మోసుల్ వైపు కదులుతున్న ఇరాక్ సైన్యం
ప్రభుత్వ వశమైన ఐసిస్ ఆక్రమిత గ్రామాలు
ఖాజిర్(ఇరాక్): ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇరాకీ నగరం మోసుల్‌ను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను పెష్మెర్గా (ఇరాకీ కుర్దిస్తాన్ సైనిక బలగం) ముమ్మరం చేసింది. మోసుల్‌కు తూర్పున, ఐసిస్ ఆక్రమణలోని అనేక గ్రామాలను పెష్మెర్గా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. 4వేలమంది సైనికులు మూడు బృందాలుగా ఏర్పడి వీటిని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు.
ఇరాక్ సమాఖ్య దళాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. అమెరికా ఆధ్వర్యంలో ఐసిస్‌పై పోరాటం చేస్తున్న సంకీర్ణ కూటమి కూడా ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసి పెష్మెర్గా సైనికులకు సాయపడింది. ఐసిస్ చెరలోని గ్రామాలను తిరిగి తీసుకోవాలన్న ఈ ప్రక్రియ కొన్ని నెలల క్రితమే మొదలైందనీ, తాజా దాడులు మూడో దశవని పెష్మెర్గా తెలిపింది. ఘర్షణల్లో 8 మంది పెష్మెర్గా సైనికులు చనిపోయారు.