ఆత్మాహుతి దాడులు: 13 మంది మృతి | Iraq:Suicide attack kills several in Baghdad | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడులు: 13 మంది మృతి

Published Thu, Jan 21 2021 3:42 PM | Last Updated on Thu, Jan 21 2021 7:08 PM

Iraq:Suicide attack kills several in Baghdad - Sakshi

బాగ్దాద్: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ ఆత్మాహుతి దాడులలో దద్దరిల్లింది. గురువారం చోటు చేసుకున్న వరుస  సూసైడ్‌ ఎటాక్స్‌లో పలువురు ప్రాణాలు  కోల్పోగా అనేకమంది గాయాల పాలయ్యారు. సెంట్రల్ బాగ్దాద్‌లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు కలకలం సృష్టించాయి. తాయరన్ స్క్వేర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్న ఘటనలో 13 మంది మృతి చెందారని ప్రాథమిక నివేదికలు ద్వారా తెలుస్తోంది.  మరో  30 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్తానిక పోలీసులు వెల్లడించారు. ఇరాక్ రాజధానిలో నగరంలో 2017 తరువాత ఇదే అదిపెద్ద దాడి అని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement