Explosion Near Football Stadium Iraq Baghdad Many Killed - Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు

Published Sun, Oct 30 2022 9:48 AM | Last Updated on Sun, Oct 30 2022 10:37 AM

Explosion Near Football Stadium Iraq Baghdad Many Killed - Sakshi

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ గ్యారేజ్‌లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్‌కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది.
చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్‌ నుంచి రష్యా సేనల పలాయనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement