వేసవిలోగా ఐసిస్ పని ఖతం!
పారిస్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి మొసుల్‌ను వేసవిలోగా విడిపించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షడు ఫ్రాంకోయిస్ హొలండే అన్నారు. ఇరాకీ సైన్యం, అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ఇస్లామిక్ స్టేట్‌కు పట్టున్న మోసుల్‌ను స్వాధీనం చేసుకోవడానికి చేపడుతున్న ఆపరేషన్ గురించి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇరాకీ సేనల సహకారంతో సంకీర్ణ బలగాలు చేపడుతున్న ఆపరేషన్‌లో చాలా ప్రాంతాలు ఇస్లామిక్ స్టేట్ నుంచి విముక్తి పొందాయని హొలండె స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ వెనుకడుగు వేసిందని.. అయితే తమ లక్ష్యం మోసుల్ నుంచి వారిని తరిమికొట్టడం అన్నారు. ఇది వేసవిలోపు సాధ్యమౌతుందని భావిస్తున్నట్లు హొలండె తెలిపారు. ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు చేపడుతున్న దాడుల్లో ఫ్రాన్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.