
ఉగ్రవాదుల ఖేల్‌ఖతం.. 900 మంది హతం!
బాగ్దాద్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఖేల్ ఖతమవుతోంది. ఆ దేశంలోని ప్రధాన నగరం మోసుల్లో భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అతిపెద్ద పట్టణమైన మోసుల్కు ఉగ్రవాదుల నుంచి విముక్తి కలిగించే దిశగా సంకీర్ణ సేనలు ముందుకు సాగుతున్నాయి.
ఇప్పటికే 800 నుంచి 900 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇస్లామిక్ స్టేట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అడుగు కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా ఉగ్రవాదుల కోసం సేనలు మూకుమ్మడిగా గాలింపులు చేస్తున్నాయి.