ఐసిస్ పతనానికి ప్రారంభం ఇదేనా! | Signs Of Panic And Rebellion In The Heart Of Islamic State's Self-Proclaimed Caliphate | Sakshi
Sakshi News home page

ఐసిస్ పతనానికి ప్రారంభం ఇదేనా!

Published Thu, Sep 22 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

ఐసిస్ పతనానికి ప్రారంభం ఇదేనా!

ఐసిస్ పతనానికి ప్రారంభం ఇదేనా!

బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) పతనానికి పునాదులు పడుతున్నాయా?. మహ్మదీయులకు తానే పాలకుడినని, తనను అనుసరించే మహ్మదీయులందరూ జీవించాలని ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది మొసుల్ నగరంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే ప్రదేశంలో ఐసిస్ కు వ్యతిరేకంగా గోడపై 'ఎమ్' లెటర్ ను గీయడం(గ్రాఫిటీ) ఐసిస్ కు వ్యతిరేకంగా రెబల్స్ పోరాటం ప్రారంభమయినట్లు సూచిస్తోంది.

అరబిక్ భాషలో 'ఎమ్' అంటే 'ముకావమా'(వ్యతిరేకత) అని అర్ధం. ఈ నెలలోనే తమ పోరాటాన్ని ప్రారంభించినట్లు కితాఎబ్ అల్ మొసుల్(రెబలియన్ సంస్ధ) విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించారనే నెపంతో ఐసిస్ మొసుల్ కు చెందిన ముగ్గరు యువకులను అత్యంత క్రూరంగా చంపిన ఘటనకు ప్రతీకారంగా కితాఎబ్ అల్ మొసుల్ ఐసిస్ కు చెందిన కొందరు ఉగ్రవాదులను కాల్చిచంపింది.

మొసుల్ తమ చేయి జారిపోతుందేమోనని భయపడుతున్న ఐసిస్ గత కొద్దికాలంగా అత్యంత రాక్షసంగా ప్రవర్తిస్తోంది. రెబలియన్ సంస్ధ సృష్టిస్తున్న ప్రకంపనలను అడ్డుకునేందుకు ఐసిస్ భారీ ఎత్తున అనుమానిత యువకులను అరెస్టు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను నగరవ్యాప్తంగా రంగంలోకి దించి తనిఖీలు చేయిస్తోంది. దీంతో భయాందోళనలకు గురవుతున్న మొసుల్ ప్రజలు పక్క నగరాలకు పారిపోతున్నారు. కీలక నేతలను గత కొద్దికాలంగా కోల్పోతున్న ఐసిస్.. లోలోపల పెరుగుతున్న విద్రోహశక్తులపై నిఘాను కట్టుదిట్టం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిసింది.

ఒక్క రెబలియన్లే కాదు.. అమెరికా సాయుధదళాలు, ఎయిర్ ఫోర్స్, ఇరాక్ బలగాలు కొంతకాలంగా ఉగ్రసంస్ధ ఆక్రమిత ప్రాంతాలను విడిపిస్తుండటంతో ఐసిస్ కు గడ్డుకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. మొసుల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అమెరికా.. నగరంలో దాదాపు 3,500 నుంచి 4వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని అంచనా వేస్తోంది. గత నెలరోజుల కాలంలో ఐసిస్ కీలక నేతలను అమెరికా మట్టుపెట్టిన విషయం తెలిసిందే. మొసుల్ ను చెర నుంచి విడిపించుకుంటే ఉగ్రసంస్ధకు చెక్ పెట్టడానికి మార్గం సుగమం అవుతుందని అమెరికా, ఇరాక్ అధికారులు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివరిలోగా మొసుల్ ను తిరిగి దక్కించుకోవాలని ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ ప్రకటన కూడా చేశారు. జీరో అవర్(స్వేచ్చా సమయం) కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని.. గతవారం ఇరాక్ ఎయిర్ ఫోర్స్ చిగురిస్తున్న ఆకులను నగరంలో వర్షంలా కురిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement