
ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పారిస్ లో ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ముష్కర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. పారిస్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
ఉగ్రవాదుల ఘాతుక చర్యలతో భీతిల్లిన ఫ్రాన్స్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. తీవ్రవాదంపై జరిపే పోరులో ఫ్రాన్స్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్న ఆయన వ్యక్తం చేశారు. పారిస్ లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఫ్రాన్స్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి.