వరుస ఆత్మాహుతి దాడులు; 10 మంది మృతి | Suicide bombings kill 10, wound 33 in Mosul, Baghdad | Sakshi
Sakshi News home page

వరుస ఆత్మాహుతి దాడులు; 10 మంది మృతి

Published Sat, Feb 11 2017 10:21 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

Suicide bombings kill 10, wound 33 in Mosul, Baghdad

బాగ్దాద్: ఇరాక్ మళ్లీ బాంబుదాడులతో దద్దరిల్లింది. శనివారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌తో పాటు మోసుల్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 10 మంది మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు.

ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదులకు, భద్రత దళాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్‌ను ఇరాక్ భద్రత దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. మోసుల్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయడంతో నలుగురు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. మోసుల్‌లోనే మరో రెండు చోట్ల సూసైడ్ కారు బాంబులను పేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement