న అధీనంలోని భూభాగం తరిగిపోతోంటే ఉగ్రసంస్థ ఐసిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆల్‌ఖైదా మాదిరిగా బలవంతపు వసూళ్లు, అపహరణలు, విరాళాల సేకరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్, సిరియాల్లోని సహజ వనరులు, తమ ఏలుబడిలో ఉన్న పట్టణాల్లో పన్ను విధించడమే సంస్థకు ఆదాయ వనరులు. కొంతకాలంగా మోసుల్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కథ అడ్డం తిరిగింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. అక్కడి చమురు, నగదు నిల్వల ద్వారా సమకూరే బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని క్రమంగా కోల్పోతోంది.