
సంజయ్ రౌత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా రాఫెల్ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీపై వస్తున్న ఆరోపణలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ మంత్రి కానీ సమాధానం చెప్పరని.. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే సమాధానం చెప్పాల్సిన అవసరమ ఉందని రౌత్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలకు కాకపోయిన దేశ ప్రజల కోసమైన ఆయన మౌనం వీడి, ఆరోపణలపై స్పందించాలని ఆయన కోరారు. 25 ఏళ్ల క్రితం జరిగిన బోఫోర్స్ కుంభకోణమే మరోసారి భారత రాజకీయాలను పట్టిపీడిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా హోలెండ్ ప్రకటనతో రాఫెల్ ఒప్పందంపై దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం చేలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment