mosul
-
ఆ పాపం నేను చేయను: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: 'కచ్చితమైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి చనిపోయాడని ప్రకటించడం పాపం. అలాంటి పాపాన్ని నేను చేయను' అని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. 2014 నుంచి ఇరాక్‌లో కనిపించకుండాపోయిన 39మంది భారతీయుల ఆచూకీ గురించి బుధవారం ఆమె లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ విషయమై లోక్‌సభలో మాట్లాడేందుకు ఇప్పటివరకు మూడుసార్లు సుష్మ ప్రయత్నించినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో అది వీలుపడలేదు. సోమవారం సాయంత్రం, మంగళవారం ఈ విషయమై సభలో ప్రకటన చేసేందుకు సుష్మా ప్రయత్నించారు. అయితే, సభ్యుల ఆందోళన మధ్య అందుకు వీలుపడలేదు. బుధవారం కూడా ఆమె ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే సభ్యులకు నచ్చజెప్పి శాంతించారు. 2014లో ఇరాక్‌లోని మోసుల్ అపహరణకు గురైన 39మంది భారతీయుల గురించి ఎలాంటి సమాచారం లేదని, వారు చనిపోయారు? బంధీలుగా ఉన్నారా? అన్నదానిపై సమగ్ర ఆధారాలు లేవని సభకు తెలిపారు. -
ఐసిస్ కార్లు ఇవిగో.. చూస్తే ద్యావుడా అనాల్సిందే..
మోసుల్: మోసుల్ ఉగ్రవాదుల కబంద హస్తాల్లో నలిగినలిగి తిరిగి ఇరాక్ వశమైన ప్రాంతం. అటు ప్రభుత్వ బలగాల దాడులకు, ఉగ్రవాదులు విసురుతున్న బాంబులకు మధ్య చిత్తయి దాదాపు ఏడారిగా మిగిలిపోయిన ప్రాంతం. ఎంతో కష్టపడి ప్రభుత్వ బలగాలు ఎట్టకేలకు ఐసిస్‌ను తరిమేశారు. ఇది గొప్ప విజయమే అయినప్పటికీ అక్కడ మిగిలిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు.. ఒక్క ఉగ్రవాదుల వదిలేసి పోయిన వాహనాలు తప్ప. అయితే, కేవలం వాహనాలే అని వాటిని తీసి పారేసి వీలు లేదు. ఎందుకంటే వాటిని చూస్తే ప్రతి ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. బహుషా అలాంటి వాహనాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉపయోగించారు కనుకే మోసుల్‌ను ఇరాక్ స్వాధీనం చేసుకునేందుకు అంతగా కష్టపడాల్సి వచ్చిందేమో అని కచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఆ వాహనాల్నీ కూడా ఎంతో నాణ్యమైన ఎస్‌యూవీలు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలుగా తీర్చిదిద్దినవి. దాదాపు ఒక మిసైలో, రాకెట్ లాంచరో ఢీకొడితే తప్ప ధ్వంసం కాలేనంత బలంగా ఉగ్రవాదులు వాటిని తయారు చేసుకున్నారు. స్వయంగా వారు వాటిని తీర్చి దిద్దుకున్నారు. ఇప్పుడు అలాంటి వాహనాలు మోసుల్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు ఏడారిగా మారిన ఆ ప్రాంతంలో ఇరాక్ సైన్యం ఆ కార్లన్నింటిని స్వాధీనం చేసుకొని ప్రదర్శనకు పెట్టింది. ప్రతి కారు కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతోపాటు చుట్టూ ఐరెన్ షీట్లతో కప్పి ఉండి కనిపించాయి. ఇవి యుద్ధ క్షేత్రంలో పరుగెడుతుంటే కచ్చితంగా రోబోల యుద్ధం జరుగుతుందా అనే భావన రావడం కూడా తథ్యం. ఏదీ ఏమైనప్పటికీ ఉగ్రవాదులపై పై చేయిసాధించిన ఇరాక్ బలగాలు పోలీసులు ఇప్పుడు ఆ వాహనాలన్నింటిని కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే కార్లకు పైభాగంలో రక్షణగా అమర్చిన ఇనుప తెరలను తొలగించి చూస్తున్న ప్రతి కారులో కూడా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు బయటపడుతున్నాయి. -
ఆ ఎస్కేప్ కోసం 17 సూసైడ్ కారు బాంబులు!
లండన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత, స్వయం ప్రకటిత ఖలిఫా అబూ బకర్ అల్ బగ్గాదీని రెండు నెలల కిందటే మోసుల్ పట్టణం నుంచి తప్పించారని కుర్దీష్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోసుల్ నుంచి పశ్చిమ దిశ మార్గంలో బగ్దాదీని తప్పించేందుకు ఐఎస్ఐఎస్ భారీ ఆపరేషన్ చేపట్టిందని, ఇందుకోసం 17 సూసైడ్ కారు బాంబులను వినియోగించడమే కాక, సిరియా నుంచి దాదాపు 300 మంది ఫైటర్లను స్టేట్ రప్పించిందని, ఈ సందర్భంగా హోరాహోరీ పోరు జరిగిందని కుర్దీష్ ప్రెసిడెంట్ మసౌద్ బర్జానీ చీఫ్ స్టాప్ ఫౌద్ హుస్సేన్ 'ద ఇండింపెండెంట్' పత్రికకు తెలిపారు. బగ్దాదీని సురక్షితంగా తప్పించేందుకే ఇంతటి భారీ ఆపరేషన్‌ను ఐఎస్ఐఎస్ చేపట్టిందని తాము భావిస్తున్నామని, ఈ ఆపరేషన్‌లో ఆ గ్రూప్ భారీగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 19న ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసుల్ పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇరాకీ సేనలు తుది దాడిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కీలకమైన మోసుల్ పట్టణాన్ని ఇరాకీ సేనలు దాదాపుగా తమ అధీనంలోకి తెచ్చుకున్నా.. ఇంకా నాలుగు లక్షలమంది జనాభా కలిగిన మోసుల్ పాత పట్టణం ఐఎస్ఐఎస్ గుప్పిట్లోనే ఉంది. అయితే, ఇరాకీ సేనల తుది దాడి ప్రారంభం కావడంతోనే ఇస్లామిక్ స్టేట్ తన అధినేతను సురక్షితంగా తప్పించే ఆపరేషన్‌ను చేపట్టిందని, మోసుల్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం హష్ద్ అల్ షాబి షియా మిలిషియా అధీనంలో ఉందని, ఈ ప్రాంతం నుంచి బగ్దాదీని తప్పిస్తే.. తక్కువ ప్రతిఘటన ఉంటుందని, ఈ మార్గాన్ని అది ఎంచుకున్నదని ఆయన చెప్పారు. మోసుల్ పట్టణం చేజారిన తర్వాత ఐఎస్ఐఎస్ ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయే అవకాశముందని వివరించారు. -
వరుస ఆత్మాహుతి దాడులు; 10 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ మళ్లీ బాంబుదాడులతో దద్దరిల్లింది. శనివారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌తో పాటు మోసుల్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 10 మంది మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదులకు, భద్రత దళాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్‌ను ఇరాక్ భద్రత దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. మోసుల్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయడంతో నలుగురు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. మోసుల్‌లోనే మరో రెండు చోట్ల సూసైడ్ కారు బాంబులను పేల్చారు. -
వేసవిలోగా ఐసిస్ పని ఖతం!
పారిస్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి మొసుల్ను వేసవిలోగా విడిపించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షడు ఫ్రాంకోయిస్ హొలండే అన్నారు. ఇరాకీ సైన్యం, అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ఇస్లామిక్ స్టేట్‌కు పట్టున్న మోసుల్‌ను స్వాధీనం చేసుకోవడానికి చేపడుతున్న ఆపరేషన్ గురించి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాకీ సేనల సహకారంతో సంకీర్ణ బలగాలు చేపడుతున్న ఆపరేషన్‌లో చాలా ప్రాంతాలు ఇస్లామిక్ స్టేట్ నుంచి విముక్తి పొందాయని హొలండె స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ వెనుకడుగు వేసిందని.. అయితే తమ లక్ష్యం మోసుల్ నుంచి వారిని తరిమికొట్టడం అన్నారు. ఇది వేసవిలోపు సాధ్యమౌతుందని భావిస్తున్నట్లు హొలండె తెలిపారు. ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు చేపడుతున్న దాడుల్లో ఫ్రాన్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
ఉగ్రవాదుల దాడిలో 24 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. కాగా.. శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన విషయం తెలిసిందే. మోసుల్కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్‌ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ప్రస్తుతం మోసుల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోందని ఇరాక్‌కు చెందిన అల్మాడా ప్రెస్ వెబ్సైట్ వెల్లడించింది. -
ఇరాకీ సేనలకు తీవ్ర ప్రతిఘటన
మోసుల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు పట్టున్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాకీ సేనలకు తీవ్ర ప్రతిఘటన ఎందురవుతోంది. ఇరాకీ సేనలు శనివారం ఉదయం మోసుల్ పట్టణ తూర్పు ప్రాంతం ముహరబీన్, ఉలామాలకు చేరుకోగా.. అక్కడ ఐఎస్ ఉగ్రవాదులతో భీకరపోరు జరుగుతోందని ఇరాకీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి సమి అల్ అరిది వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు స్నిపర్ రైఫిల్స్, గ్రెనేడ్లతో ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన వెల్లడించారు. భీకర పోరుతో ఈ రెండు ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయని అన్నారు. ఇస్లామిక్ స్టేట్‌కు పట్టున్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాకీ సేనలు అక్టోబర్ 17 న ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా బలగాలు 2011లో ఇరాక్‌ను వదిలివెళ్లిన అనంతరం అక్కడ చేపడుతన్న భారీ మిలిటరీ ఆపరేషన్ ఇదే. మోసుల్‌ను కోల్పోతే ఇస్లామిక్ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. -
ప్రాణాలు అరచేతబట్టుకొని 56 వేలమంది..
మోసుల్: ఇరాక్ ప్రధాన నగరం మోసుల్‌ను మరో 56వేలమంది ప్రజలు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రాణాలు అరచేతబట్టుకొని సమీపంలోని ప్రాంతాలకు పరుగులు తీశారు. కట్టుబట్టలతో వారు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్కడి హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి తిరిగి మోసుల్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా-ఇరాక్ సంయుక్త బలగాలు గత నెల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే గత రెండు వారాల్లో నవంబర్ 4న 22,224మంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లగా తాజాగా ఒకేసారి 56 వేలమంది వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. అటు ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య బీకర యుద్ధం జరుగుతోంది. బాంబులు, మోర్టార్ షెల్స్, బుల్లెట్ల వర్షంతో మోసుల నగరమంతా మారిమోగిపోతోంది. ఎలాగైన ఉగ్రవాదుల తుడిచిపెట్టి ప్రశాంతమైన నగరాన్ని తిరిగి ప్రజలకు అప్పగించాలనే దృఢనిశ్చయంతో బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడంతో వారంతా ప్రాణాలు అరచేతబట్టుకొని వలసదారులుగా వెళ్లి తమ నివాసాలకోసం ఎదురు చూస్తున్నారు. వీరికి పునరావాసం కోసం బలగాలే దాదాపు వెయ్యికిపైగా టెంటు షెల్టర్లు కూడా ఏర్పాటుచేశారు. -
మోసుల్ యుద్ధం: ఆర్మీ వలలో ఐసిస్ చీఫ్!
మోసుల్: గడిచిన మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థను సమూలంగా మట్టుపెట్టే దిశగా ఇరాకీ సైన్యం, అమెరికా వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ మోసుల్' కీలక ఘట్టానికి చేరుకుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారి మోసుల్ నగరంలోకి ప్రవేశించిన సైన్యాలు.. ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చుట్టుముట్టినట్లు తెలిసింది. తొమ్మిది నెలలుగా అజ్ఞాతంలో ఉంటోన్న అబూ బాగ్దాదీ.. తూర్పు మోసుల్ లోని ఓ ప్రాంతంలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో బలగాలు అటుగా కదిలాయని, అతను తలదాచుకున్న ప్రాంతాన్ని ఆర్మీ రౌండప్ చేసిందని కుర్దిష్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫవూద్ హుస్సేన్ బుధవారం మీడియాకు చెప్పారు. కుర్దూ సైన్యాలు కూడా మరో వైపు నుంచి ఐసిస్ తో యుద్ధం చేస్తూనేఉంది. ఏక్షణమైనా సంకీర్ణ సైన్యాలు బాగ్దాదీని మట్టుపెట్టే అవకాశం ఉందని, అలా జరిగితే ఐసిస్ చరిత్ర ముగిసినట్లేనని హుస్సేన్ వ్యాఖ్యానించారు. అయితే ఒకవేళ బాగ్దాదీ ఇప్పుడున్న ప్రాంతం నుంచి తప్పించుకోగలిగితే మాత్రం యుద్ధం మరింత భీకరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టైగ్రీస్ నదికి రెండు వైపులా(తూర్పు, పడమర వైపునకు) విస్తరించిన మోసుల్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఐసిస్ ఖలీఫా రాజ్యాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇరాకీ సైన్యం మంగళవారం నాటికి మోసుల్ తూర్పు శివారులోని గాగ్ జాలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి వడివడిగా నగరంలోపలికి చొచ్చుకుపోయేందుఉ ప్రయత్నిస్తోంది. తూర్పు, పశ్చిమ మోసుల్ లను కలుపుతూ టైగ్రీస్ నదిపై ఐదు చోట్ల వంతెనలను ఉన్నాయి. ఒకవేళ ఐసిస్ గనుక ఈ వంతెనలను ధ్వంసం చేస్తే సైన్యాలు అటుగా వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయే అవకాశం ఉంది. ఐసిస్ ఉగ్రవాదులు ఆ పని చేయడానికి ముందే యుద్ధంలో పట్టుసాధించాలని ఇరాకీ సైన్యం ప్రయత్నిస్తోంది. వారికి సహకారంగా గగనతలం నుంచి అమెరికా యుద్ధవ విమానాలు ఐసిస్ స్థావరాలపై ఎడతెరపిలేకుండా దాడులు చేస్తూనేఉన్నాయి. -
మోసుల్ యుద్ధం: ఆర్మీ వలలో ఐసిస్ చీఫ్!
-
మోసుల్‌లో 900 మంది ఉగ్రవాదుల హతం
అర్బిల్(ఇరాక్): మోసుల్ నగరం స్వాధీనం కోసం జరుగుతున్న పోరులో ఇంతవరకూ 900 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. మరోవైపు ఇరాకీ దళాలు నగరం దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతం వైపు దూసుకుపోతున్నాయని పేర్కొంది. ఇరాకీ, కుర్దీష్ బలగాలకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు గగనతల దాడులతో సాయం చేస్తున్నాయని తెలిపింది. మోసుల్‌లో 3,500 నుంచి 5 వేల మంది, సరిహద్దుల్లో మరో 2 వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉండవచ్చని గతంలో అమెరికా నిర్ధ్ధారించింది. వీరిలో దాదాపు 800 నుంచి 900 వరకూ మరణించారని అమెరికా సైనికాధికారి జోసెఫ్ వోటెల్ చెప్పారు. మరోవైపు నగరం నుంచి పారిపోయి వస్తోన్న వేలాది మందితో మోసుల్ సరిహద్దుల్లోని శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అక్టోబర్ 17న మోసుల్ స్వాధీనం కోసం ప్రారంభమైనప్పటి నుంచీ ఇంతవరకూ 11,700 మంది పారిపోయి వచ్చారని ఇరాకీ మంత్రి వెల్లడించారు. ఇరాకీ దళాలు మోసుల్ సమీపిస్తోన్న కొద్ది తరలివస్తోన్న ప్రజల సంఖ్య పెరిగిందని చెప్పారు. -
ఉగ్రవాదుల ఖేల్‌ఖతం.. 900 మంది హతం!
-
ఉగ్రవాదుల ఖేల్‌ఖతం.. 900 మంది హతం!
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఖేల్ ఖతమవుతోంది. ఆ దేశంలోని ప్రధాన నగరం మోసుల్‌లో భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అతిపెద్ద పట్టణమైన మోసుల్కు ఉగ్రవాదుల నుంచి విముక్తి కలిగించే దిశగా సంకీర్ణ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే 800 నుంచి 900 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇస్లామిక్ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అడుగు కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా ఉగ్రవాదుల కోసం సేనలు మూకుమ్మడిగా గాలింపులు చేస్తున్నాయి. -
ఆఖరి పోరాటం
-
ఐసిస్ కు ఆర్థిక కష్టాలు
-
ఐసిస్ కు ఆర్థిక కష్టాలు
వాషింగ్టన్ : తన అధీనంలోని భూభాగం తరిగిపోతోంటే ఉగ్రసంస్థ ఐసిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆల్‌ఖైదా మాదిరిగా బలవంతపు వసూళ్లు, అపహరణలు, విరాళాల సేకరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్, సిరియాల్లోని సహజ వనరులు, తమ ఏలుబడిలో ఉన్న పట్టణాల్లో పన్ను విధించడమే సంస్థకు ఆదాయ వనరులు. కొంతకాలంగా మోసుల్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కథ అడ్డం తిరిగింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. అక్కడి చమురు, నగదు నిల్వల ద్వారా సమకూరే బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని క్రమంగా కోల్పోతోంది. 2015లో ఇరాక్‌లో పన్నులు, బలవంతపు వసూళ్ల వల్ల ఐసిస్ నెలకు 30 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఒక్క మొసూల్ పట్టణంలోనే పన్నుల ద్వారా నెలకు సుమారు 4 మిలియన్ల ఆదాయం సమకూరుతోంది. బ్యాంకు దొంగతనాలు సంస్థకు మూడో అతిపెద్ద ఆర్థిక వనరులుగా ఉన్నాయి. మొసూల్‌ను ఆక్రమించిన కొత్తలో అక్కడి ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 500 మిలియన్ డాలర్లను ఐసిస్ ఒకేసారి దొంగిలించింది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ పోరాటదారుల వేతనాలు సగానికి తగ్గాయి. -
ఆపరేషన్ ‘మోసుల్’ మొదలైంది
-
ఆపరేషన్ ‘మోసుల్’ మొదలైంది
ప్రభుత్వ వశమైన ఐసిస్ ఆక్రమిత గ్రామాలు ఖాజిర్(ఇరాక్): ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇరాకీ నగరం మోసుల్‌ను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను పెష్మెర్గా (ఇరాకీ కుర్దిస్తాన్ సైనిక బలగం) ముమ్మరం చేసింది. మోసుల్కు తూర్పున, ఐసిస్ ఆక్రమణలోని అనేక గ్రామాలను పెష్మెర్గా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. 4వేలమంది సైనికులు మూడు బృందాలుగా ఏర్పడి వీటిని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇరాక్ సమాఖ్య దళాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. అమెరికా ఆధ్వర్యంలో ఐసిస్‌పై పోరాటం చేస్తున్న సంకీర్ణ కూటమి కూడా ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసి పెష్మెర్గా సైనికులకు సాయపడింది. ఐసిస్ చెరలోని గ్రామాలను తిరిగి తీసుకోవాలన్న ఈ ప్రక్రియ కొన్ని నెలల క్రితమే మొదలైందనీ, తాజా దాడులు మూడో దశవని పెష్మెర్గా తెలిపింది. ఘర్షణల్లో 8 మంది పెష్మెర్గా సైనికులు చనిపోయారు. -
ఐసిస్ పతనానికి ప్రారంభం ఇదేనా!
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) పతనానికి పునాదులు పడుతున్నాయా?. మహ్మదీయులకు తానే పాలకుడినని, తనను అనుసరించే మహ్మదీయులందరూ జీవించాలని ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది మొసుల్ నగరంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే ప్రదేశంలో ఐసిస్ కు వ్యతిరేకంగా గోడపై 'ఎమ్' లెటర్ ను గీయడం(గ్రాఫిటీ) ఐసిస్ కు వ్యతిరేకంగా రెబల్స్ పోరాటం ప్రారంభమయినట్లు సూచిస్తోంది. అరబిక్ భాషలో 'ఎమ్' అంటే 'ముకావమా'(వ్యతిరేకత) అని అర్ధం. ఈ నెలలోనే తమ పోరాటాన్ని ప్రారంభించినట్లు కితాఎబ్ అల్ మొసుల్(రెబలియన్ సంస్ధ) విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించారనే నెపంతో ఐసిస్ మొసుల్ కు చెందిన ముగ్గరు యువకులను అత్యంత క్రూరంగా చంపిన ఘటనకు ప్రతీకారంగా కితాఎబ్ అల్ మొసుల్ ఐసిస్ కు చెందిన కొందరు ఉగ్రవాదులను కాల్చిచంపింది. మొసుల్ తమ చేయి జారిపోతుందేమోనని భయపడుతున్న ఐసిస్ గత కొద్దికాలంగా అత్యంత రాక్షసంగా ప్రవర్తిస్తోంది. రెబలియన్ సంస్ధ సృష్టిస్తున్న ప్రకంపనలను అడ్డుకునేందుకు ఐసిస్ భారీ ఎత్తున అనుమానిత యువకులను అరెస్టు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను నగరవ్యాప్తంగా రంగంలోకి దించి తనిఖీలు చేయిస్తోంది. దీంతో భయాందోళనలకు గురవుతున్న మొసుల్ ప్రజలు పక్క నగరాలకు పారిపోతున్నారు. కీలక నేతలను గత కొద్దికాలంగా కోల్పోతున్న ఐసిస్.. లోలోపల పెరుగుతున్న విద్రోహశక్తులపై నిఘాను కట్టుదిట్టం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిసింది. ఒక్క రెబలియన్లే కాదు.. అమెరికా సాయుధదళాలు, ఎయిర్ ఫోర్స్, ఇరాక్ బలగాలు కొంతకాలంగా ఉగ్రసంస్ధ ఆక్రమిత ప్రాంతాలను విడిపిస్తుండటంతో ఐసిస్ కు గడ్డుకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. మొసుల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అమెరికా.. నగరంలో దాదాపు 3,500 నుంచి 4వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని అంచనా వేస్తోంది. గత నెలరోజుల కాలంలో ఐసిస్ కీలక నేతలను అమెరికా మట్టుపెట్టిన విషయం తెలిసిందే. మొసుల్ ను చెర నుంచి విడిపించుకుంటే ఉగ్రసంస్ధకు చెక్ పెట్టడానికి మార్గం సుగమం అవుతుందని అమెరికా, ఇరాక్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరిలోగా మొసుల్ ను తిరిగి దక్కించుకోవాలని ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ ప్రకటన కూడా చేశారు. జీరో అవర్(స్వేచ్చా సమయం) కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని.. గతవారం ఇరాక్ ఎయిర్ ఫోర్స్ చిగురిస్తున్న ఆకులను నగరంలో వర్షంలా కురిపించింది. -
ఇరాక్ కు సహాయంగా అమెరికా దళాలు..
అమెరికాః ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడంలో ఇరాక్ కు సహకరించేందుకు అమెరికా మరింత ముందుకొచ్చింది. ఇరాక్ లో ఉగ్రవాదుల అధీనంలోకి వెళ్ళిన మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాక్ దళాలకు సహాయం అందించేందుకు మరో అడుగు వేసింది. ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ ని విడిపించేందుకు, ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాకీ దళాలకు సహాయంగా 560 అమెరికా దళాలను పంపింస్తున్నట్లు అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్ వెల్లడించారు. మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాడేందకు అమెరికా తనవంతు కృషి చేస్తోంది. ఇరాక్ లో ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ దళాలకు మద్దతుగా దాదాపు 560 అమెరికా సైనిక దళాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అమెరికా ముందుంటుందని, ఇరాకీ సైనిక దళాలకు అమెరికా సైన్యం తగినంత సహకారం అందిస్తుందని అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్.. తన అప్రకటిత బాగ్దాద్ పర్యటనలో భాగంగా తెలిపారు. కార్టర్ తన పర్యటనలో అమెరికా కమాండర్లు, ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ, రక్షణ మంత్రి ఖలీద్ అల్ ఒబైదీ లను కలుసుకున్నారు. మరోవైపు కొత్తగా పంపిస్తున్న వారిలో ఇంజనీర్లు, లాజిస్టిక్స్ మరియు ఇతర సిబ్బంది కూడ ఉన్నట్లు కార్టర్ తెలిపారు. వారంతా మాసూల్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న కయారా ఎయిర్ బేస్ అభివృద్ధికి సైతం సహాయం అందిస్తాయన్నారు. -
ఐఎస్ఐఎస్ నగదు ధ్వంసం వీడియో విడుదల
-
ఐఎస్ఐఎస్ నగదు ధ్వంసం వీడియో విడుదల
వాషింగ్టన్: ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని మసూల్‌లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చెందిన నగదు డిపో ధ్వంసానికి సంబంధించిన వీడియోను శనివారం వాషింగ్టన్‌లోని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఐసిస్ నగదు డిపోపై యూఎస్ బాంబుల వర్షం కురుపించింది. దీంతో డిపోలోని నగదు గాలిలోకి లేచి చెల్లాచెదురయింది. అయితే డిపోలో ఎంత నగదు ఉంది, అది ఏ దేశ కరెన్సీ అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేమని ఉన్నతాధికారులు వెల్లడించారు. నగదు మాత్రం మిలియన్లలో ఉందని మాత్రం స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్కు చెందిన నగదు డిపోపై దాడి ఓ మంచి పరిణామం అని యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ లాయిడ్ అస్టిన్ తెలిపారు. ఐఎస్ఐఎస్కి మారు పేరుగా కొనసాగుతున్న ఐఎస్ఐఎల్కి చెందిన గ్యాస్, చమురు ఉత్పత్తితోపాటు ఈ సంస్థకు ఆర్థిక మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేస్తామని చెప్పారు. కాగా మసూల్‌లో నగదు డిపోపై చేసిన దాడి మొదటిది కాదని అస్టిన్ చెప్పారు. ఐఎస్ఐఎస్లో చేరి యుద్ధం చేసేవారికి ఐఎస్ఐఎల్ నుంచి నిధులు అందుతున్నాయని, అలాగే కొత్తగా ఈ సంస్థలో వ్యక్తులను చేర్చుకునేందుకు చర్యలు చేపడుతుందని వెల్లడించారు. వీటితోపాటు ఈ సంస్థకు వివిధ మార్గాల్లో అందుతున్న వనరులను నిరోధించేందుకు చర్యలు చేపడతామని అస్టిన్ పేర్కొన్నారు. కాగా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సదరు వీడియోలో శబ్దం మాత్రం లేదు. -
ఇరాక్ లో కిడ్నాపైన భారతీయులు క్షేమం
ఇరాక్‌లో కిడ్నాప్‌నకు గురైన 40 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ఇరాక్‌లో కిడ్నాపైన భారతీయల కుటుంబ సభ్యుల బృందంతో సుష్మా భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సుష్మా మాట్లాడారు. కిడ్నాపర్ల చెర నుంచి భారతీయులను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఇరాక్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 40 మంది భారతీయులను జీహాదీ సున్నీ మిలిటెంట్ల మంగళవారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారంతా తుర్కిష్ నిర్మాణ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్న విషయం విదితమే. -
ఇరాక్‌లో అంతర్యుద్ధం తీవ్రం
బాగ్దాద్‌కు చేరువైన తిరుగుబాటు దళాలు జీహాదీల స్వాధీనంలో మొసుల్,తిక్రిత్ నగరాలు బాగ్దాద్, కర్బాలాలే తదుపరి లక్ష్యమన్న ఐఎస్ఐఎల్ సద్దాం సైన్యాధికారులతో బలోపేతమైన జీహాదీ దళం బాగ్దాద్/లండన్: ఇరాక్ సంక్షోభం ముదురుతోంది. సోమవారం ప్రారంభమైన అంతర్యుద్ధం శనివారం నాటికి మరింత తీవ్రమైంది. అల్ కాయిదా ప్రభావిత సున్నీ జీహాదీ తిరుగుబాటు దళాలు మొసుల్, తిక్రిత్ నగరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. తిరుగుబాటులో దేశ ఉత్తరప్రాంతంలో బలంగా ఉన్న కుర్దులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఉత్తర, ఉత్తరమధ్య ఇరాక్‌లోని అనేక ప్రాంతాలపై పట్టు సాధిస్తూ బాగ్దాద్‌ను కైవసం చేసుకునే దిశగా జీహాదీ దళాలు ముందుకు కదులుతున్నాయి. బాగ్దాద్‌కు అవి కేవలం 100 కి.మీల దూరంలో ఉన్నాయని సమాచారం. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతుదారులైన ఈ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాలనుఇరాక్ సైన్యం ఎదుర్కోలేకపోతోంది. షియా గిరిజన యోధులు మాత్రం వారిని కొంతవరకు నిలువరిస్తున్నారు. ఐఎస్ఐఎల్ దళాలను ప్రజలు సాయుధులై కలసికట్టుగా ఎదుర్కోవాలని షియాల అత్యున్నత మత పెద్ద అయోతుల్లా అలీ అల్ సిస్తానీ శుక్రవారం పిలుపునిచ్చారు. సున్నీ జీహాదీలను ఎదుర్కొనేందుకు వేలాది షియాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. అలాగే, షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న, సుశిక్షితులైన ప్రభుత్వ దళాలున్న బాగ్దాద్‌ను కేవలం వేలల్లో ఉన్న జీహాదీ తిరుగుబాటుదారులు కైవసం చేసుకోలేరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బాగ్దాద్‌కు ఉత్తరంవైపు ప్రభుత్వ సైనికదళాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. చెక్‌పోస్ట్‌లు నిర్మించి, సాయుధులను కాపలాగా పెట్టాయి. కాగా, బాగ్దాద్‌తో పాటు షియాలకు పవిత్ర నగరమైన కర్బాలాలే తమ తదుపరి లక్ష్యమని ఐఎస్ఐఎల్ ప్రతినిధి అబూ మొహమ్మద్ అల్ అద్నానీ ప్రకటించారు. సున్నీలు, కుర్దులు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితి నెలకొంది. దళాలు పంపించబోం: అమెరికా, బ్రిటన్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు తమ దేశం నుంచి సైనిక దళాలను పంపించడం లేదని అమెరికా, బ్రిటన్లు స్పష్టం చేశాయి. ఇరాక్ తమకు అత్యంత ముఖ్యమైన దేశం అయినప్పటికీ.. ఆ దేశ సంక్షోభాన్ని ఆ దేశస్తులే పరిష్కరించుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. సైనిక దళాలను పంపించడం కాకుండా.. ఇరాక్ ప్రభుత్వానికి సహకరించే ఇతర మార్గాల గురించి ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఇరాక్‌లో అస్థిరతను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ తెలిపింది. అయితే, ఇరాక్ ప్రభుత్వానికి మద్దతుగా తమ దళాలను ఇరాక్ పంపించడం లేదని స్పష్టం చేసింది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న, జీహాదీలతో పోరాడుతున్న ఇరాక్ ప్రజలకు రూ. 29.84కోట్ల విలువైన సామగ్రిని బ్రిటన్ పంపిస్తోంది.