ISIS cash
-
ఐసిస్ కు ఆర్థిక కష్టాలు
-
ఐసిస్ కు ఆర్థిక కష్టాలు
వాషింగ్టన్ : తన అధీనంలోని భూభాగం తరిగిపోతోంటే ఉగ్రసంస్థ ఐసిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆల్‌ఖైదా మాదిరిగా బలవంతపు వసూళ్లు, అపహరణలు, విరాళాల సేకరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్, సిరియాల్లోని సహజ వనరులు, తమ ఏలుబడిలో ఉన్న పట్టణాల్లో పన్ను విధించడమే సంస్థకు ఆదాయ వనరులు. కొంతకాలంగా మోసుల్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కథ అడ్డం తిరిగింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. అక్కడి చమురు, నగదు నిల్వల ద్వారా సమకూరే బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని క్రమంగా కోల్పోతోంది. 2015లో ఇరాక్‌లో పన్నులు, బలవంతపు వసూళ్ల వల్ల ఐసిస్ నెలకు 30 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఒక్క మొసూల్ పట్టణంలోనే పన్నుల ద్వారా నెలకు సుమారు 4 మిలియన్ల ఆదాయం సమకూరుతోంది. బ్యాంకు దొంగతనాలు సంస్థకు మూడో అతిపెద్ద ఆర్థిక వనరులుగా ఉన్నాయి. మొసూల్‌ను ఆక్రమించిన కొత్తలో అక్కడి ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 500 మిలియన్ డాలర్లను ఐసిస్ ఒకేసారి దొంగిలించింది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ పోరాటదారుల వేతనాలు సగానికి తగ్గాయి. -
ఐఎస్ఐఎస్ నగదు ధ్వంసం వీడియో విడుదల
-
ఐఎస్ఐఎస్ నగదు ధ్వంసం వీడియో విడుదల
వాషింగ్టన్: ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని మసూల్‌లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చెందిన నగదు డిపో ధ్వంసానికి సంబంధించిన వీడియోను శనివారం వాషింగ్టన్‌లోని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఐసిస్ నగదు డిపోపై యూఎస్ బాంబుల వర్షం కురుపించింది. దీంతో డిపోలోని నగదు గాలిలోకి లేచి చెల్లాచెదురయింది. అయితే డిపోలో ఎంత నగదు ఉంది, అది ఏ దేశ కరెన్సీ అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేమని ఉన్నతాధికారులు వెల్లడించారు. నగదు మాత్రం మిలియన్లలో ఉందని మాత్రం స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్కు చెందిన నగదు డిపోపై దాడి ఓ మంచి పరిణామం అని యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ లాయిడ్ అస్టిన్ తెలిపారు. ఐఎస్ఐఎస్కి మారు పేరుగా కొనసాగుతున్న ఐఎస్ఐఎల్కి చెందిన గ్యాస్, చమురు ఉత్పత్తితోపాటు ఈ సంస్థకు ఆర్థిక మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేస్తామని చెప్పారు. కాగా మసూల్‌లో నగదు డిపోపై చేసిన దాడి మొదటిది కాదని అస్టిన్ చెప్పారు. ఐఎస్ఐఎస్లో చేరి యుద్ధం చేసేవారికి ఐఎస్ఐఎల్ నుంచి నిధులు అందుతున్నాయని, అలాగే కొత్తగా ఈ సంస్థలో వ్యక్తులను చేర్చుకునేందుకు చర్యలు చేపడుతుందని వెల్లడించారు. వీటితోపాటు ఈ సంస్థకు వివిధ మార్గాల్లో అందుతున్న వనరులను నిరోధించేందుకు చర్యలు చేపడతామని అస్టిన్ పేర్కొన్నారు. కాగా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సదరు వీడియోలో శబ్దం మాత్రం లేదు.