూడా ఆయనే నిర్వహిస్తారు. తద్వారా ప్రభుత్వ పాలనను తన చేతుల్లో ఉంచుకునే అవకాశం దేశాధ్యక్షుడికి ఉంది. శాసనాలను చేసే అధికారం మాత్రం ఆయనకు లేదు. వాటిని ఉభయసభలు ఆమోదించాల్సిందే. వాటిని తిరస్కరించే అధికారం కూడా ఆయనకు లేదు. అధ్యక్ష, పీఎంల మధ్య గొడవలు రావచ్చు ప్రధానమంత్రిగా ఎంపికైన పార్లమెంట్ సభ్యుడికి స్వతహాగా మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే దేశాధ్యక్షుడి సూచనలను గౌరవించాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అలాంటి సందర్భాల్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏర్పడితే పార్లమెంటును రద్దుచేసే అధికారం దేశాధ్యక్షుడికి ఉంది. సొంత పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీల నుంచి ప్రధానమంత్రి అయినవారు ఇప్పటికే ముగ్గురే ఉన్నారు. వారి హయాంలో విభేధాల వల్ల ప్రభుత్వాలు సక్రమంగా నడవలేదు. ఆరో రిపబ్లిక్ వ్యవస్థ అవసరం కావచ్చు ఇప్పుడు మాక్రాన్‌కు కూడా ఇతర పార్టీల నుంచి ప్రధానిని ఎంపిక చేసుకోవడం మినహా మరో గత్యంతంరం లేదు. ఇరువురి మధ్య అధికార గొడవలు వస్తే. ఐదో రిపబ్లిక్ వ్యవస్థను రద్దుచేసి ఆరో రిపబ్లిక్ వ్యవస్థను తీసుకరావాల్సి వస్తుంది. ఇప్పటికే జన సమూహాలపై టెర్రరిస్టు దాడులు, తీవ్ర నిరుద్యోగ సమస్య, స్తంభించిపోయిన ఆర్థికవ్యవస్థ, సామాజిక అస్థిర పరిస్థితులు, గ్రామీణ–పట్టణాల మధ్య పెరిగిపోయిన అంతరాలతో సతమతమవుతున్న ఫ్రాన్స్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. -
ఫ్రాన్స్ ఎన్నిక చెప్పేదేమిటి?
అందరి అంచనాలకూ తగ్గట్టే ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మధ్యస్థ మితవాద పక్షం ఎన్ మార్చ్ పార్టీ అభ్యర్థి ఇమానియెల్ మేక్రోన్ ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో 66.06 శాతం ఆయనకు లభిస్తే తీవ్ర మితవాద సిద్ధాంతంతో దూకుడుగా రంగం మీదికొచ్చిన లీపెన్‌కు 33.94 శాతం ఓట్లొచ్చాయి. ఫ్రాన్స్ పౌరులు లీ పెన్ ప్రవచించే తీవ్ర జాతీయవాదంవైపు మొగ్గు చూపుతారా లేక కొన్ని మార్పులతో ఇప్పుడున్న విధానాలనే కొనసాగిస్తే సరిపోతుందని వాదించే మేక్రోన్‌కు పట్టం గడతారా అన్న మీమాంస యూరప్ ఖండంలో మాత్రమే కాదు... ప్రపంచం మొత్తంలో ఏర్పడింది. అక్కడ తప్పటడుగు పడితే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా తీవ్రంగా ఉంటుందని అందరూ ఆందోళనపడ్డారు. అలా జరగనందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడో ఉన్న జపాన్ మొదలుకొని అన్ని ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు ఉత్సాహంతో ఉరకలెత్తడమే ఇందుకు తార్కాణం. లీపెన్ ఎన్నికైతే బ్రిటన్ తరహాలోనే ఫ్రాన్స్ కూడా యూరప్ యూని యన్(ఈయూ)నుంచి బయటికొచ్చేది. ఆ సంస్థ భవితవ్యం అయోమయంలో పడేది. దాని ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా ఉండేది. అమెరికాలో నిరుడు నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్–హిల్లరీల మధ్య సాగిన హోరాహోరీ పోరుతో ఈ ఎన్నికను చాలామంది పోల్చారు. ట్రంప్ మాదిరే లీపెన్ కూడా వలసలకు బద్ధ వ్యతిరేకి. ఉపాధిలో దేశ పౌరులకే తప్ప బయటివారికి ప్రాముఖ్యతనీయరాదనే జాతీయవాదంతోపాటు జనాన్ని ఆకర్షించే పథకాలు ప్రకటించడం వగైరాల్లో కూడా ఇద్దరికీ పోలిక ఉంది. ఎన్నికల వేళ హిల్లరీని బజారుకీడ్చి ఆమె విజయావకాశాలను దెబ్బతీసినట్టుగానే మేక్రోన్ గుట్టు రట్టు చేసి ఇంటి దారి పట్టించాలని రష్యా హ్యాకర్లు గట్టిగానే ప్రయత్నించారు. కానీ దాన్ని ఆయన అవలీలగా అధిగమించగలిగారు. అయితే నెగ్గాల్సిన మరో ప్రధాన పరీక్ష ఉంది. 577 మంది సభ్యులుండే పార్లమెంటుకు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీ నెగ్గాలి. అది జరిగితేనే తన విధానాలను అమలు చేయడానికి వీలవుతుంది. లేనట్టయితే అసాధ్యం. ఈ ఎన్నిక మెజారిటీ ప్రజలను ఏకం చేసిందని సంబరపడుతున్నవారున్నట్టే దీనిపై పెదవి విరుస్తున్నవారూ ఉన్నారు. ప్రాణాంతకమైన గుండెపోటును యూరప్ వెంట్రుకవాసిలో తప్పించుకున్న మాట నిజమే అయినా... ఆ ప్రమాదం సమసిపోలేదని విశ్లేషకుల వాదన. ఇందులో నిజముంది. లీ పెన్ ప్రచార సరళి ఎంత నిస్తేజంగా ఉన్నా ఆమె పార్టీకి కోటికి పైగా ఓట్లు లభించాయి. దేశ చరిత్రలో తీవ్ర మితవాద పక్షానికి ఈ స్థాయిలో ఓట్లు లభించడం ఇదే తొలిసారి. 2002లో ఆమె తండ్రి పోటీ చేసినప్పుడు ఇందులో సగం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. 2022 ఎన్నికల నాటికి ఆమె పార్టీ విజేత కాగలిగినా ఆశ్చర్యం లేదు. మరో ప్రమాదకరమైన ధోరణి కూడా ఈ ఎన్నికల్లో కనబడింది. పోలింగ్‌లో 74 శాతంమంది మాత్రమే పాలుపంచుకున్నారు. ఇది గత యాభైయ్యేళ్లలో అతి తక్కువ. ఎవరొచ్చినా ఒరిగేదేమీ లేదన్న నిర్లిప్తత ఓటర్లలో నెలకొని ఉండటమే ఇందుకు కారణం. వరస ఉగ్రవాద దాడుల తర్వాత ప్రకటించిన అత్యవసర పరిస్థితి దేశంలో ఇంకా కొనసాగుతోంది. ఆ భయం ఫ్రాన్స్‌ను వెన్నాడుతోంది. మరోపక్క దేశ ఆర్థిక వ్యవస్థ మన్ను తిన్న పాములా స్తంభించిపోయింది. ఉపాధి అవకాశాలు లేక యువత దశాబ్దాలుగా తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. పాలక పక్షాలుగా గుర్తింపు పొందిన మితవాద, వామపక్షాలు రెండూ చరిత్రలో తొలిసారి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారిని జనం విశ్వసించడం లేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. తీవ్ర మితవాద పక్షాన్ని ఎదుర్కొనే భారం రాజకీయంగా అనుభవంలేని మేక్రోన్ భుజస్కంధాలపై పడింది. ఈ ఎన్నికల్లో మేక్రోన్ పేద జనం బాధల గురించి, వాటినుంచి గట్టెక్కేందుకు తన దగ్గరున్న పథకాల గురించి మాట్లాడలేదు. ఆయనదంతా వ్యాపారవేత్తల భాష. స్వేచ్ఛా మార్కెట్ విధానాలకు ఆయన అను కూలం. సామాజిక సమస్యలపై వామపక్ష దృక్పథంతో వ్యవహరిస్తానని చెప్పినా, ఈయూను బలోపేతం చేయడమే ఆయన లక్ష్యం. ఆ విధానాల ఆచరణ తర్వాత అసలు కథ మొదలవుతుంది. జీడీపీలో ప్రస్తుతం 56 శాతంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాల వ్యయాన్ని 52 శాతానికి తగ్గిస్తానని మేక్రోన్ ఇప్పటికే ప్రకటించారు. ఆ పని చేయాలంటే పెన్షన్లపై కోత పెట్టాలి. విద్య, ప్రజారోగ్యం, పిల్లల ఉచిత సంర క్షణ వంటి అంశాలపై వ్యయం తగ్గించాలి. కార్మిక రంగ సంస్కరణలు తీసుకు రావాలి. వీటి అమలు అంత సులభమేం కాదు. నిజానికి సమస్య ఫ్రాన్స్‌ది కాదు. ఈయూ లాంఛనంగా ప్రారంభమైననాడు పెట్టుకున్న సమష్టి సౌభాగ్యం, రాజకీయ సమన్వయ సాధన అనే ద్విముఖ లక్ష్యాలను సాధించగలిగి ఉంటే ఫ్రాన్స్ మాత్రమే కాదు... అందులో భాగంగా ఉన్న ఏ దేశమూ సమస్యల్లో కూరుకుపోయేది కాదు. యూరప్ దేశాలమధ్య పరస్పర అవిశ్వాసం, ఆగ్రహం అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశాల మధ్య ఉండే వైవి ధ్యతను, వాటి ఆర్థిక వ్యవస్థల్లో ఉండే వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా అమల్లోకి తెచ్చిన ఉమ్మడి కరెన్సీ వ్యవస్థ–యూరో దీనంతటికీ మూలం. ఇటలీ, గ్రీస్, స్పెయిన్, బ్రిటన్‌లాంటి దేశాల్లో ప్రమాదకర ఛాయలు కనిపిస్తున్నా సరిదిద్దుకోవడానికి ఈయూ పెద్దలు ముందుకు రాలేదు. 2009లో అమెరికాలో నిరుద్యోగిత 10 శాతం ఉంటే దాన్ని ఇప్పుడు 5 శాతంకన్నా దిగువకు తీసుకు రాగలిగారు. యూరప్‌లో సైతం అప్పటికి నిరుద్యోగిత అదే స్థాయిలో ఉంది. కానీ అది ఆనాటినుంచీ పెరగడమే తప్ప తగ్గడం లేదు. వీటన్నిటి పర్యవసానంగానే యూరప్‌లో ఎక్కడికక్కడ తీవ్ర మితవాద పక్షాలు బలం పుంజుకుంటున్నాయి. బ్రిటన్ ఏకంగా ఈయూ నుంచే నిష్క్రమించింది. ఫ్రాన్స్‌లో ఉదారవాదం సాధిం చిన విజయాన్ని చూసి మురుస్తూ, తన కర్తవ్య నిర్వహణను మరిస్తే ఈయూ దుకాణం మూతబడే ప్రమాదం ఎంతో దూరంలో ఉండదు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నిక చాటుతున్న సత్యమిదే. -
బరాక్ ఒబామాకు బంపర్ ఆఫర్ !
-
భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్
-
భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్
చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం చండీగఢ్‌కు చేరుకున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటిస్తారు. చండీగఢ్‌లో ఆదివారం జరగనున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. -
ఈ ఏడాది బ్రిటన్‌లో పర్యటించనున్న మోదీ
న్యూయార్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది మరోసారి విదేశీ యాత్రకు వెళ్లనున్నారు. త్వరలో ఆయన బ్రిటన్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్‌తో న్యూయార్క్‌లో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ రావాలన్న కామెరూన్ ప్రతిపాదనకు మోదీ అంగీకారం తెలిపారు.అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ హోలాండెలతో కూడా మోదీ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సభ్య దేశాధినేతలకు ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా మోదీ సమావేశం అవుతారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పారిస్ లో ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ముష్కర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. పారిస్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉగ్రవాదుల ఘాతుక చర్యలతో భీతిల్లిన ఫ్రాన్స్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. తీవ్రవాదంపై జరిపే పోరులో ఫ్రాన్స్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్న ఆయన వ్యక్తం చేశారు. పారిస్ లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఫ్రాన్స్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి.