పారీస్: స్కూల్ టీచర్ ను తరగతి గదిలోనే హత్య చేసింది ఓ విద్యార్థి తల్లి. విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమె ఈ టీచర్ ను పొడిచి చంపింది. ఫ్రాన్స్ లో సంచలనం రేపిన ఈ ఘటన ఆల్బీ ప్రాంతంలోని ఎడుయోర్డ్ హెరియట్ ప్రైమరీ పాఠశాలలో చోటు చేసుకుందని బీబీసీ తెలిపింది. నిందితురాలిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే వెంటనే విద్యాశాఖమంత్రిని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ దారుణం నుంచి విద్యార్థులు కోలుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హత్య జరిప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థులందరూ 5 -6 ఏళ్ల మధ్యనున్న వయసున్న వారు కావడంతో వారికి కౌన్సెలింగ్ చేయాలని భావిస్తున్నారు. కాగా, ఫ్రాన్స్ లో టీచర్లపై విద్యార్థుల తల్లిదండ్రుల దాడులు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తరగతిలో టీచర్ ను హత్య చేసిన విద్యార్థి తల్లి
Published Fri, Jul 4 2014 8:29 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement