francois hollande
-
నేనప్పుడు పదవిలోకి రాలేదు
ఐక్యరాజ్య సమితి: భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం కుదిరే సమయానికి తాను పదవిలోకి రాలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అన్నారు. రాఫెల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిందని, ఇది కేవలం వాణిజ్య సంబంధమే కాదని, వ్యూహాత్మకమైనది అని అన్నారు. ‘ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు నేను అధికారంలో లేను. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ఏం చెప్పారో నేనూ అదే చెప్పాలనుకునుకుంటున్నా’ అని మాక్రన్ అస్పష్ట సమాధానం ఇచ్చారు. ప్రతిదానిలో లాగుతున్నారు: వాద్రా నాలుగేళ్లుగా బీజేపీ నిరాధార ఆరోపణలతో తనపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదల, రాఫెల్ వివాదం..ఇలా ఎప్పుడు ఇరకాటంలో పడినా ప్రతిసారి అధికార పార్టీ తన పేరును తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. -
రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడి స్పందన
న్యూయార్క్ : రోజుకో మలుపు తిరుగుతున్న రాఫెల్ డీల్ వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ స్పందించారు. రాఫెల్ డీల్ వివాదంపై డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా... భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఈ వేల కోట్ల డీల్ జరిగేటప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు. యునిటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న సమయంలో ప్రెస్‌తో సమావేశమైన సమయంలో ఈ మేరకు స్పందించారు. మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పిన మాదిరి మోదీ ప్రభుత్వమే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్‌ను భారత భాగస్వామిగా చేర్చుకోవాలని ఫ్రెంచ్ ప్రభుత్వానికి లేదా రాఫెల్ తయారీదారి డసో ఏవియేషన్ సంస్థకు ప్రతిపాదించిందా? అని అధ్యక్షుడు మాక్రోన్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. వీరి ప్రశ్నపై స్పందించిన మాక్రోన్.. ‘ఏ ఆరోపణలను నేను ప్రత్యక్షంగా తిప్పికొట్టలేను. ఆ సమయంలో నేను ఇన్‌ఛార్జ్‌గా లేను. కానీ మేము చాలా స్పష్టమైన నిబంధనలు కలిగి ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన చర్చ. ఇది భారత్, ఫ్రాన్స్‌ల మిలటరీ, డిఫెన్స్‌ల సంకీర్ణ ఒప్పందం’ అని తెలిపారు. కాగా, గతేడాది మేలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రోన్ ఎన్నికయ్యారు. రాఫెల్ డీల్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రకటించారు. ఆ సమయంలో ఫ్రాంకోయిస్ హోలాండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ గత వారం పేల్చిన బాంబుతో, భారత్‌లో రాఫెల్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. కాగా, రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలాండ్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఫ్రెంచ్ ప్రభుత్వం, డసో కంపెనీ కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి, ఒక ప్రైవేట్ సంస్థను ఎలా ఎంపిక చేశారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది కూడా. -
‘రాఫెల్’ ఒప్పందం రద్దు ప్రశ్నేలేదు
న్యూఢిల్లీ/పారిస్: రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా, ‘రాఫెల్’ ఒప్పందం రద్దు ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే డసో ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్డీఎల్) ఒప్పందం విషయంలో భారత, ఫ్రెంచి ప్రభుత్వాలకు ఎటువంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని, జైట్లీ అబద్ధాలు మాని, నిజానిజాలు తేల్చేందుకు జేపీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఫెల్ ఒప్పందంపై అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ..ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ చేసిన పొంతనలేని ప్రకటనలే అనుమానాలకు తెరలేపాయన్నారు. ‘రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని డసోను భారత ప్రభుత్వమే కోరిందని రెండ్రోజుల క్రితం హోలండ్ ప్రకటించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం లాబీ చేసిందో లేదో తనకు తెలియదంటూ ఆయన మాటమార్చారు. హోలండ్ ప్రకటనలకు, రాహుల్ విమర్శలకు సంబంధం ఉంది. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో బాంబులు పేలనున్నాయంటూ ఆగస్టు 30నే రాహుల్ ట్వీట్ చేశారు. వారి అనుబంధం విషయంలో నా వద్ద ఆధారాలు లేనప్పటికీ, ఏదో లంకె ఉందనే అనుమానం మాత్రం ఉంది. హోలండ్ ముందుగా ఒక ప్రకటన, దానికి విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ఈ విషయం రాహుల్‌కు 20 రోజులకు ముందుగానే ఎలా తెలిసింది?’ అని జైట్లీ ప్రశ్నించారు. 2019 ఎన్నికల నేపథ్యంలో రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించగా..‘ఒప్పందం నుంచి వైదొలిగే ప్రశ్నేలేదు’ అని స్పష్టం చేశారు. హోలండ్ మొదటి ప్రకటనను ఫ్రెంచి ప్రభుత్వం, డసో ఏవియేషన్ సంస్థ ఇప్పటికే ఖండించాయని జైట్లీ తెలిపారు. కాగా డసోతో తమ కాంట్రాక్టు విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. అసత్యాలు మానండి: రాహుల్ రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ, జైట్లీ అబద్ధాలు చెప్పడం మానాలని రాహుల్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలని డిమాండ్ చేశారు. ‘తాను చెప్పిందే నిజమని వాదించగల పటిమ, నిజాలను అబద్ధాలుగా నమ్మించగల సామర్థ్యం జైట్లీ ప్రత్యేకత. ప్రధాని, రక్షణ మంత్రి అబద్ధాలు ఆపాలి’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రాఫెల్ వివరాల్ని అనిల్ అంబానీకి వెల్లడించి రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. ఫ్రాన్స్ ఆందోళన రాఫెల్ ఒప్పందంపై హోలండ్ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపడంపై ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపుతోందని భావిస్తోంది. ఫ్రాన్సు ఉప విదేశాంగ మంత్రి జీన్–బాప్టిస్ట్ లెమోయెన్ స్పందిస్తూ.. ‘హోలండ్ వ్యాఖ్యలు ఎవరికీ ఉపయోగకరం కాదు..ముఖ్యంగా ఫ్రాన్సుకు విదేశాలతో సంబంధాల విషయంలో ఇబ్బందికరంగా మారుతాయని అనుకుంటున్నా. పదవిలో లేని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని అన్నారు. -
ప్రధాని మోదీ సిగ్గుపడాలి: రాహుల్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ/పారిస్: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేశాయి. ఈ భారీ కాంట్రాక్ట్ విషయంలో కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్డీఎల్)ను చేర్చే విషయంలో తమ ప్రమేయం లేదని తెలిపింది. రాఫెల్ యుద్ధ విమానాలు తయారుచేసే డసో ఏవియేషన్ (ఫ్రెంచ్ కంపెనీ) కూడా వివాదం అవసరమే లేదని తన భారత భాగస్వామిని ఎన్నుకోవడం తమ సంస్థ తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. రాఫెల్, ఆర్డీఎల్ భాగస్వామ్య ఒప్పందంలో తమ ప్రమేయం లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ వివాదంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్.. కేంద్రంపై చేస్తున్న విమర్శల జడి కొనసాగుతోంది. మళ్లీ మళ్లీ అదే చెబుతున్నాం.. రూ.58వేల కోట్ల భారీ ఒప్పందంలో మేకిన్ ఇండియా భాగస్వామిగా భారత ప్రభుత్వం రిలయన్స్‌ను ప్రతిపాదించిందని హోలండ్ వ్యాఖ్యానించడం వివాదమైంది. ఈ వ్యాఖ్యలను శనివారం విడుదల చేసిన ప్రకటనలో రక్షణ శాఖ ఖండించింది. ‘ఆర్డీఎల్ను స్వదేశీ భాగస్వామిగా ఎంచుకోవడంలో డసో ఏవియేషన్‌కు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని గతంలోనే చెప్పాం. ఈ ఒప్పందంలో వివాదాలకు తావులేదు. తన ప్రమాణాలకు తగ్గట్లుగా ఆర్డీఎల్ ఉందా? లేదా? అని నిర్ధారించుకున్నాకే డసో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. విమానాల తయారీకోసం జాయింట్ వెంచర్‌కు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని ప్రకటనలో పేర్కొంది. ‘హోలండ్ ప్రకటన పూర్తిపాఠాన్ని సరిగ్గా చదవాల్సిన అవసరం ఉంది. మాజీ అధ్యక్షుడైన హోలండ్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని లేవనెత్తేందుకు ఫ్రాన్స్ మీడియా చేసి న ప్రయత్నమిది’ అని రక్షణ శాఖ పేర్కొంది. మేమే నిర్ణయించాం: డసో ఆర్డీఎల్ను భాగస్వామిగా తీసుకోవడం పూర్తిగా తమ సంస్థ నిర్ణయమేనని డసో ఏవియేషన్ స్పష్టం చేసింది. ‘2016 రక్షణరంగ సేకరణ నిబంధనలు (డీపీపీ) ప్రకారమే ఆర్డీఎల్తో ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వ విధానమైన మేకిన్ ఇండియాను అమలుచేసేందుకు స్థానిక కంపెనీతో ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌తో జట్టుకట్టాం. ఇది పూర్తిగా డసో ఏవియేషన్ నిర్ణయమే’ అని ఆ సంస్థ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. డసో, ఆర్డీఎల్ సంయుక్తంగా నాగ్‌పూర్‌లో ఫాల్కన్, రాఫెల్ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నాయని వెల్లడించింది. అయితే డసో, ఆర్డీఎల్ భాగస్వామ్యంలో తమ పాత్ర ఏమీ లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ విధానాల ప్రకారం ఫ్రెంచ్ కంపెనీలు విదేశాల్లో తమ భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛను కల్పించామని పేర్కొంది. భారత ప్రభుత్వంతో పలు రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు పెట్టామని.. ప్రతిచోటా భారత నిబంధనలకు అనుగుణంగానే అక్కడి కంపెనీల సామర్థ్యాన్ని సమీక్షించాకే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. నువ్వంటే నువ్వే! రాఫెల్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శల జోరు పెంచారు. మోదీ, అంబానీ సంయుక్తంగా భద్రతా బలగాలపై రూ.1.3లక్షల కోట్ల సర్జికల్ స్ట్రైక్ చేశారని ఆరోపించారు. హోలండ్ ప్రకటనను ఆధారంగా చేసుకుని.. ‘అమరులైన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవ పరిచారు. ప్రధాని సిగ్గుపడాలి, భారతీయతను మోసం చేశారు’ అని రాహుల్ విమర్శించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఉందనేది స్పష్టమైంది. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. హోలండ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ బహిరంగ ప్రకటన చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ సరైన సమాచారం లేకుండా అవినీతి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. యూపీఏ హయాంలో ముడుపులు ఆశించే చర్చలు జరిపినా.. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. డసో, ఆర్డీఎల్మధ్య 2012లోనే ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్, చైనాలు ఆడించినట్లుగా రాహుల్ ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో రాఫెల్ వివాదంపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తను అరెస్టుచేస్తున్న దృశ్యం -
‘మోదీకి అంబానీ బ్రోకర్’
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తాజాగా నిజమయ్యాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. రాఫెల్ స్కామ్ జరిగింది నిజమని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. రాఫెల్ డీల్‌తో నాలుగేళ్లలో అంబానీకి లక్ష కోట్ల లబ్ధి జరుగుతందన్నారు. లక్షల కోట్ల రాఫెల్ డీల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వెంట ఒక్క మంత్రి లేరని, కానీ అంబానీ మాత్రం ఉన్నారని ఎద్దేవ చేశారు. అప్పటి రక్షణ మంత్రి పారికర్‌కు కూడా తెలియకుండా, ప్రధానే నేరుగా ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్నించారు. మోదీ ఒత్తిడితోనే అంగీకరించామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి కామెంట్స్‌పై బీజేపీ ఏం చెబుతుందని ప్రశ్నించారు. రాఫెల్‌తో మోదీ పతనం ఈ ఒప్పందంపై మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్‌లు పార్లమెంట్లో అబద్దం చెప్పారని మండిపడ్డారు. జాతికి అబద్దం చెప్పినందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పతనం ఈ స్కాంతో ప్రారంభమైందన్నారు. దేశానికి సంబంధించిన డీల్‌ను మరో దేశ ప్రభుత్వం ఖండించడం దేశ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. నోరు తెరిస్తే బయటపడతాననే ప్రధాని రాఫెల్‌పై మాట్లాడటం లేదని, ఆయన నాటకం తేలిపోయిందని విమర్శించారు. మోదీకి జైట్లీ లాయల్ లాయర్ నరేంద్ర మోదీ క్రోనీ క్యాపిటలిజంతో కావల్సిన వారికి వేల కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మోదీకి లాయల్ లాయరని అంతేకాని దేశానికి కాదన్నారు. ఈ డీల్ పారదర్శికంగా ఉండాలన్నదే కాంగ్రెస్ వాదన అని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఈఎల్కు కాకుండా అంబానీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఏ రక్షణ ఒప్పందంలో కూడా హెచ్ఈఎల్కే నాటి ప్రభుత్వాలు భాగస్వామ్యం కల్పించాయన్నారు. నిజాలు ఆపలేరని, రాఫెల్లో జరిగిన అవినీతిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. -
మోదీ మౌనం వీడాలి : శివసేన
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా రాఫెల్ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీపై వస్తున్న ఆరోపణలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ మంత్రి కానీ సమాధానం చెప్పరని.. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే సమాధానం చెప్పాల్సిన అవసరమ ఉందని రౌత్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు కాకపోయిన దేశ ప్రజల కోసమైన ఆయన మౌనం వీడి, ఆరోపణలపై స్పందించాలని ఆయన కోరారు. 25 ఏళ్ల క్రితం జరిగిన బోఫోర్స్ కుంభకోణమే మరోసారి భారత రాజకీయాలను పట్టిపీడిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా హోలెండ్ ప్రకటనతో రాఫెల్ ఒప్పందంపై దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం చేలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. -
రాఫెల్ డీల్ : రగులుతున్న రగడ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే తాజా వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. హోలెండ్ ప్రకటనతో తమ వాదనే నిజమని తేలిందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన దాడిని ఉధృతం చేశారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఎంపిక భారత ప్రభుత్వానిదేనని హోలెండ్ స్పష్టం చేయడంతో భారత ప్రధాని అవినీతిపరుడని తేలిపోయిందంటూ రాహుల్ ధ్వజమెత్తారు. ఈ స్కాం ద్వారా భారీ అవినీతికి పాల్పడి దేశానికి కాపలాదారుడుగా ఉంటానన్న మోదీ దొంగలా (దేశ్ కా చౌకీదార్ చోర్ హై) మారిపోయారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనం వీడడం లేదని ప్రశ్నించారు. హోలెండ్ ప్రకటన నిజమని అంగీకరించాలి లేదా ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడి మాటలు అబద్ధమని అయినా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అనిల్ అంబానీకి మేలు చేయడంకోసమే ప్రధాని మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే మోదీ తెరవెనుక రాఫెల్ డీల్ మార్చారన్నారు. మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గానీ, ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌గానీ ఈ డీల్‌పై సంతకాలు చేయలేదని స్వయంగా మోదీనే సంతకాలు చేశారని వెల్లడించారు. అలాగే ఈ డీల్ గురించి తనకు తెలియదని పారికర్ చెప్పారంటూ.. మరి ఆయన గోవా ఫిష్ మార్కెట్లో చేపలు కొంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. రాఫెల్ స్కాంపై ప్రధాని మోడీ మౌనం వీడాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన విషయాలు అప్పటి దేశ రక్షణ శాఖ మంత్రి పారికర్‌కి తెలియదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఈ కుంభకోణంలో అన్న విషయాలు తెలుసని ఆయన ఆరోపించారు. ఒప్పంద సమయంలో కార్యదర్శులు, మంత్రులు ఎవరూ లేరనీ, అనిల్ అంబానీ మాత్రమే ఉన్నారని తెలిపారు. తనకు కావాల్సిన వారికి బెనిఫిట్ చేయటం కూడా అవినీతే అని జైపాల్ రెడ్డి విమర్శించారు. నా ప్రకటనకు కట్టుబడి ఉన్నా: హోలెండ్ రాఫెల్ ఒప్పందం విషయంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హలెండ్ ప్రకటించారు. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని, అందువల్లే గత్యంతరం లేక తాము ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని హోలెండ్ స్పష్టం చేయడం గమనార్హం. -
రాఫెల్ వివాదంలో మరో మలుపు
-
రాఫెల్ వివాదంలో ఎన్ని మలుపులో!
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌తో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత రెండేళ్లకు పైగా సాగుతున్న వివాదంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే ఆజ్యం పోశారు. భారత భాగస్వామ్య కంపెనీగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంలో తమ ప్రమేయం లేదని, ఆ కంపెనీ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని హొలాండ్ శుక్రవారం బాంబు పేల్చిన విషయం తెల్సిందే. యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం భారత్‌లోని 72 కంపెనీల్లో ఏ కంపెనీనైనా భాగస్వామి కంపెనీగా ఎంపిక చేసుకొనే అవకాశం డసాల్ట్ కంపెనీకి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం సూచించిన రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోక తప్పలేదని కూడా ఆయన వివరించారు. రిలయెన్స్ కంపెనీ ఎంపికలో తమ ప్రమేయం లేదని, భారత్‌లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే డసాల్ట్ కంపెనీ ఇష్టమని, ఈ మేరకు ఒప్పందంలో కూడా వెసులుబాటుందని భారత ప్రభుత్వ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ వస్తోన్న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వారం అంటే వారం క్రితమే మళ్లీ ఇదే పాట పాడారు. ‘రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో డసాల్ట్ కంపెనీ భారత దేశ భాగస్వామ్య కంపెనీ ఏదో కూడా నాకు తెలియదు. దానికంటూ ఓ ప్రత్యేకమైన నిబంధనావళి ఉంటుంది. సామర్థ్యం కలిగిన కంపెనీల్లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది డసాల్ట్ కంపెనీ ఇష్టం. నేను ఈ విషయంలో ఫలానా కంపెనీని ఎంపిక చేయాల్సిందిగా సూచించలేను. ఆమోదించలేను. అలా అని తిరస్కరించనూ లేను’ అంటూ సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ అత్యంత గమనార్హం. ఫ్రాంకోయిస్ హొలాండ్ శుక్రవారం వెల్లడించిన ఈ తాజా అంశాలపై ఇటు నిర్మలా సీతారామన్‌గానీ అటు ప్రధాని కార్యాలయంగానీ స్పందించలేదు. ‘ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాత్రం ముక్తిసరిగా స్పందించారు. హొలాండ్ వ్యాఖ్యలను గుడ్డిగా ఖండించడం కుదరదు. ఎందుకంటే ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఈ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకున్నారు. ఎందుకీ బాంబు పేల్చారు? ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హొలాండే జీవిత భాగస్వామియే కాకుండా నిర్మాత కూడా అయిన అందాల తార ఫ్రెంచి నటి జూలి గయెత్‌తో అంబానీ గ్రూప్ ‘రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ ఫ్రెంచ్‌లో ఓ సినిమా తీసేందుకు చర్చలు జరిపింది. 2016, జనవరి 24వ తేదీన ఈ మేరకు జూలి గయెత్‌కు చెందిన ‘రోగ్ ఇంటర్నేషనల్’ సంస్థతో రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే, 2016, జనవరి 26వ తేదీన భారత్‌తో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై హొలాండే సంతకం చేశారు. ఇప్పుడు ఈ అంశం ఫ్రెంచ్ రాజకీయాలను వేడిక్కించింది. జూలి గయెత్‌తో సినిమా ఒప్పందం కుదుర్చుకున్నందునే రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని హొలాండ్ ఎంపిక చేశారంటూ ఫ్రెంచ్ మీడియాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందనే విషయాన్ని ఆయన వెల్లడించాల్సి వచ్చింది. ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వరంగ సంస్థ ‘హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్’ను సూచించింది. మోదీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారింది. 28వేల కోట్ల రూపాయల ఒప్పందం కాస్త 51 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017, అక్టోబర్ నెలలో యుద్ధ విమానాల ప్రాజెక్ట్‌ను సంయక్తంగా చేపడుతున్నామని డసాల్ట్, రిలయెన్స్ కంపెనీలు సంయుక్త ప్రకటన చేశాయి. అదే నెలలో నాగపూర్‌లో ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫోరెన్సీ పార్లీలు పాల్గొన్నారు. అయినా రిలయెన్స్ వ్యవహారం మన నిర్మలా సీతారామన్‌కు తెలియదట. ఆమెను పిలవనందుకు అలిగి అలా చెబుతున్నారని అనుకోవాలా!! -
రాఫెల్‌కు ‘రిలయన్స్’ భారత్ ఎంపికే
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌కు ఇండియాలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ బయటపెట్టారు. ఫ్రెంచి మీడియాతో హోలాండ్ మాట్లాడుతూ ‘డసాల్ట్ ఏవియేషన్‌కు భారత్‌లో భాగస్వామిగా అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసింది. మా ప్రమేయం ఏమీ లేదు. ఎంచుకోవడానికి మాకు మరో కంపెనీ కూడా లేదు. భారత్ నిర్ణయించిన భాగస్వామినే మేం అంగీకరించి చర్చలు ప్రారంభించాం’ అని తెలిపారు. దీంతో రాఫెల్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, హోలాండ్ వెల్లడించిన విషయాలకు పొంతన లేకుండా పోయింది. 2015 ఏప్రిల్‌లో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో చర్చల తర్వాత 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నట్లు మోదీ చెప్పారు. ప్రాణమిత్రుడి కోసమే ఈ కుట్ర: కాంగ్రెస్ రాఫెల్ విషయంలో హోలాండ్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. ప్రాణ స్నేహితుడికి లాభం చేకూర్చేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం కుట్ర, దగాకు పాల్పడిందనీ, ఇప్పుడు హోలాండ్ మాటలతో ఆ విషయం బట్టబయలైందని విమర్శించింది. ‘మోదీ భారత్‌ను వెన్నుపోటు పొడిచారు. మోదీ రహస్యంగా, వ్యక్తిగతంగా చర్చలు జరిపి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మార్చారు. దివాలా తీసిన, రక్షణ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రాజెక్టును మోదీనే∙ఇచ్చినట్లు ఇప్పుడందరికీ తెలిసింది. మన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవపరిచారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ను కాదని 30 వేల కోట్ల ప్రాజెక్టును ప్రధాని తన స్నేహితుడి కంపెనీకి కట్టబెట్టడంలో ఉన్న మోసం, కుట్ర, దగా బయటపడింది’ అని అన్నారు. కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ ‘ఎన్డీయే కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో మనకు విమానాలు రాలేదు. అబద్ధాలు మాత్రమే వచ్చాయి. హోలాండ్ చెప్పిన వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఏ కొత్త అబద్ధం చెబుతారో?’ అని అన్నారు. కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ట్వీట్ చేస్తూ 2012లో తాము ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లకే కొనేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ 2015కు ఆ ధర రూ. 1,670 కోట్లకు ఎలా పెరిగిందో కూడా హోలాండ్ చెప్పాలని కోరారు. కీలక వాస్తవాలను దాచిపెట్టి దేశ భద్రతను మోదీ ప్రమాదంలో పడేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మాట్లడుతూ రాఫెల్ ఒప్పందం పెద్ద కుంభకోణమనీ, మోదీ ప్రభుత్వం అబద్ధాలతో భారతీయులను తప్పుదోవ పట్టించిందన్నారు. -
రఫెల్ డీల్: బాంబు పేల్చిన హోలాండే
రఫెల్ డీల్‌లో అనిల్ అంబానీ కంపెనీని ఎంచుకున్నది డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీయేనని నరేంద్ర మోదీ సర్కార్ పదే పదే చెబుతుండగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే బాంబు పేల్చారు. రాఫెల్ జెట్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియన్ పార్టనర్‌గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందంటూ స్థానిక మీడియాపార్ట్ ఒక వ్యాసం ప్రచురించింది. ఇందులో ఈ డీల్ సందర్భంగా భాగస్వామి ఎంపికలో తమ ప్రభుత్వ పాత్ర ఏమీలేదని హోలాండే స్పష్టం చేసినట్టుగా నివేదించింది. సర్వీస్ ప్రొవైడర్‌గా అనిల్ అంబానీ కంపెనీ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని డస్సాల్ట్ కంపెనీ ఎంచుకోలేదని పునరుద్ఘాటించినట్టు తెలిపింది. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నారు. రఫెల్ ఒప్పందం నుండి హెచ్ఎఎల్ను తొలగించి, అంబానీకి కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఇవి తప్పుడు ఆరోపణలంటూ ఈ విమర్శలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్‌గా అంబానీ కంపెనీని డస్సాల్ట్ కంపెనీయే ఎంచుకుందనీ, అలాగే రఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని సీతారామన్ వాదిస్తున్నారు. కాగా 2016లో భారత ప్రభుత్వం, ప్రాన్స్ ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు హెచ్‌ఏల్‌ను తొలగించారు.. ఎవరు అంబానీకి అప్పగించారు అనేది కీలక ప్రశ్నగా మారింది. హోలాండ్ వ్యాఖ్యలు నిజమని తేలితే మోదీ సర్కార్ ఇరుకు పడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామంపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు ఈ వ్యవహారంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. అటు ఈ అంశంపై స్పందించేందుకు న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ నిరాకరించింది. -
వేసవిలోగా ఐసిస్ పని ఖతం!
పారిస్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి మొసుల్ను వేసవిలోగా విడిపించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షడు ఫ్రాంకోయిస్ హొలండే అన్నారు. ఇరాకీ సైన్యం, అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ఇస్లామిక్ స్టేట్‌కు పట్టున్న మోసుల్‌ను స్వాధీనం చేసుకోవడానికి చేపడుతున్న ఆపరేషన్ గురించి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాకీ సేనల సహకారంతో సంకీర్ణ బలగాలు చేపడుతున్న ఆపరేషన్‌లో చాలా ప్రాంతాలు ఇస్లామిక్ స్టేట్ నుంచి విముక్తి పొందాయని హొలండె స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ వెనుకడుగు వేసిందని.. అయితే తమ లక్ష్యం మోసుల్ నుంచి వారిని తరిమికొట్టడం అన్నారు. ఇది వేసవిలోపు సాధ్యమౌతుందని భావిస్తున్నట్లు హొలండె తెలిపారు. ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు చేపడుతున్న దాడుల్లో ఫ్రాన్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
'యూరప్ లక్ష్యంగా తీవ్రవాదుల దాడులు'
పారిస్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదుల ఆత్మాహుతి దాడులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే మంగళవారం స్పందించారు. బెల్జియం మాత్రమే కాదు.. యూరప్ లక్ష్యంగా తీవ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని హాలండే పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదుల దాడులతో బ్రసెల్స్ అస్తవ్యస్థమైంది. ఈ దాడులపై ఒక్క యూరప్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. నిన్న ఫ్రాన్స్, నేడు బెల్జియంపై దాడులు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సమిష్టిగా తీవ్రవాదంపై పోరాడాల్సి ఉందని సూచించారు. ఈ బాంబు దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం పోర్టులు, స్టేషన్లు, విమానశ్రయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను బలోపేతం చేసినట్టు తెలిపారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 28 మంది దుర్మరణం చెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఒకింత అనుమానాలకు తావిస్తోంది. కాగా, నవంబర్‌లో ప్యారిస్ లో తీవ్రవాదులు జరిపిన మారణహోమంలో 130 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. -
మోదీ ఆలింగనంపై విపరీతార్థాలు
హైదరాబాద్: ప్రముఖులు కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ఆలింగనం చేసుకోవడంపై ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను మోదీ హత్తుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు చేసిన విపరీతార్థాలు, వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో చిలువలు పలువలుగా చూపించి హల్ చల్ చేసే ప్రయత్నం చేసింది. సాధారణంగా చిన్నవ్యక్తి కావొచ్చు.. పెద్ద వ్యక్తి కావచ్చు.. చిరుద్యోగి కావొచ్చి.. పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగి కావొచ్చు.. గల్లీ నాయకుడు కావొచ్చు.. ప్రపంచ నేత అయ్యుండొచ్చు.. వీళ్లలో ఎవరూ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లినా, మోదీ వారిని కలిసేందుకు వెళ్లినా అక్కడ జరిగే మొట్టమొదటి పని ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా వాత్సల్యంతో పాటు సందర్భానుసారం అర్థం ఉంటుంది. ఒకరికొకరం భరోసా అని చెప్పుకోవడం కూడా దాని ఉద్దేశం అయి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ఇమిడి ఉన్న ఈ అంశాన్ని పెద్దగా బయటకు కనిపించకపోయినా చాలామంది పాటిస్తూనే ఉంటారు. అయితే, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ కాస్త వక్రీకరించిన రీతిలో వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో ఒక కథనాన్ని వెలువరించింది. మోదీ అభ్యంతరకరంగా అనిపించేలా ఏ నేతను వదిలిపెట్టకుండా అందరినీ హగ్ చేసుకుంటున్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఇది తన సొంత ఉద్దేశం కాదని చెప్పేందుకు... మోదీ ఇతర దేశాల నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలపై కొందరు వ్యక్తుల నెగెటివ్ స్పందనను జత చేసి ట్యాగ్స్ ఆ కథనానికి తగిలించింది. ముఖ్యంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయను ఆలింగనం చేసుకున్నప్పటి ఫొటోలను ఉద్దేశిస్తూ కొందరు ట్విట్టర్లో చేసిన కామెంట్లను ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. అందులో మోదీ ఆలింగనం చేసుకున్న విధానం ఎబ్బెట్టుగా ఉందన్నారు.. దీంతో హోలాండే తప్పించుకునేందుకు వెనక్కి తిరిగారు కానీ... అంటూ రాశారు. మరో ఫొటోలో మోదీ, హోలాండే గుర్రం ఎక్కి ఉన్నట్లుగా ఒక ఫొటో చూపిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ హోలాండ్ పానిపట్‌కు వెళ్లే మార్గంలో... అని సోషల్ మీడియాలో ఒకరిద్దరి కామెంట్స్ ఆధారంగా కథనం అల్లేశారు. హోలాండే వెనుక భాగంలో మోదీ ఉన్న ఫోటోను టైటానిక్ లో హీరో హీరోయిన్ ఫొటోతో పోల్చారు. షిప్ లేకుండా నేలపై టైటానిక్ చిత్రంలోని ఫేమస్ సీన్ చూపించిన ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరే.. మరో ఫొటోను చూపిస్తూ.. ఇంత దగ్గరిగానా ఇక చాలు.... అంటూ కామెంట్స్ పోస్టు చేశారు. మరొకరు మాత్రం ఆలింగనం అనేది ఫ్రెంచ్ సంస్కృతి కాదని మోదీకి ఎందుకు తెలియజేయలేదు.. అది కూడా వెనుక నుంచి.. వెనుక నుంచి హోలాండ్ను హగ్ చేసుకోవడం ఏవగింపుగా అనిపించడం లేదా అంటూ మరో వ్యక్తి చేసిన ట్వీట్‌ను అందులో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆయా నాయకులను ఆలింగనం చేసుకున్న ఫొటోలను పెట్టారు. -
హోలాండ్ తో ఐశ్వర్యరాయ్ లంచ్
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ గౌరవార్ధం భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి రిచియర్ మంగళవారం ఇచ్చిన మధ్యాహ్న విందులో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపురంగు బెనారస్ పట్టుచీరలో భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఐశ్వర్య కనిపించారు. ఒకే టేబుల్ వద్ద కూర్చుని హోలాండ్, ఐశ్వర్యలు కాసేపు సినిమాల గురించి, కేన్స్ ఫెస్టివల్ గురించి ముచ్చటించారు. ఐశ్వర్యకు ఫ్రాన్స్‌తో అనుబంధం ఉంది. అక్కడ జరిగే కేన్స్ ఫెస్టివల్లో ఆమె క్రమం తప్పకుండా పాల్గొంటారు. అదీకాక, తమ దేశ రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్’తో ఫ్రాన్స్ ఐశ్వర్యను గౌరవించింది. -
'మమ్మల్ని భయపెట్టలేరు'
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే మంగళవారం వేడుకల అనంతరం ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో భారత్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. విమానం ఎక్కేముందు విలేకరులతో మాట్లాడిన హోలాండే.. ఫ్రాన్స్, భారత్ లు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు నిర్వచనాలుగా నిలుస్తాయని, అందుకే ఈ రెండు దేశాలపై ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో వెనకడుగువేయబోమని తేల్చిచెప్పారు.'మేం దేనికీ భయపడం, మమ్మల్నెవ్వరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల పీచమణిచే విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు' అని హోలాండే ఉద్ఘాటించారు. ఉదయం రాజ్ పథ్ లో జరిగిన గణతంత్రవేడుకల్లో విశిష్టఅతిథిగా పాల్గొన్న హోలాండే.. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన తేనీటి విందును స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. పలువురితో కరచాలనం చేస్తూ హుషారుగా గడిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ ఎట్ హోమ్ కు హాజరయ్యారు. తన మూడు రోజుల భారత పర్యటనలో హోలాండే.. చండీగఢ్ లో నిర్వహించిన వాణిజ్య సదస్సు భారత ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఉభయదేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థల అధిపతులు హాజరయ్యారు. చండీగఢ్‌లోని రాక్‌గార్డెన్, క్యాపిటల్ కాంప్లెక్స్ ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలను కూడా హోలాండే సందర్శించారు. రెండో రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. -
భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్
-
భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్
చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం చండీగఢ్‌కు చేరుకున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటిస్తారు. చండీగఢ్‌లో ఆదివారం జరగనున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. -
వాతావరణ మార్పుల ముసాయిదాపై సంతృప్తి
తాము సూచించిన అంశాలకు చోటు దక్కిందన్న భారత ప్రతినిధి లీ బోర్గెట్ (ఫ్రాన్స్): వాతావరణ మార్పుల ఒప్పందం తొలి ముసాయిదాపై భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది. తాము సూచించిన అన్ని అంశాలకు చోటు దొరికిందని, ఒప్పందం దిశగా ముందడుగు పడిందని పేర్కొంది. వాతావరణ మార్పుల అంశంపై ఫ్రాన్స్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందానికి సంబంధించి ఐదు పేజీల ముసాయిదా విడుదల చేశారు. దీనిపట్ల సదస్సులో భారత ప్రతినిధి అజయ్ మాధుర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇంకా దాదాపు 250 అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. వీటిపై వీలైనంత త్వరగా ముందుకు వెళ్లాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఒక ఒప్పందానికి వచ్చేందుకు భారత్ కృషి చేస్తోంది’ అని మాధుర్ పేర్కొన్నారు. ముసాయిదాను 195 దేశాలకు గాను 184 దేశాలు ఆమోదించాయి. సిరియా, ఉత్తర కొరియా తదితరాలు ఆమోదించాల్సి ఉంది. -
ఉగ్రవాదాన్ని ఉరితీసేందుకు..!
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసే దిశగా అడుగులు ప్రారంభమవుతున్నాయి. ఉగ్రవాదులు చేసిన గాయంతో మూలుగుతున్న ఫ్రాన్స్.. వైట్ హౌస్‌పై దాడి చేస్తామని ఐఎస్ హెచ్చరించడంతో తీవ్ర కోపాగ్నిలో ఉన్న అమెరికా ఒక వేదికపైకి రానున్నాయి. త్వరలో వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే భేటీ అవనున్నారు. హోలాండేను వైట్ హౌస్ కు రావాలని ఒబామానే స్వయంగా ఆహ్వానించారు. వారి భేటీలో ప్రధానంగా ఇస్లామిక్ స్టేట్ తోపాటు ఇతర ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలో అనే అంశంతోపాటు పారిస్ లో జరిగిన దాడులకు సంబంధించి ఫ్రాన్స్ జరుపుతున్న దర్యాప్తునకు అమెరికా సహాయం చేయాలనే అంశాన్ని కూడా చర్చించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరుకానున్న ఈ కార్యక్రమం వౌట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులు రాత్రి 10 గంటల ప్రాంతంలో జరగనుంది. -
అక్కడ సిరియా ఉగ్రవాది పాస్ పోర్ట్!
పారిస్/కైరో: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఫుట్‌బాల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ ఉగ్రవాది మృతదేహం వద్ద సిరియా దేశస్థుడి పాస్‌పోర్టు లభ్యమైంది. ఉగ్రదాడులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యుద్దానికి వచ్చినట్లయితే తగిన విధంగా స్పందించే వాళ్లమంటూ ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల టార్గెట్ జాబితాలో ఫ్రాన్స్ మిత్ర దేశాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ప్రమాదకరమైన బెల్టు బాంబులు, ఏకే 47 తుపాకులు, ఇతర పేలుడు సామాగ్రితో పకడ్బందీగా రాజధాని ఫ్రాన్స్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడులను యుద్ద చర్యలుగా పరిగణిస్తున్నట్లు దేశ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలాండే పేర్కొనడంతో తన కార్యకలాపాలు కొనసాగిస్తామని తీవ్రవాద సంస్థ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లు, ఆత్మాహుతి బాంబు పేలుళ్ల ఘటనలో 127 మందిగా పైగా మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే. -
'మా దేశంపై యుద్దానికి దిగారు'
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడులను యుద్దానికి తెగబడ్డ చర్యలుగా పరిగణిస్తున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. ఉగ్రవాదుల చర్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. పారిస్ నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఐఎస్ఎస్ జరిపిన దాడులను స్వేచ్ఛాయుత దేశమైన ఫ్రాన్స్ పై ఉగ్రవాదులు చేసిన యుద్ద చర్యలుగా ఆయన అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలో మిత్రపక్షంగా ఉంటూ సిరియా, ఇరాక్ దేశాల్లో చొరబడ్డ ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై వాయు బలగాల ద్వారా దాడులు జరుపుతోంది. ఈ నెల చివర్లో ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో ఉగ్రదాడులపై హై అలర్ట్ ప్రకటించనున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. 2004లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 191 మందిని బలిగొన్న ఘటన తర్వాత యూరప్‌లో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటన ఇది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్ల ఘటనలో సుమారు 120 మంది మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే. -
పురస్కారం-తిరస్కారం... ఫ్రాన్స్‌లో దుమారం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్కు రోజులు బాగులేవు. ఈమధ్యే పారిస్‌ను అల్లకల్లోలం చేసిన ఉగ్రవాద దాడులు కంటిమీద కునుకులేకుండా చేస్తే అంతకన్నా ముందు కొత్త సంవత్సరం ప్రారంభం లో ప్రకటించిన దేశ అత్యున్నత పురస్కారం ప్రభుత్వాన్ని నగుబాటు పాలు చేసింది. ‘క్యాపిటల్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిరుడు వెలువరించిన గ్రంథం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలనుంచి, నిపుణుల నుంచి విశేష ప్రశంసలు పొందిన ఫ్రాన్స్ ఆర్థికవేత్త థామస్ పికెటీకి హొలాండ్ ప్రభుత్వం జనవరి 1న ‘లెజియన్ డి ఆనర్’ ప్రకటిం చింది. దాన్ని ఆయన నిరాకరిస్తారని ప్రభుత్వం ఊహించలేదు. సోషలిస్టు భావాలకు దగ్గరగా ఉండే థామస్ సోషలిస్టు ప్రభుత్వాన్ని ఇలా ఇరకా టంలో పెడతారని అనుకోలేదు. ‘లెజియన్ డి ఆనర్’ పౌర రంగంలో గానీ, సైనిక రంగంలోగానీ విశిష్ట సేవలు అందించినవారికిచ్చే అత్యుత్తమ పురస్కారం. మన ‘భారతరత్న’తో పోల్చదగ్గ ఆ అవార్డును 1802లో నెపోలియన్ నెలకొల్పాడు. దీన్నందుకోవడానికి ఏటా ఎందరెందరో అర్రులు చాస్తారు. ఇంతకూ థామస్ రాసిన గ్రంథంలో ఏముంది? సమాజంలో ఆదా యం అందరికీ సమంగా ఎందుకుండదు...పెట్టుబడిదారీ విధానంలో కేవలం అత్యల్ప సంఖ్యాకులు మాత్రమే స్టాక్ మార్కెట్లలోనైనా, రియల్ ఎస్టేట్లోనైనా ఎందుకు ఆధిపత్య స్థానంలో ఉంటారు... మిగిలినవారం తా ఎందుకు విఫలమవుతారు...దాన్లోని కిటుకేమిటి అనే అంశాలను థామస్ చర్చించారు. సంపద పునఃపంపిణీ జరగాల్సిన ఆవశ్యకత గురిం చి వివరించారు. అది జరిగినప్పుడే కొందరికైనా పెట్టుబడి అందుబాటు లోకొచ్చి వారు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందని థామస్ సూత్రీకరించారు. థామస్ పుస్తకం బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో పదిలక్షల కాపీలు అమ్ముడయింది. ఇంతక్రితం అర్థశాస్త్రానికి చెందిన ఏ గ్రంథమూ ఈ స్థాయిలో అమ్ముడుకాలేదు. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కా రం పొందిన పాల్ క్రుగ్మాన్ అయితే థామస్ పుస్తకం ఈ దశాబ్దంలోనే ఎన్నదగినదని ప్రశంసించారు. అయితే, దీనిపై విమర్శలూ ఎక్కువే వచ్చాయి. ఈ పుస్తకం పట్టించుకోదగ్గది కాదన్నవారున్నారు. ఇందులో ఏమున్నదని పెదవి విరిచినవారున్నారు. థామస్‌కు అసలు పెట్టుబడి దారీ విధానం అర్థం కాలేదని, దాని సారాంశం ఆయన గ్రహించలేదని కొందరన్నారు. ప్రైవేటు పెట్టుబడి, స్వచ్ఛంద మార్పిడి, పోటీ మార్కెట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకపోగా అకౌంటింగ్ ఫార్ములాను ఉపయోగించి జాతీయాదాయంలో పెట్టుబడి వాటా ఎంతో తేల్చి దాని ద్వారా కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించేందుకు పూనుకున్నారని దుయ్య బట్టారు. ఈ వాదవివాదాలకన్నా హొలాండ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డు తనకు సమ్మతం కాదని థామస్ చెప్పడం ఎక్కువ సంచలనం సృష్టించిం ది. దేశ పౌరుల్లో ఎవరు అత్యుత్తములో నిర్ణయించే అధికారం ప్రభుత్వా నికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఇలా ధిక్కార స్వరం వినిపించడం థామస్తోనే మొదలుకాలేదు. గతంలో ఫ్రెంచ్ తత్వవేత్త సార్త్, రేడియా లజీ ఆవిష్కర్తలు పియెరీ, మేరీ క్యూరీలు కూడా ఈ అవార్డును తోసిపు చ్చారు. మేధావి పాత్ర రాజ్యాన్ని విమర్శనాత్మకంగా చూడటం, ప్రజల అంతరాత్మను మేల్కొల్పడం తప్ప ప్రభుత్వాల గుర్తింపు కోసం వెంపర్లా డటం కాదని థామస్ భావన. ఫ్రాన్స్ ప్రభుత్వం ఇవ్వజూపిన పురస్కా రాన్ని నిరాకరించడం ద్వారా ఆయన దీన్ని మరోసారి చర్చకు తీసుకొ చ్చారు. దేశదేశాల్లోని మేధావులకూ, కళాకారులకూ దిశానిర్దేశం చేశారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పారిస్ లో ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ముష్కర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. పారిస్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉగ్రవాదుల ఘాతుక చర్యలతో భీతిల్లిన ఫ్రాన్స్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. తీవ్రవాదంపై జరిపే పోరులో ఫ్రాన్స్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్న ఆయన వ్యక్తం చేశారు. పారిస్ లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఫ్రాన్స్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. -
తరగతిలో టీచర్ ను హత్య చేసిన విద్యార్థి తల్లి
పారీస్: స్కూల్ టీచర్ ను తరగతి గదిలోనే హత్య చేసింది ఓ విద్యార్థి తల్లి. విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమె ఈ టీచర్ ను పొడిచి చంపింది. ఫ్రాన్స్ లో సంచలనం రేపిన ఈ ఘటన ఆల్బీ ప్రాంతంలోని ఎడుయోర్డ్ హెరియట్ ప్రైమరీ పాఠశాలలో చోటు చేసుకుందని బీబీసీ తెలిపింది. నిందితురాలిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే వెంటనే విద్యాశాఖమంత్రిని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ దారుణం నుంచి విద్యార్థులు కోలుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హత్య జరిప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థులందరూ 5 -6 ఏళ్ల మధ్యనున్న వయసున్న వారు కావడంతో వారికి కౌన్సెలింగ్ చేయాలని భావిస్తున్నారు. కాగా, ఫ్రాన్స్ లో టీచర్లపై విద్యార్థుల తల్లిదండ్రుల దాడులు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
స్కూటర్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడి రహస్య సంచారం
రాత్రివేళ హెల్మెట్ పెట్టుకుని పారిస్‌లో నటి ఇంటికి రాకపోకలు పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే(59) హెల్మెట్ పెట్టుకుని పారిస్ వీధు ల్లో రాత్రివేళ సంచరిస్తున్నారు. ఎందుకోసం.. ప్రియురాలి కోసం! అధ్యక్షుడి రహస్య ప్రేమాయణం పేరుతో ‘క్లోజర్’ అనే వార పత్రిక శుక్రవారం సంచికలో హాలండేపై ఏడు పేజీల కథనాన్ని ప్రచురించింది. హాలండే ఒక నటితో సంబంధం నడుపుతున్నారని.. ఆమె ఇంటికి హాలండే రాత్రి వేళల్లో స్కూటర్‌పై వెళుతున్నారంటూ రాసింది. ఇలా చేయడం వల్ల ఆయన భద్రతపై సందేహాలను లేవనెత్తింది. నటి జూలీగాయెట్(41) ఫ్లాట్‌లోకి వెళుతున్న హాలండే ఫొటోలను సదరు పత్రిక బయటపెట్టింది.