ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే(59) హెల్మెట్ పెట్టుకుని పారిస్ వీధుల్లో రాత్రివేళ సంచరిస్తున్నారు. ఎందుకోసం.. ప్రియురాలి కోసం!
రాత్రివేళ హెల్మెట్ పెట్టుకుని పారిస్‌లో నటి ఇంటికి రాకపోకలు
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే(59) హెల్మెట్ పెట్టుకుని పారిస్ వీధు ల్లో రాత్రివేళ సంచరిస్తున్నారు. ఎందుకోసం.. ప్రియురాలి కోసం! అధ్యక్షుడి రహస్య ప్రేమాయణం పేరుతో ‘క్లోజర్’ అనే వార పత్రిక శుక్రవారం సంచికలో హాలండేపై ఏడు పేజీల కథనాన్ని ప్రచురించింది. హాలండే ఒక నటితో సంబంధం నడుపుతున్నారని.. ఆమె ఇంటికి హాలండే రాత్రి వేళల్లో స్కూటర్‌పై వెళుతున్నారంటూ రాసింది. ఇలా చేయడం వల్ల ఆయన భద్రతపై సందేహాలను లేవనెత్తింది. నటి జూలీగాయెట్(41) ఫ్లాట్‌లోకి వెళుతున్న హాలండే ఫొటోలను సదరు పత్రిక బయటపెట్టింది.