మోసుల్: మోసుల్ ఉగ్రవాదుల కబంద హస్తాల్లో నలిగినలిగి తిరిగి ఇరాక్ వశమైన ప్రాంతం. అటు ప్రభుత్వ బలగాల దాడులకు, ఉగ్రవాదులు విసురుతున్న బాంబులకు మధ్య చిత్తయి దాదాపు ఏడారిగా మిగిలిపోయిన ప్రాంతం. ఎంతో కష్టపడి ప్రభుత్వ బలగాలు ఎట్టకేలకు ఐసిస్‌ను తరిమేశారు. ఇది గొప్ప విజయమే అయినప్పటికీ అక్కడ మిగిలిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు.. ఒక్క ఉగ్రవాదుల వదిలేసి పోయిన వాహనాలు తప్ప. అయితే, కేవలం వాహనాలే అని వాటిని తీసి పారేసి వీలు లేదు.
ఎందుకంటే వాటిని చూస్తే ప్రతి ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. బహుషా అలాంటి వాహనాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉపయోగించారు కనుకే మోసుల్‌ను ఇరాక్ స్వాధీనం చేసుకునేందుకు అంతగా కష్టపడాల్సి వచ్చిందేమో అని కచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఆ వాహనాల్నీ కూడా ఎంతో నాణ్యమైన ఎస్‌యూవీలు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలుగా తీర్చిదిద్దినవి. దాదాపు ఒక మిసైలో, రాకెట్ లాంచరో ఢీకొడితే తప్ప ధ్వంసం కాలేనంత బలంగా ఉగ్రవాదులు వాటిని తయారు చేసుకున్నారు. స్వయంగా వారు వాటిని తీర్చి దిద్దుకున్నారు. ఇప్పుడు అలాంటి వాహనాలు మోసుల్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు ఏడారిగా మారిన ఆ ప్రాంతంలో ఇరాక్ సైన్యం ఆ కార్లన్నింటిని స్వాధీనం చేసుకొని ప్రదర్శనకు పెట్టింది.
ప్రతి కారు కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతోపాటు చుట్టూ ఐరెన్ షీట్‌లతో కప్పి ఉండి కనిపించాయి. ఇవి యుద్ధ క్షేత్రంలో పరుగెడుతుంటే కచ్చితంగా రోబోల యుద్ధం జరుగుతుందా అనే భావన రావడం కూడా తథ్యం. ఏదీ ఏమైనప్పటికీ ఉగ్రవాదులపై పై చేయిసాధించిన ఇరాక్ బలగాలు పోలీసులు ఇప్పుడు ఆ వాహనాలన్నింటిని కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే కార్లకు పైభాగంలో రక్షణగా అమర్చిన ఇనుప తెరలను తొలగించి చూస్తున్న ప్రతి కారులో కూడా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు బయటపడుతున్నాయి.
ఐసిస్ కార్లు ఇవిగో.. చూస్తే ద్యావుడా అనాల్సిందే..
Published Fri, Jul 14 2017 4:50 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
Advertisement